ఉద్యానశోభమన వ్యవసాయం

Curry Leaf Cultivation: కరివేపాకు సాగు లో యాజమాన్య పద్ధతులు

2

Curry Leaf Cultivation: రైతులు కొద్దిపాటి శ్రమ, మేలైన యాజమాన్య పద్ధతులతో కొన్ని రకాల వాణిజ్య పంటల్ని సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి పంటల్లో కరివేపాకు ఒకటి. ఈ పంట నమ్మకమైన దిగుబడుల్ని, ఆదాయాన్ని అందిస్తుంది. కరివేపాకు తోటలో పప్పుధాన్యాలు, ఆకుకూరల్ని అంతరపంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. కరివేపాకును నీటి పారుదల కింద, నీరు లేనప్పుడు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ఇది బహు వార్షిక కూరగాయ పంట. కరివేపాకు మొక్కలకు అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, అతి తక్కువగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకూ అనువైన వాతావరణంగా చెప్పొచ్చు.

Curry Leaves Farming

Curry Leaves Farming

వేపాకులా ఉంటుందని కరివేపాకు నల్ల (కరి) వేప అని అంటారు. కరివేపాకు ముర్రయా కొమెనిగి (స్ప్రింగెల్) రూటేసి జాతికి చెందిన మొక్క. ఇది నిలువుగా పెరిగే బహు శాఖీయ, బహు వార్షిక పొద. దీనిలో స్వజాతి సంపర్కం జరుగుతుంది. మొట్ట మొదటిగా దీని ఉనికిని భారతదేశంలో గుర్తించారు. ఇది భారతదేశం అంతటా ఉంటుంది. ఒక్క ఎత్తైన హిమాలయాల్లో తప్ప రావి నుండి సిక్కిం వరకు, అస్సాం, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. కరివేపాకు అకులను ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం లో , శ్రీలంకలో విరివిగా సువాసన కొరకు వాడతారు. తూర్పు ప్రాంతాలైనా బర్మా, మలేషియా, దక్షిణ ఆఫ్రికా దేశాలలో కూడా కరివేపాకును అధిక మొత్తంలో పండిస్తారు. ఈ మధ్యకాలంలో కరివేపాకు వాణిజ్య పంటగా ప్రధాన్యత సంతరించుకుంది.

వాతావరణం:

ఇది 37 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతను, 16 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. కానీ 16 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటె మొక్క పెరుగుదల తగ్గుతుంది.

నేలలు : వివిధ రకాల నేలల్లో కరివేపాకును సాగు చేయవచ్చు. నీరు నిలవని తేలికపాటి గరప నేలలు అనుకూలం. నీరు నిలిచే నల్లరేగడి భూములు సాగుకు పనికిరావు. మురుగు నీటి పారుదల వసతిగల ఎర్ర గరప నేలలు, ఒండ్రు నేలలు మంచివి. నీరు ఎక్కువయితే తట్టుకోలేదు.

విత్తే సమయం: సాధారణంగా ఖరిఫ్ (జూలై – ఆగస్టూ) లో విత్తుతారు.సాధారణంగా ఖరిఫ్ (జూలై – ఆగస్టూ) లో విత్తుతారు.

రకాలు:

దేశవాళీ రకాలు : ముదురు ఆకుపచ్చ రంగు గల ఆకులు, కాడలు కలవి. లేత ఆకుపచ్చ రంగు గల కాడలున్నవి.

సువాసిని : ధార్వాడ్ వారు సువాసిని (డి.డబ్ల్యు.డి – 1) అనే కరివేపాకు రకాన్ని విడుదల చేసారు. ఈ రకం ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో మెరుస్తూ ఎక్కువ సువాసన కలిగి ఉంటాయి. పిలక మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతాయి. మెట్ట ప్రాంతానికి అనుకూలం. కానీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలను ఈ రకం అంతగా తటుకోలేదు. నునేశాతం 5.2 శాతం. ఈ రకం 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా సువాసనను కోల్పాదు. అందుకని ఆరబెట్టి పొడి చేసుకోవడానికి ఇది మిక్కిలి అనువైన రకం.

Also Read: యాసంగిలో – వేరుశనగ పంట యాజమాన్యం

డి.డబ్ల్యూ.డి. – 2 : ఈ రకం ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సువాసన తక్కువ కానీ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. కణుపుల మధ్య దూరం చాలా ఎక్కవ. నునేశాతం 4.09 శాతం డబ్ల్యూ.డి – 1 కన్నా ఎక్కువ దిగుబడి ఇస్తుంది.

సెంకాంపు : ఇది తమిళనాడులోని కోయంబత్తూరూ జిల్లాలోని కరమాడై ప్రాంతంలో పండించాబడే రకం. ఆకు కాడ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఆకు ఎక్కువ నూనేశాతం, సువాసన కలిగి ఉంటుంది.

భువనేశ్వర్ : నీటి పారుదుల ప్రాంతాల్లో ఎక్కువగా సాగుచేయబడుతుంది.

నారుపోయడం : కరివేపాకు ముఖ్యంగా విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువ దిగుబడి గల మొక్కల నుండి బాగా పండిన పండ్లను సేకరించి వాటిని నారు మొలకల ఉత్పాత్తికి వాడాలి. ఈ విత్తనాలను నర్సరీ నందు కానీ లేక పాలిబ్యాగుల్లో (1:1:1 నిష్పత్తిలో ఇసుక : మట్టి : పశువుల ఎరువు నింపబడినవి) విత్తుకోవాలి. ఎకరానికి 250 కిలోల కాయలు లేదా 80-100 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను సేకరించి వెంటనే విత్తుకోవాలి. ఆలస్యంగా నాటుకుంటే మొలకశాతం తగ్గుతుంది. నారుమడులు (1 మీ. * 1 మీ. విస్తీర్ణంలో, 15 సెం.మీ ఎత్తుతో) తయారు చేసి వరుసల్లో 10 సెం. మీ. ఎండంతో విత్తనాలను విత్తుకోవాలి. గడ్డి కప్పి రోజుకు రెండుసార్లు నీటిని చల్లాలీ. పెద్ద మొక్కల చుట్టూ ఉన్న చిన్న మిక్కల్ని వేర్లతో జాగ్రత్తగా తీసి వర్షాకాలంలో వెంటనే మరల నాటడం వలన కూడా కరివేపాకు వ్యాప్తి చెందుతుంది.

నేలలురకాలు:

కరివేపాకు పైరు అధిక నీటిని తట్టుకోలేదు. అందువల్ల పొలంలో మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పనిసరి. ఏ మాత్రం తేమ నిలవని తేలికపాటి గరప నేలలు, నీరు నిలిచే నల్లరేగడి నేలలు ఈ పంటకు పనికిరావు. దీని సాగుకు ఎర్ర గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. కరివేపాకు సాగుకు డీడబ్ల్యూడీ-1, 2 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు రకాలూ మంచి సువాసన కలిగి ఉంటాయి. డీడబ్ల్యూడీ-1లో నూనె శాతం 5.22%, డీడబ్ల్యూడీ-2లో 4.09%ఉంటుంది. డీడబ్ల్యూడీ-1 రకం చలిని తట్టుకోలేదు. శీతాకాలంలో పైరు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఇక డీడబ్ల్యూడీ-2 రకం చలి తీవ్రతను కొంత వరకూ తట్టుకుంటుంది. డీడబ్ల్యూడీ-1 రకం కంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది.

నేల తయారీ : విత్తనాన్ని నేరుగా భూమిలో పెట్టడం ద్వారా మొక్క పెరుగుదలలో లోపాలు ఉండవచ్చు. కాబట్టి 1-1.5 సంవత్సరాలు మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందవచ్చు.

మొదటగా నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45*45*45 సెం.మీ. గుంతలను 1*1 మీ. దూరంలో తీయాలి. ఒక హెక్టారుకు పదివేల మొక్కలు అవసరం అవుతాయి. పశువుల ఎరువు ప్రతి గుంతకు 10 కిలోల చొప్పున వేయాలి.

ఎలా సాగు చేయాలి?

కరివేపాకు సాగుకు జూన్ నుంచి ఆగస్ట్ వరకూ అనుకూలంగా ఉంటుంది. కరివేపాకు పంటను ఎక్కువగా విత్తనం ద్వారా సాగు చేస్తారు. కొందరు రైతులు ముందుగా నారు పోసి మొక్కలు పెరిగాక ప్రధాన పొలంలో నాటు తారు. ఈ పద్ధతిలో కరివేపాకును సాగు చేయాలనుకుంటే ముందుగా చిన్న చిన్న పాలిథిన్ సంచుల్లో ఇసుక, మట్టి, బాగా చివికిన పశువుల ఎరువును 1:1:1 నిష్పత్తిలో వేయాలి. వాటిలో విత్తనాలు వేసి మొక్కల్ని పెంచాలి. సంచుల్లోని మట్టిపై రోజుకు రెండుసార్లు నీళ్లు చల్లుతూ ఉండాలి. విత్తనాలు మొలకెత్తడానికి మూడు నాలుగు వారాల సమయం పడుతుంది. మూడు నెలల వయసున్న మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఇక నేరుగా విత్తనాలు విత్తే వారు ముందుగా పొలాన్ని లోతుగా దున్నాలి. చివరి దుక్కిలో ఎకరానికి 10-12 టన్నుల పశువుల ఎరువుతో పాటు 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఆ తర్వాత గుంటక తోలి భూమిని చదును చేయాలి. తర్వాత సాళ్లలో విత్తుకోవాలి లేదా విత్తనాలు పొలం అంతటా సమానంగా పడేలా వెదజల్లాలి. విత్తనం కోసం చెట్ల నుంచి సేకరించిన పండ్లను మర్నాడే విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తితే మొలక శాతం తగ్గుతుంది. ఎకరానికి 200 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు విత్తిన తర్వాత గుంటక తోలి నీరు పెట్టాలి.

పెద్ద మొక్కల చుట్టూ వచ్చే పిలకల్ని తీసి కూడా నాటుకోవచ్చు. ఇందుకోసం తల్లి మొక్క దగ్గర వేరు నుంచి వచ్చే పిలకల్ని వేరుతో సహా తీసి వెంటనే నాటాలి. అయితే ఈ పద్ధతిలో కరివేపాకు సాగు చేయాలనుకుంటే వర్షాకాలంలో మాత్రమే మొక్కలు నాటాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.

తోటలో మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులు వేస్తూ ఉండాలి.

ఎరువులు : సాధారణంగా కరివేపకు కృత్రిమ ఎరువులు వాడరు. కానీ అధిక దిగుబడులు కోసం హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు, 60:10:10 కిలోల నిష్పిత్తిలో నత్రజని : భాస్వరం : పోటాష్ వేయాలి. సగ భాగం నత్రజని, మొత్తం భాగం భాస్వరం, పోటాష్ జూన్ మాసంలో వేయాలి. మిగతా సగం నత్రజని ఆరు మాసాల తర్వాత వేయాలి. ఈ ఎరువులు వర్షాకాలంలో వేసుకోవాలి.

నీటి యాజమాన్యం : మొక్కలు నాటిన వెంటనే బోదెల ద్వారా నీరు పెట్టాలి. వర్షం పడని సమయంలో వారానికి ఒకసారి నీరు పెట్టాలి.

అంతరకృషిఅంతర పంటలు : కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి. 1 మీ. ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచి వేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కవుగా వచ్చి గుబురుగా పెరుగుతుంది. పప్పుధాన్యాలు, ఆకు కూరలను అంతర పంటలుగా పండించవచ్చు.

సస్యరక్షణ : గొంగళి పురుగులు ఆకులను తిని నష్టపరుస్తాయి. నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొలుసు పురుగులు కాండం పై చేరి రసాన్ని పిల్చి వేస్తాయి. మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. నివారణకు డైమిధోయేట్ 2 మి. లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత 10 రోజుల వ్యవధి ఇచ్చి అకుకోయాలి. అకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రా. కార్బొండిజమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

దిగుబడికోత కోయటం : మొదటి సంవత్సరంలో నాటిన 7-15 నెలల్లో కోతకు వస్తుంది. మూడు సంవత్సరాల తర్వాత వాణిజ్య పరంగా కోతకు వస్తుంది. ఏడాదికి మూడు నుండి నాలుగు కోతలు వస్తాయి. ఎకరానికి ప్రతి కోతకు 1000 కిలోలు, సంవత్సరానికి 4000 కిలోల దిగుబడి వస్తుంది. ఇలా 20-25 సంవత్సరాల వరకు కోత కోయవచ్చు.

కోత తర్వాత: విత్తనాలు విత్తిన 9-10 నెలలకు పంట కోతకు వస్తుంది. అయితే మొదటి కోతలో కరివేపాకు దిగుబడి, ఆదాయం చాలా తక్కువగా ఉంటాయి. ఎకరానికి 800 నుంచి వెయ్యి కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి మూడు నాలుగు నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. రెండో సంవత్సరంలో ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేల కిలోల దిగుబడి వస్తుంది. అనంతరం ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మూడో సంవత్సరంలో ఎకరానికి 8-10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది.

కరివేపాకు కోసిన తర్వాత ప్రతిసారీ పొలంలోని కలుపు మొక్కల్ని తొలగించాలి. పైన తెలిపిన విధంగా నత్రజని, మ్యురేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసి నీరు పెట్టాలి. డ్రిప్ ద్వారా సాగు చేసినట్లయితే పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో నీరు, ఎరువులు అందించవచ్చు. తద్వారా దిగుబడుల్ని 15-20 శాతం పెంచుకోవచ్చు.

నిల్వ : ఆకును ఎండబెట్టి, పొడిచేసి నిల్వ చేసుకోవచ్చు. ఎండ బెట్టిన ఆకులు కూడా కొన్ని రోజుల వరకు రోజు వారి కూరలు, పచ్చళ్ళలో వాడుకోవచ్చు.

Also Read: అకాల వర్షాలతో రైతన్న కుదేలు.. చేతికొచ్చిన పంట దెబ్బతిందని దిగులు

Leave Your Comments

Soya Bean Cultivation: సోయాబీన్ పంట విత్తనోత్పత్తి లో మెళుకువలు

Previous article

Fish Nutrition: మంచి నీటి చేపల చెరువులో పోషక యాజమాన్యం

Next article

You may also like