టమాట సాగుకు అనువైన రకాలు

తెలుగు రాష్ట్రాల్లో టమాట సుమారుగా 4,77,447 ఎకరాల్లో సాగు చేయబడుతూ 65,16, 184 టన్నుల దిగుబడినిస్తుంది.

మారుతమ్

పండ్లు గుండ్రంగా, మధ్యస్థంగా వుంటాయి. ఇది వేసవి కాలానికి అనుకూలమైన రకం. పంటకాలం 135-140 రోజులు. ఎకరానికి 12-14 టన్నుల దిగుబడినిస్తుంది.

అర్క వికాస్

ఈ రకం వేసవి పంటకు అనుకూలం. పండ్ల పరిమాణం పెద్దగా, గుండ్రంగా చదునుగా ఉంటుంది. దీని పంటకాలం 105-110 రోజుల వరకు ఉంటుంది. మరియు ఎకరానికి 14.5-16 టన్నుల దిగుబడిని ఇస్తుంది.

పూసా రూబీ

ఈ రకం నాటిన 60-65 రోజులకే కోతకు వస్తుంది. పండ్ల పరిమాణం మధ్యస్థంగా వుండి లోతైన గాళ్ళు కలిగివుంటాయి. దీని మొత్తం పంటకాలం 130-135 రోజులు. మరియు ఇది ఎకరాకు 12 టన్నుల దిగుబడిని ఇస్తుంది.

పి.కె.యం.-1

ఈ రకం అన్ని కాలాలలో సాగుచేయడానికి అనుకూలంగా ఉంటుంది. మొక్కలు చిన్నవిగా ఉండుట వలన ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటవచ్చును. దీని కాలపరిమితి 130-135 రోజులు. ఇది ఎకరాకు 10-12 టన్నుల దిగుబడిని ఇస్తుంది.

పూసా ఎర్లీడ్వార్ఫ్

దీని పంట కాలం 120-130 రోజుల్లో పూర్తవుతుంది. మరియు నాటిన 60 రోజుల లోపే కాపునిస్తుంది. దిగుబడి ఎకరాకు 12 టన్నులు వరకు వస్తుంది.