తెలంగాణమన వ్యవసాయంవార్తలు

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత-మంత్రి తుమ్మల

0
ఈ రోజు ట్రీడెంట్ హోటల్ హైటెక్ సిటీ లో జరిగిన సదరన్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్  లో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
1. రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా ₹12,000 అందిస్తూ, ఇప్పటివరకు ₹35,839 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం.
2. వానాకాలం 2026లో కేవలం 9 రోజుల్లోనే 70.40 లక్షల పట్టాదారులకు ₹8,759 కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా ఖాతాల్లో జమ చేశాం.
3. రైతు రుణమాఫీ ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి ₹2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశాం. దాదాపు 25 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తూ, సుమారు ₹21,000 కోట్లు ఖర్చు చేశాం.
4. రైతు బీమా ద్వారా గత మూడు సంవత్సరాల్లో ₹3,531 కోట్ల ప్రీమియం చెల్లించి, 42 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు భద్రత కల్పించాం.
5. సాంకేతికతను వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగిస్తున్నాం. రైతు నేస్తం ద్వారా రైతులకు నిపుణుల సలహాలు అందిస్తున్నాం. యూరియా యాప్ ద్వారా యూరియా పంపిణీని సరళంగా, న్యాయంగా, పారదర్శకంగా అమలు చేశాం.
6. ఆయిల్‌పామ్ సాగును తెలంగాణలో పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. దాదాపు 1 లక్ష హెక్టార్లను అదనంగా ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురాగా, 72 వేల మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
7. ఆయిల్‌పామ్ రైతులకు ధర భద్రత కల్పించాలి. క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించడంతో పాటు, తాజా ఆయిల్‌పామ్ గెలలకు (FFBs) టన్నుకు ₹25,000 కనీస గ్యారంటీ ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి .
8. MSP కంటే మార్కెట్ ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం స్వయంగా కొనుగోళ్లు చేపట్టింది. మొక్కజొన్నకు సుమారు ₹6,000 కోట్లు, జొన్నకు ₹1,100 కోట్లకు పైగా విలువైన కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం.
9. MSP అమలులో కేంద్ర–రాష్ట్రాలు కలిసి బాధ్యత వహించాలి. మొక్కజొన్న, జొన్నలను PSS కింద NAFED వంటి కేంద్ర సంస్థల ద్వారా సమర్థవంతంగా కొనుగోలు చేయాలి. ధరలు MSP కంటే తక్కువగా ఉన్నప్పుడు 25% PSS పరిమితిని సడలించాలి లేదా తొలగించాలి. రాష్ట్రాలు అదనంగా చేసే కొనుగోళ్ల ఖర్చులో కేంద్రం భాగస్వామ్యం కావాలి.
10. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు అవసరం. ఎల్‌నినో, అనిశ్చిత వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక El Niño Assistance Fund ఏర్పాటు చేసి, మైక్రో ఇరిగేషన్ మరియు నీటి పొదుపు చర్యలకు కేంద్రం మరింత సహాయం అందించాలని కోరిన మంత్రి .
Leave Your Comments

ఎల్‌నినో–2026 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయం ప్రస్తుత పరిస్థితులు, ప్రభావాలు మరియు భవిష్యత్‌ కార్యాచరణ

Previous article

పురుగుమందు అసలైనదేనా? క్యూఆర్ కోడ్ చెబుతుంది

Next article

You may also like