మన వ్యవసాయం

Honey Hive Management: వివిధ  కాలాలలో తేనెటీగల యాజామాన్యం

0
Honey Hive Management
Honey Hive Management

Honey Hive Management:

1.తేనె ప్రవాహ  కాలంలో నిర్వహణ:

❖ తేనె నిల్వ కోసం పెట్టెలో తగినంత స్థలాన్ని అందించడం.

❖ రాణి తేనెటీగ కదలికను సూపర్ ఫ్రేమ్‌లో పరిమితం చేయడానికి  క్వీన్ ఎక్స్‌క్లూడర్‌ను ఉపయోగించాలి. 

❖ కొత్త తెట్టే  తయారు చేయడానికి  ఫౌండేషన్ షీట్‌లతో ఖాళీ ఫ్రేమ్‌లను బీ హైవ్ లో  అమర్చాలి. 

❖ సూపర్‌ని తనిఖీ చేసి  మరియు తేనె కోసం పూర్తిగా మూసివేసినప్పుడు సూపర్ ఫ్రేమ్‌లను తీసి తేనె వెలికితీయాలి. 

Honey Hive Management

Honey Hive Management

  1. పుప్పొడి అందుబాటులో లేని కాలంలో నిర్వహణ:

❖ బ్రూడ్ ఛాంబర్‌లోని ఖాళీ తెట్టెలని  తొలగించాలి. 

❖ డమ్మీ డివిజన్ బోర్డ్‌ని ఉపయోగించి  తేనెటీగల కదలికలను కొద్ది ప్రాంతానికి  పరిమితం చేయాలి. 

❖ చక్కెర సిరప్‌తో కృత్రిమంగా ఆహారాన్ని అందించాలి. 

❖ సహజ పుప్పొడి లేదా పుప్పొడి ప్రత్యామ్నాయం లేదా పుప్పొడి సప్లిమెంట్  అందించాలి. 

❖ ఖాళీ తెట్టెలను సరిగ్గా నిల్వ చేయాలి. 

❖ కాలనీలు చాలా బలహీనంగా ఉంటే వాటిని ఏకం చేయాలి.

Also Read: తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్న మహిళలు

Bee keepers

Bee keepers

  1. ప్రత్యేక నిర్వహణ పద్ధతులు:

❖ గాలులు మరియు వర్షపు రోజులలో చక్కెర సిరప్ అందించండి.

❖ వేసవిలో  తేనెటీగలకు వెంటిలేషన్‌ను పెంచడం కొరకు బ్రూడ్ ఛాంబర్ మరియు సూపర్ ఛాంబర్ల మధ్య స్ప్లింటర్ అమర్చాలి. 

❖  పురుగు మందులను పిచికారీ చేసినపుడు తేనెటీగలను  నుండి రక్షించడానికి ప్రవేశ ద్వారం ఒక్క రోజు పాటు మూసివేయాలి. 

❖ కాలనీ అత్యంత దూకుడుగా ఉంటే రాణిని బదిలీ  చేయాలి. 

❖ తేనెటీగలను ఇతర ప్రదేశాలకు తరలించడం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి.

Honey Bee

Honey Bee

  1. షుగర్ సిరప్ తయారీ:

❖ వేడినీటిలో చక్కెరను కరిగించండి (1:1 పలుచన)

❖ నీటిలో చెక్కరను కలుపుతూ పూర్తిగా కరిగించాలి.

Also Read: తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించడానికి ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోండి….

Leave Your Comments

Mulberry Cultivation: వర్షాధారిత  పరిస్థితులలో మల్బరీ సాగు

Previous article

Waste Decomposer: వ్యర్థాలతో వ్యవసాయం- రైతులకు డీకంపోసర్ వరం

Next article

You may also like