ఎండు తెగులు: ఈ తెగులు ప్యుజేరియం ఉడమ్ అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు: ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంత భాగం గాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి.
నివారణ: ఈ తెగులు అధికముగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి.
ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి.పి.యల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకొంటాయి.
వెర్రి తెగులు (స్టెరిలిటి మొజాయిక్ ): ఇది వైరస్ తెగులు
వ్యాధి లక్షణాలు: తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది పూత పూయదు. ఈ తెగులు నల్లి మైట్స్ ద్వారా వ్యాపిస్తుంది.
నివారణ: లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మీ.లీ కెలోదీన్ ను కలిపి వారానికికొకసారి రెండు దఫాలు పిచికారి చేయాలి. ఈ తెగులును తట్టుకోగల ఐ.సి.పి.యల్ 87119, ఐ.సి.పి.యల్ 85063, ఐ.సి.పి.యల్ .853, బి.యస్.ఎమ్.ఆర్ .736 రకాలను సాగుచేయాలి.
మాక్రోఫోమినా ఎండు తెగులు: ఈ తెగులు మాక్రోఫోనియా అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు: ముదురు మొక్కల కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్య భాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండి పోతాయి. యం.ఆర్.జి. 66 కంది రకం ఈ తెగులును తట్టుకొంటుంది. ఈ తెగులు నివారణకు పంట మార్పిడి పాటించాలి.