తెలంగాణ సేద్యంవార్తలు

TS గిడ్డంగుల సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ….

0
officer posts TS

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం గురువారం (23-09-2021)ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించింది. వివిధ వ్యవసాయ కళశాలలకు చెందిన 50 మంది విద్యార్ధులు ఈ క్యాంపస్ ఇంటర్వూలకు హాజరయ్యారు. విశ్వవిద్యాలయ విద్యార్ధి వ్యవహారాల డీన్ డాక్టర్  జె . సత్యనారాయణ (J.Sathyanarayana), రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్. నరేందర్ రెడ్డి (Narendhar Reddy) సమక్షంలో ఇంటర్వూలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎం.డి జి . జితేందర్ రెడ్డి (M.D.G Jithendhar Reddy), టిఎస్ డబ్లూసి  జనరల్ మేనేజర్ రమణమూర్తి (Ramanamurthy), మహమ్మద్ ముజిబూర్ రహమాన్ (Mujibur Rahaman), ఎం.ఎ. రహీమ్ (M.A Raheem) తదితరులు పాల్గొని ఇంటర్వూలు నిర్వహించారు.

Leave Your Comments

రైతుభీమా పథకం అర్హుల కథనాలపై స్పందించిన  రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ రఘునందన్ రావు గారు

Previous article

సెప్టెంబర్ 27న భారత్ బంద్ కు పిలుపు  మంత్రి పేర్ని నాని కామెంట్స్

Next article

You may also like