పశుపోషణ

కోళ్ళలో సూపర్‌బగ్స్..

0
Antibiotic Use in Poultry Farming

Antibiotic Use in Poultry Farming నానాటికి చికెన్ లవర్స్ పెరుగుతున్నారు. ఒకప్పుడు వారంలో ఒకసారి మాత్రమే చికెన్ లాగించేవారు. కానీ ఇప్పుడు వారంలో మూడు సార్లు అయినా చికెన్ రుచి చూడకపోతే ముద్ద దిగదు అంటున్నారు చికెన్ ప్రియులు. ఇక చికెన్ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారాలు అడ్డదార్లు తొక్కుతున్నారు. కోళ్లను తక్కువ సమయంలో ఎదిగేందుకు అనేక రసాయనాలు కోళ్ల శరీరంలోకి పంపిస్తున్నారు. ఇలా కోట్లతో వ్యాపారం చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అది తెలియక వారంలో మూడు సార్లు చికెన్ ని లాగించేస్తూ మనకు తెలియకుండానే రోగాల బారీన పడుతున్నాము.

Antibiotic Use in Poultry Farming

ఈ మధ్య కోళ్ళలో యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడటం వల్ల కోళ్ల పెంపకంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌ (poultry farming in Bangladesh)లో పౌల్ట్రీ పెంపకంలో మితిమీరిన యాంటీబయాటిక్‌ల వినియోగం వల్ల సూపర్‌బగ్స్ ఏర్పడుతున్నాయి. దీనిని సంప్రదాయ చికిత్సా పద్ధతులతో నివారించడం అసాధ్యం. బంగ్లాదేశ్ లైవ్‌స్టాక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో ఢాకాలోని 29 మాంసం మార్కెట్‌ల నుంచి సేకరించిన చికెన్ శాంపిల్స్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. Antibiotic Use in Poultry Farming

Antibiotic Use in Poultry Farming

Rooster vaccination on the farm

యాంటీబయాటిక్స్ అందించిన కోళ్ళలో ఇమ్మ్యూనిటి పవర్ అధికంగా ఉంటుంది. ఈ తరహా కోళ్ళలో 6.7 శాతం నుండి మొదలుకుని 100 శాతం వరకు ఇమ్మ్యూనిటి పవర్ ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. ఇలా అధికంగా ఇమ్యూనిటీ పవర్ ఉన్న కోళ్లను తింటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. పౌల్ట్రీ, జంతువుల పేగులలో నివసించే ఇటువంటి బ్యాక్టీరియా మానవుల కడుపులోకి చేరుతుందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. బాయిలర్‌ చికెన్ ఉత్పత్తిలో యాంటీబయాటిక్స్ అత్యధికంగా వాడుతున్నారు. ఆ తర్వాత సోనాలి చికెన్ ఉత్పత్తిలో వాడుతున్నారు. దీనివల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా విస్తరిస్తోంది. పౌల్ట్రీ ఫామ్‌లలో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. Poultry Farming

Leave Your Comments

ఆర్గానిక్ వ్యవసాయంపై మోడీ ప్రసంగం

Previous article

నల్ల తామర పురుగు కలకలం..

Next article

You may also like