వార్తలు

రైతునేస్తం అవార్డ్స్ .. అభినందించిన డాక్టర్ వి.ప్రవీణ్ రావు

0
VC Dr. Praveen congratulates on receiving Raitunestham Awards
VC Dr. Praveen congratulates on receiving Raitunestham Awards

రైతునేస్తం అవార్డులు పొందిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అభినందించారు. విస్తరణ విభాగంలో రైతునేస్తం అవార్డు పొందిన విశ్వవిద్యాలయ ప్రజాసంబంధాల అధికారి వన్నోజ్. సుధాకర్, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ మధుబాబులు సోమవారం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌ కుమార్‌ను కలి సారు. అవార్డు వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను ఉపకులపతి, రిజిస్ట్రార్‌కు అందజేశారు. ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు, విశ్వవిద్యాలయ అధికారులకు అవార్డులు రావడంపట్ల అభినందనలు తెలిపారు. విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, డాక్టర్ సుధీర్‌కుమార్, డాక్టర్ ఆర్.జగదీశ్వర్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సీమ, డాక్టర్ జె.సత్యనారాయణ, డాక్టర్ అనిత ప్రత్యేకంగా అవార్డు గ్రహీతలను అభినందించారు.

#VC Dr. Praveen #RaitunesthamAwards2021 #eruvaaka 

Leave Your Comments

అగ్రికల్చర్ కోర్సులో మార్పులు అవసరం…

Previous article

మిల్లర్ల పాత్ర తొలగింపు : ఏపీ సీఎం

Next article

You may also like