వార్తలు

ఇంటర్నేషనల్ కాఫీ డే – కాఫీ వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు

0

ఇవాళ (అక్టోబర్ 1 న) అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అదే విధంగా అతిగా కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడమే ఈ రోజు ప్రత్యేకత. అలాగే కాఫీ వర్తకం గురించి చర్చిస్తూనే పనిలో పనిగా కాఫీని జీవనోపాధిగా చేసుకునే వాళ్లకు మద్దతు ప్రకటించే రోజు కూడా. ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవరసాయనాలుంటాయి. కెఫిన్, డైటర్ పిన్స్, డైఫీనాల్స్ వంటివి బాడీని చురుకుగా ఉంచుతాయి. ఒక కప్పు కాఫీ తాగగానే బాడీలో కాస్తంతైనా తేడా కనిపిస్తుంది. అయితే ఇది మనుషులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి హైబీపీ, బాడీలో కొవ్వులు పాళ్ళు ఎక్కువగా ఉండటం ఉన్నాయనుకుందాం. సాధారణ వ్యక్తుల్లో కాఫీ కనబరిచే ప్రభావాన్ని, ఆ జబ్బులున్న వాళ్లలో చూపే ప్రభావానికి తేడాలుంటాయి.
2015 నుంచి ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కాఫీ డే నిర్వహిస్తూవస్తోంది. కొన్ని దేశాల్లో ఇది వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కువ దేశాలు మాత్రం అక్టోబర్ 1 నే జరుపుతున్నాయి. ఈ కారణం వల్లే అక్టోబర్ 1 ని అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా పాటిస్తున్నారు.
కాఫీలో బోలెడన్ని మంచి గుణాలున్నాయి. కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే అది పక్షవాతాన్ని నివారిస్తుంది. కాఫీలో డైఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. కాఫీ బాడీని ఉత్తేజితంగా ఉంచుతుంది. అయితే ఈ బెనిఫిట్స్ కోసం కేవలం రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి.

కాఫీలో ఉండే కెఫిన్ అనే ఉత్ప్రేరక పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. మనం కాఫీ తాగి తాగగానే దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే అది సాధారణం కంటే 8 ఎం.ఎం./హెచ్ జీ ఎక్కువవుతుంది. అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎం.ఎం/హెచ్ జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీ తాగిన తర్వాత కనీసం గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్త గా ఉండాలి.
కాఫీలో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే యాంటీ మైగ్రేన్ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. లేకుంటే అవసరం లేని మాత్ర వేసుకుంటే కలిగిన సైడ్ ఎఫెక్ట్ కలిగినట్లే.
కాఫీ యాంగ్జైటీ మరింత పెంచుతుంది. కొందరిలో దేహాన్ని వణికేలా కూడా చేస్తుంది.
రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా (నీటి కాసులు) కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి.
కాఫీ మూడు కప్పులు మహా అయితే నాలుగు కప్పులు మించకుండా తాగితేనే దేహానికి, ఆరోగ్యానికి మేలని గుర్తుంచుకోండి. ఎలా తాగితే అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయో తెలుసుకుని అలా మాత్రమే వాటిని తాగండి. ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ కాఫీ డే

Leave Your Comments

పశువులకు పుష్టి – హెర్బల్ మిక్చర్

Previous article

పంటల మద్దతుధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Next article

You may also like