ప్రతి ఒక్క విటమిన్ మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే మనం తినే కాయగూరల్లో, పప్పు దినుసులలో ఈ విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. విటమిన్స్ లోపం వల్ల ముఖ్యంగా విటమిన్ బి12 గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి విటమిన్ బి12 చాలా ముఖ్యం. అంతేకాకుండా నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్న కూడా ఈ విటమిన్ బి12 చాలా అవసరం. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా చాలామంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. అయితే ఈ లోపాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విటమిన్ బి12 ముఖ్యంగా ఎవరెవరిలో తక్కువగా ఉంటుంది అంటే మాంసాహారం తినని వారిలో, మద్యపానం, ధూమపానం సేవించే వారిలో, డయాబెటిస్, అసిడిటీ అలాగే దీర్ఘకాలంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్న వారిలో ఈ విటమిన్ బి12 లోపం వల్ల నీరసం, అలసట, మలబద్దకం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం, అలాగే జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణాశయం, మూత్రాశయ సమస్యలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మాంసాహారం అయినా చికెన్, మతం, ఫిష్ లలో ఈ విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం ద్వారా ఈ విటమిన్ల లోపాన్ని సరి చేసుకోవచ్చు. ఇక శాకాహాహారులైతే పాలు, బాదం పప్పు, వెన్న వల్ల కూడా ఈ విటమిన్ల లోపాన్ని సరి చేయవచ్చు.