ఆంధ్రా వ్యవసాయం

ఖర్భూజ సాగులో యాజమాన్య పద్దతులు

0

కర్భూజ సాధారణంగా 30 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు పొడి వాతావరణంలో పండించ గలిగే స్వల్ప కాలిక వాణిజ్య పంట. సాధారనంగా 27-30 డిగ్రీల ఉష్ణోగ్రతలో విత్తన మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. పూత సమయంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే పిందెలు తక్కువగా ఏర్పడుతాయి.

నేలలు:  ఉదజని సూచిక 6.0 నుండి 7.0 ఉన్న నేలలు సాగుకు బాగా అనుకూలం.

రకాలు: అర్క జీత్, అర్క రాజహాన్స్, దుర్గాపుర మధు, హరా మధు, పంజాబ్ హైబ్రిడ్, పూస మధురస్, పూస రస్ రాజ్. ప్రైవేట్ రకాలు: ఎన్. ఎస్. 910, ఎన్. ఎస్. 7455, సన్-2, సూర్య, సూరజ్, కుందన్, గోల్డెన్ గ్లోరీ, గాయత్రి, కాంచన్ మరియు కోహినూర్ మొదలైనవి.

విత్తన మొతాదు: సూటి రకాలు 500-600 గ్రాములు ఎకరాకు మరియు హైబ్రిడ్ రకాలు 300 గ్రాములు ఎకరాకు.

ఎరువులు: నేలకు దుక్కిలో ఒక ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 300 కిలోల వేపచెక్క, 100 కిలొల సూపర్ ఫాస్పేట్, 50 కిలోల పొటాష్ మరియు 50 కిలోల నత్రజని ఎరువులను వేసుకోవాలి.  నేలను బాగా దున్ని 6 అంగుళాల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పుతో బొదెలు తయారు చేయాలి. మొక్కలు నాటే దూరం 4-6 x 1-2 అడుగుల దూరంలో నాటాలి. నాటిన తర్వాత మొక్క 2  నుండి 4  ఆకుల సమయంలో ఉన్నప్పుడు మొదటి సారి బోరాన్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రెండవ సారి నాటిన 50 రోజుల సమయంలో అదే మోతాదులో కలిపి పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడ పుష్పాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పడి, ఫలదీకరణం జరిగి అధిక శాతంలో పిందెలు ఏర్పడును. నాటిన 50 రోజుల సమయంలో పిచికారి చేయడం వల్ల కాయలు పగల కుండా ఎక్కువ నాణ్యతను కలిగి ఉంటాయి.

పంట కోత: కాయలు పక్వ దశకు వచ్చే సమయంలో మార్కెట్ సదుపాయాన్ని చూసుకోని కోయాలి. సాధారణంగా మర్కెట్ దూరంగా వున్న ప్రదేశాలకు తరిలించాలనుకుంటే కాయలు సగం పక్వ దశకు రాగానే పంట కోసి తరలించాలి. ఈ సమయంలో కాయలు పక్వము చెంది, నాన్యత కూడ బాగా ఉంటుంది. అదే దగ్గరగా వున్న ప్రదేశాలకు తరిలించాలనుకుంటే కాయలు పూర్తి పక్వ దశకు వచ్చాక పంట కోసి తరలించాలి. పూర్తి పక్వము చెందిన కాయలలో చక్కెర శతం ఎక్కువుగా ఉంటుంది. సాధారనంగా చక్కెర శాతాన్ని వాతావరణం, చీడపీడలు మరియు మొక్క ఎదుగుదల ప్రభావితం చేస్తాయి.

సస్యరక్షణ:

బూడిద తెగులు: ఇది పొడి వాతావరణ కాలాల్లో ఎక్కువగాను తేమతో కూడిన వాతావరణంలో తక్కువగాను ఆశిస్తుంది. ప్రధానంగా ఆకులపై భాగంలో తెల్లని బూడిద వంటి శిలీంద్రం పెరుగుతుంది. కాని కొన్ని సందర్భాలలో ఆకు అడుగున మరియు కాండంపై కూడా కనిపిస్తుంది. తెగులు ఆశించిన ఆకులు పసుపు రంగుకు మారి వడలిపోతాయి. ఆకులు మరియు కాండం ఎండిపోవడం వలన తీగ సాగదు, కాయలు తక్కువగా, చిన్నవిగా ఉంటాయి.

నివారణ: ఈ తెగులు నివారణకు దోస జాతి సంబంధమైన అడవి మొక్కలను దగ్గరలో పెరగకుండ పీకి వేయాలి. పంట అవశేషాలను తగుల బెట్టాలి. దీని నివారణకు ట్రైడిమార్ఫ్ 1 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోబిన్ 0.1 గ్రా. లేదా మైక్లోబుటానిల్ 1 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 1 గ్రా. లేదా డైఫెనకొనజోల్ 0.5 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు.

పండు ఈగలు:

ఈ పండు ఈగలు దోసజాతి  కూరగాయలను దేశంలో అన్ని ప్రాంతాలలో ఆశిస్తాయి. లార్వాలు కాయలలో గజ్జుని తిని కలుషితం చేస్తాయి. ఈ దశలో తల్లిపురుగులు గ్రుడ్లను పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా రసం కారడం గమనించవచ్చును. ఈ రంధ్రాల ద్వారా శిలీంధ్రము మరియు బాక్టీరియా ప్రవేశించి కాయ కుళ్ళటమే కాక కాయలు ఎదగక ఆకారం కోల్పోయి చివరిగా రాలిపోతాయి.

దోసవెర్రి తెగులు లేక మొజాయిక్:

మొజాయిక్ లక్షణాలు మొదట లేత ఆకులపై కన్పిస్తాయి. క్రమేపి ఇట్టి ఆకులు క్రిందకు ముడుచుకొని, ఆకారంగా కోల్పోయి, గరుకుగా, పరమాణం తగ్గి కన్పిస్తాయి. మొక్కల కణుపులు దగ్గరగా అవటం వలన తీగ సరిగ్గా సాగకుండా లేత ఆకులు గులాబి పూవ్వు మాదిరిగా ఒక్క చోటనే అంటిపెట్టుకొని ఉంటాయి. కాయలు  తరచు ఆకారం కోల్పోయి బొబ్బలతో కన్పిస్తాయి.

ఈ వైరస్ కలుపు మొక్కలు, అలంకరణకు ఉపయోగపడే మొక్కలు మరియి ఇతర చాలా మొక్కలను ఆశిస్తుంది. ఈ వైరస్ పేను ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక మొక్క నుంచి ఇంకొక దానికి పొలంలో పని చాసే మనుషుల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకి దీర్గకాలం జీవించు కలుపు మరియు పుష్పించి మొక్కలను నాశణం చేయడం, వీటికి దగ్గరగా దోసను పండించకుండా ఉండడం, పేనును నివారించడం వలన దీని ఉదృతి తగ్గించవచ్చు.

Leave Your Comments

ఖర్జూరాలు కాదు… కొబ్బరి కాయలే

Previous article

సేంద్రీయ వ్యవసాయంలో యాజమాన్య పద్దతులు

Next article

You may also like