ఆంధ్రా వ్యవసాయంజాతీయంరైతులువార్తలు

Niti Aayog Natural Farming Intiative: సహజ వ్యవసాయం యొక్క విజయ గాథల సంగ్రహం

0
Niti Aayog Natural Farming Intiative
Niti Aayog Natural Farming Intiative

Niti Aayog Natural Farming Intiative: సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా, నీతి ఆయోగ్ (Niti Aayog) దాని అవసరాన్ని గుర్తించింది. వివిధ సహజ సాగు విధానాల యొక్క సాక్ష్యాలను సృష్టించడం, ధృవీకరణ వంటి అంశాలపై కృషి చేస్తుంది. దీనిపైన పరిశోధన కార్యకలాపాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఈ దిశలో వివిధ ప్రాంతాలలో రైతులు అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను సేకరించి డాక్యుమెంట్ చేయడం దీని యొక్క బాధ్యత.

Niti Aayog Natural Farming Intiative

Niti Aayog Natural Farming Intiative

ఈ విజయగాథలు కృషి వంటి అధికారిక ఛానెల్‌ల ద్వారా, భారతదేశం అంతటా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK). రైతులు తరచుగా తమ సొంతంగా అభివృద్ధి చేసిన పద్దతులు, సహజ వ్యవసాయ సూత్రాలైన పొలం ఎరువు (FYM), వర్మికంపోస్ట్ వాడకం, బహుళ పంటల సాగు మరియు తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు మరియు పువ్వుల తరువాత సాగు వంటివి ఉన్నాయి.

Also Read: Woman Farmer Success Story: ఇంట్లో ‘మినీ ఫారెస్ట్’

ఈ సంవత్సరం ప్రకటించిన సహజ సాగు సూత్రాల సంకలనం లో 110 రైతులకు స్థానం దక్కగా అందులో 21 మంది ఆంధ్ర ప్రదేశ్ రైతులు ఉండడం తెలుగు వారికి గర్వకారణం. ఇందులో

i. శ్రీ అచిర్తి నారాయణమూర్తి
ii. శ్రీమతి అనుగుల వెంకట సుగుణమ్మ
iii. శ్రీమతి బెల్లాన శ్రీదేవి

Woman Farmer -Bellana Sridevi

Woman Farmer -Bellana Sridevi

iv. శ్రీ ఆర్. భాస్కర్ రెడ్డి
v. శ్రీ చందు సత్తిబాబు
vi. శ్రీ ఎస్ దిలీప్‌కుమార్
vii. శ్రీమతి గమ్మెలి లక్ష్మి
viii. శ్రీ గెడ్డ అప్పలనాయుడు
ix. శ్రీమతి హనుమంతు ముత్యాలమ్మ
x శ్రీ కంటిపూడి సూర్యనారాయణ
xi శ్రీ కిల్లో ధర్మారావు
xii. శ్రీ కొత్తపల్లి శివ రామయ్య
xiii. శ్రీ మాగంటి చంద్రయ్య
xiv. శ్రీ మన్నేటి గంగి రెడ్డి
xv శ్రీమతి ముప్పాల నిరమలమ్మ
xvi శ్రీమతి వై.పద్మావతమ్మ
xvii. శ్రీ బి. రామకోటేశ్వరరావు
xviii.శ్రీ సాయం రఘునాథ్
xix. శ్రీ బి శ్రీనివాసరావు
xx. శ్రీ కె. వెంకటరమణ
xxi. శ్రీమతి T. యామిని గారు ఉన్నారు.

వీరిలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ గారి సతీమణి, చీపురుపల్లి ఉప సర్పంచ్‌ అయిన బెల్లాన శ్రీదేవి గారు ఉండడం గమనార్హం.

Also Read: Organic Woman Farmer: సేంద్రియ వ్యవసాయంతో వరిలో అధిక దిగుబడి సాధించిన మహిళా రైతు

Leave Your Comments

Ash Gourd Health Benefits: బూడిద పొట్లకాయతో ప్రయోజనాలు

Previous article

Niti Aayog Woman Farmer: నీతి ఆయోగ్ ఉత్తమ మహిళా రైతుగా ఎంపీ సతీమణి.!

Next article

You may also like