ఆంధ్రా వ్యవసాయం

Andhra is going Bananas: అరటి సాగులో దేశంలోనే ఏపీ టాప్. చెబుతున్న కేంద్ర గణాంకాలు.!

0
Andhra is going Bananas
Andhra Pradesh Is Top State In Banana Cultivation In The Country

Andhra is going Bananas: అరటిసాగు ఇటివల కాలంలో బాగా పెరిగిపోతున్న చాలామంది రైతులు యాజమాన్య పద్ధతులు పాటించలేక పోతున్నారు. 12 నెలలు పాటు సాగే ఈ పంటలో రైతులు అధిక దిగుబడులను సాధిస్తున్నారు. సంవత్సరం మొత్తం ఈ పంట రావడంతో రైతులు ఎక్కువగా ఈ పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు. దాదాపు సంవత్సరం అంతా డిమాండ్ ఉండే ఏకైక ఫలమే ఈ కథలి ఫలం. అయితే ఈపంట ఎక్కువగా గోదావరి జిల్లాల్లో సాగు చేస్తున్నారు. తరువాత క్రమంగా ఇతర జిల్లాలకు పాకింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన అరటి సాగు మాత్రమే కనిపిస్తుంది. అంతేకాకుండా అంతర పంటల్లో కూడా ఇదే పంటను సాగు చేస్తున్నారు. మరియు రావులపాలెం మార్కెట్ కూడా అందుబాటులో ఉండడంతో రైతులు ఈ పంట పై మక్కువ చూపుతున్నారు. ఈ నేపద్యంలో అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు దాదాపుగా నాలుగేళ్ళ నుంచి అరటి సాగులో ఏపీ టాప్‌లోనే నిలుస్తుందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. .

“అ” అంటే అరటి … “ఆ” అంటే ఆంధ్ర ప్రదేశ్

అ అంటే అరటి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు హార్టికల్చర్ అధికారులు. అయితే ఇది ఇప్పుడే కాదు. దాదాపుగా నాలుగేళ్ళ నుంచి అరటి సాగులో ఏపీ టాప్‌లోనే నిలుస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ సాక్షిగా కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021-22లో ఆహార, వ్యవసాయోత్పత్తుల సంస్థ సేకరించిన గణాంకాల ప్రకారం 56.84 లక్షల టన్నులు అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది.

Also Read: Youth and Agriculture: వ్యవసాయ పనుల్లో బిజీగా విద్యార్థులు, కూలీలకు పోటీగా నాట్లు.!

Banana Farming

Banana Farming

అనంతలో అరటి క్లస్టర్

ఆంధ్రప్రదేశ్ లో అరటిసాగు ఎక్కువగా సాగు చేయడం ద్వారా కొన్ని జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. దీనిలో భాగంగా హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైంది. అనంతపురం తో పాటు తమిళనాడులో థేని జిల్లాను కూడా బనానా క్లస్టర్ పైలెట్ కింద ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 55 క్లస్టర్లను హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద గుర్తించగా, అందులో 12 క్లస్టర్లు పైలట్ ఫేజ్ కింద కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేపడుతోంది.

అరటిలో దేశం కూడా టాప్..
ప్రపంచం మొత్తం మీద పండించే అరటి పండ్లలో 26.5శాతం వాటాతో భారత్‌ అగ్రస్థానంలో ఉండటం మరో విశేషం.

దేశంలో అరటి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో ఏపీ తరువాతి స్థానంలో మహారాష్ట్ర 4966.33 మెట్రిక్ టన్నులతో రెండవ స్ధానంలో ఉంది.

మూడో స్థానంలో తమిళనాడు 4236.96 మెట్రిక్ టన్నులతో ఉంది. దేశ వ్యాప్తంగా 34907.54 మెట్రిక్ టన్నుల అరటి ఉత్పత్తి జరుగనున్నట్లు ఎఫ్‌ఏఓ సంస్థ అంచనా వేసింది. అరటి సాగులో మొదటి ఐదు నెలల్లో చేపట్టే యాజమాన్య పద్ధతులు ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సమగ్ర ఎరువుల యాజమాన్య ఎరువులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఆరోగ్యంగా ఉన్న చెట్లు ద్వారా అధిక దిగుబడులను తీయగలుగుతారు. అరటి సాగులో పోషక యాజమాన్యం చాలా అవసరం కాబట్టి ఉద్యానశాఖ ద్వారా యాజమాన్య పద్దతులు ద్వారా రోజురోజుకు సాగును పెంచుతున్నారు. దీంతో అరటి సాగు ఏపిలో మొదటిస్ధానాని ఆక్రమించింది.

Banana

Andhra is going Bananas

కేంద్రం సాయం

దేశంలో హార్టికల్చర్ రంగం అభివృద్దికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం కూడా అమలు చేస్తుంది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ హార్టికల్చర్ కింద అరటి కోసం డ్రిప్ ఇరిగేషన్‌తోపాటు, మొక్కలు నాటేందుకు, డ్రిప్ సిస్టం, పందిరి ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియెంట్స్ మేనేజ్మెంట్, దీని కోసం హెక్టార్‌కు చేసిన ఖర్చపై 40శాతం సాయం ప్రభుత్వమే అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇంటిగ్రేషన్ లేకుండా హెక్టార్‌కు అయ్యే ఖర్చులో 1.25 లక్షల్లో 40% సహకారం కూడా అందిస్తున్నారు. వీటికి తోడుగా కోల్డ్ స్టోరేజ్‌లు, రైపెనింగ్ సెంటర్ల ఏర్పాటు, రవాణా వాహనాలకు ఎంఐడీహెచ్ కింద క్రెడిట్ లింక్డ్ సహకారం కూడా లభిస్తుంది. దీంతో సాగు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: Organic Farming Products: ప్రపంచ మార్కెట్‌లో సేంద్రియ పంటలకు గిరాకీ ఎక్కువ.!

Leave Your Comments

Youth and Agriculture: వ్యవసాయ పనుల్లో బిజీగా విద్యార్థులు, కూలీలకు పోటీగా నాట్లు.!

Previous article

World’s Expensive Mango ‘Miyazaki’ : అతి ఖరీదైన మామిడి పండ్లు.. ధర తెలిస్తే షాకవుతారు.!

Next article

You may also like