ఆంధ్రా వ్యవసాయం

Bamboo Farmer Success Story: ఎదురు లేని లాభం వెదురు సాగుతో సాధ్యం.!

1
Bamboo Farmer Success Story
Bamboo Farmer Success Story

Bamboo Farmer Success Story: వెదురు అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతుందని మనందరికీ తెలుసు!! అవసరాల కోసం అది పెరిగిన చోటు నుండే సేకరిస్తుంటారు. కానీ పంటగా సాగు చేయొచ్చని ఒక రైతుకు వచ్చిన ఆలోచన ఇతర రైతులను ఆలోచనలో పడేసింది. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టి తోటి రైతుకి మార్గ నిర్దేశకుడు అవుతున్నాడు. చీడపీడలు, తెగుళ్ల బెడద ఉండబోదని, లాభాలు ఆర్జించుటకు వెదురు మంచి పంట అంటున్నారు ఈ రైతు.

Bamboo Farmer - Vamsi Krishna

Bamboo Farmer – Vamsi Krishna

తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడులు అందించే దీర్ఘకాలిక వెదురు పంట సాగుకు శ్రీకారం చుట్టి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన పాటిల్‌ వంశీకృష్ణారెడ్డి. ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ చదివినా సాగు రంగంపై మక్కువతో వ్యసాయం బాట పట్టారు.వీరు సాగులోకి రాకముందు బళ్లారిలో నివాసముంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకునేవాడు.

Also Read: Peanut Variety ICGV 91114: మేలైన స్వల్ప కాల వేరుశెనగ రకం ICGV 91114

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. తాత పాటిల్‌ గోవిందరెడ్డి గారి ఆదర్శంతో వ్యవసాయం చేయాలనుకుని నిశ్చయించుకున్నారు. ఎనిమిది నెలల క్రితం డెన్మార్క్‌లోని తన మిత్రుడి సలహాతో వెదురు సాగుకి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ, ఉద్యాన అధికారుల సూచనలతో ఊరిలో తనకున్న పది ఎకరాల్లో వెదురు పంట పెట్టారు.

Bamboo Farmer Success Story

Bamboo Farmer Success Story

కర్ణాటకలోని హోసూరులో రూ.2లక్షలతో టిష్యూకల్చర్‌తో అభివృద్ధి చేసిన బల్కోవా, న్యూటన్‌ రకాలకు చెందిన 10 వేల వెదురు పిలకలను రైతు వంశీకృష్ణారెడ్డి కొనుగోలు చేసి పదెకరాల్లో మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగుల దూరం పాటించి నాటారు. ఎకరా సాగుకు రూ.50 వేల ఖర్చు వచ్చిందని రైతు అన్నయారు.వెదురు పెరిగే వరకు ఆదాయ వనరుగా అంతర పంటలో మునగ సాగు చేశారు. రెండో విడతలో మరో పది ఎకరాలలో టుల్డా రకం సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

వెదురు సాగులో తెలుసుకోవలసిన అంశాలు

పంట కాలం ఎంచుకున్న రకంపై ఆధారపడి ఉంటుంది. బల్కోవా రకం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో మొదటిసారి కోతకు వస్తుంది. న్యూటన్‌ రకం కోతకు రావడానికి నాలుగేళ్ల సమయం పడుతుంది. వెదురుకు పంటకు వ్యాధులు గానీ, తెగుళ్లు గానీ రావు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఉద్యాన పంటలైన జామ, అరటి, మామిడి, సపోట,దానిమ్మ పంటలు వాతావరణం వలన గాని, చీడ పీడల వలన గాని రైతు చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. కానీ వెదురు సాగులో అలంటి బెడద ఉండదు.

దీర్ఘకాలిక పంట కాబట్టి నమ్మకమైన లాభాలు ఉంటాయి. మొక్కలు పెద్దవైన పిదప అంతర పంటలుగా అల్లం, పసుపు పంటలు కూడా సాగుచేసుకోవచ్చు. ప్రస్తుతానికి వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.మార్కెట్ లో టన్ను ధర రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది.పైన చెప్పిన రకాలను సాగు చేసి ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉంది. తద్వారా ఎకరాకు సగటున లక్షా నలభై వేల వరకు ఆదాయం ఆర్జించవచ్చు.

Also Read: Invention of the Wheel: చక్రం పుట్టుకే పారిశ్రామిక విప్లవానికి నాంది.!

Leave Your Comments

Peanut Variety ICGV 91114: మేలైన స్వల్ప కాల వేరుశెనగ రకం ICGV 91114

Previous article

ICRISAT Best Watershed Project: మహీంద్రా- ఇక్రిసాట్ చెక్ డ్యాం ‘బెస్ట్ వాటర్‌షెడ్’ ప్రాజెక్ట్ గా గుర్తింపు

Next article

You may also like