Summer Healthy Drinks: వేసవి మరియు వర్షాకాలంలో మనం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. వేడి మరియు తేమ కారణంగా శరీరంలోని నీటిని కోల్పోతాము మరియు శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. ఇతర ఆరోగ్యకరమైన వేసవి పానీయాల కన్నా నీరు జీవితానికి ఖచ్చితంగా అవసరం. 70 శాతం వరకు మానవ శరీరంలో నీటితో నిర్మితమై ఉంటుంది.కావున ఈ వేసవిలో పెరిగే ఉష్ణొగ్రతలను తటుకోవడానికి మనం ఇంట్లో దిరికె పదార్థాలతొ మంచి పోషక విలువలు కలిగిన పానియాలను తీసుకుంటె మంచిదని వడదెబ్బ తగలకుండా ఉంటామని డాక్టర్లు కూడా అంటున్నారు.
రిఫ్రెషింగ్ డ్రింక్ – బాదం తేనె పాలు:
బాదం తేనె పాల కోసం కావలసిన పదార్థాలు:
బాదంపప్పులు – 1/2 కప్పు,పాలు – 2 కప్పు ,యాలకుల పొడి – 1/4 టీస్పూన్ , వెనీలా – 1/2 టీస్పూన్, తేనె – 3 టీస్పూన్లు.
బాదం తేనె పాలు తయారీ విధానం:
బ్లెండర్‌లో బాదంపప్పును వేసి, దానిని మెత్తగా ప్యూరి అయే వరకు పట్టాలి.ఆ ప్యూరీకి 2 కప్పుల పాలు వేసుకోవాలి. అవి రెండు చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి.ఆ మిశ్రమాన్ని వడకట్టి, ఏలకులు వేసి, చిన్న మంట మీద మరింగించాలి మరియు నిరంతరం ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.
మిశ్రమం ఉడికిన తర్వాత, మంటను తగ్గించి 5 నిమిషాలు పాటు ఉంచాలి.దీనికి తేనెను వేయాలి.ఈ పాలు నురుగు వచ్చేవరకు ఒక గ్లాసు నుండి మరొక గ్లాసుకు ముందుకు వెనుకకు పోస్తూ పాలను కలపాలి.
ఐస్ వేసుకొని ఆల్మండ్ హనీ మిల్క్‌ని ఆస్వాదించండి.
Also Read: వేసవిలో ఆరోగ్యాన్ని ఇచ్చే రిఫ్రెషింగ్ డ్రింక్స్
రిఫ్రెషింగ్ డ్రింక్ – షికంజీ
షికంజీ తయారీకి కావలసిన పదార్థాలు:
1/2 కప్పుతాజాగా పిండిన నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ అల్లం రసం ,1 కప్పు చక్కెర, 2 కప్పులు నీళ్ళు.
షికంజి తయారీ పద్ధతి:
వేడి నీటిలో చక్కెర వేసి, ఈ చక్కెర నీటిలో పూర్తిగా కరిగెంత వరకు కలుపుకోవాలి,ఆ తరువాత అల్లం రసం మరియు నిమ్మరసాన్ని వేసుకోవాలి.ఒక గ్లాసు చల్లబడిన నీటిలో 2 టేబుల్ స్పూన్లకు పైన ఈ మిశ్రమాన్ని వేసి, ఐస్ ముక్కలతో సర్వ్ చేయాలి. రిఫ్రెష్ డ్రింక్ షికంజీని ఆస్వాదించండి.
Also Read: అంగూర్ షర్బత్, మ్యాంగో షేక్, తాండాయి తయారీ విధానం