ఆరోగ్యం / జీవన విధానం

Refreshing Drinks: అంగూర్ షర్బత్, మ్యాంగో షేక్, తాండాయి తయారీ విధానం

0
Refreshing Drinks
Refreshing Drinks

Refreshing Drinks: రిఫ్రెషింగ్ డ్రింక్ – అంగూర్ (ద్రాక్ష) షర్బత్
అంగూర్ (ద్రాక్ష) షర్బత్ తయారీకి కావలసినవ పదార్థాలు:
ద్రాక్ష రసం – 4 కప్పులు,ఆరెంజ్ జెస్ట్ – 3-4 ముక్కలు ,ఏలకులు – 3-4 , లవంగాలు – 2 ,దాల్చిన చెక్క – 1, తేనె – 1/4 కప్పు ,నీళ్ళు – 2 కప్పులు ఉప్పు – చిటికెడు.

Grape Sharbath

Grape Sharbath

అంగూర్ (ద్రాక్ష) షర్బత్ తయారీ విధానం: ఆరెంజ్ జెస్ట్ , యాలకుల గింజలు మరియు లవంగాలను ఒక చిన్న బుట్టలో వేసుకొని ముడి వేసి కట్టుకోవాలి.ఒక గిన్నెలో ద్రాక్ష రసం మరియు తేనె వేసి మీడియం వేడి మీద ఉడికించుకోవాలి.అది ఉడకడానికి కొద్ది సమయం ముందు మంట నుండి తీసివేయాలి (సరిగ్గా ఉడకనివ్వవద్దు).ఈ మిశ్రమం లో మనం ముందుగా బట్టలో కట్టినవి మరియు దాల్చిన చెక్కను వేసి మూతతో కవర్ చేసుకోవాలి.అది‌ చల్లారె వరకు పక్కన పెట్టాలి. ఆపై మస్లిన్ గుడ్డ కట్టిన వస్తువులను మరియుదాల్చిన చెక్కను తీసెయ్యాలి.సర్వ్ చేసుకోవాలి అన్నప్పుడూ నీళ్లు పోసి మిక్స్ చేసి చల్లగా సర్వ్ చేసుకోవాలి.రుచికి తగ్గటూచిటికెడు ఉప్పు వేసుకోవచ్చు. చల్లబడిన అంగూర్ (ద్రాక్ష) షర్బత్‌ను ఆస్వాదించండి.

రిఫ్రెషింగ్ డ్రింక్ మామిడికాయ షేక్ :
మ్యాంగో షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
చల్లని పాలు – 2 కప్పు, మామిడికాయ గుజ్జు – 1 కప్పు, పంచదార – 1 టీస్పూన్ ,జీడిపప్పు – 3 -4, ఐస్ – 1/4 కప్పు.

Mango Shake

Mango Shake

మ్యాంగో షేక్ తయారీ విధానం:
బ్లెండర్‌లో మామిడికాయ గుజ్జు మరియు చక్కెరను నురుగు వచ్చేఅంత వరకు కలపాలి.
తర్వాత పాలు, కాస్త ఐస్ ముక్కలు వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి. దీనిని గ్లాసులో వేసుకొని జీడిపప్పు ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.మ్యాంగో మిల్క్ షేక్ రెడీ.

Also Read: నామ్‌కీన్‌ స్నాక్స్ తో మంచి లాభాలు

రిఫ్రెషషింగ్ డ్రింక్ – తాండాయి
తాండాయి (తాండై) తయారీకి కావలసిన పదార్థాలు: టేబుల్ స్పూన్లు ,యాలకుల పొడి – 1 టీస్పూన్, రోజ్ వాటర్ – 2 టీస్పూన్, ఐస్ – 1 కప్పు.

Thandai

Thandai

తాండాయి (తాండై) తయారీ విధానం:
గుమ్మడి గింజలు, యాలకుల పొడి, బాదం, రోజ్‌వాటర్‌లను బ్లెండర్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసూకోవాలి.ఈ పేస్ట్‌లోకి కండెన్స్‌డ్‌ మిల్క్‌, ఐస్‌ముక్కలను, మిల్క్‌ వేసుకొని బాగా కలపాలి.దీనిని మస్లిన్ క్లాత్ ద్వారా వడకట్టాలి.అప్పుడు తండాయి మీద మరింత మరిన్ని ఐస్ ముక్కలన వేసుకోవాలి.తరిగిన బాదం పప్పులతో దీనిని అలంకరించూకోవాలి. చల్లనైన తండై (తాండై)ను ఆనందించండి.

Also Read: పిల్లల లంచ్ బాక్సులో పోషక ఆహారం

Leave Your Comments

Banana Chocolate Spread: పిల్లల కోసం బనానా చాక్లెట్ స్ప్రెడ్‌ ఇంట్లోనే తయారీ

Previous article

Pesticides Drones: డ్రోన్ వినియోగం కోసం ప్రభుత్వం 477 పురుగుమందులను ఆమోదించింది

Next article

You may also like