ఆరోగ్యం / జీవన విధానం

Banana Shake Preparation: వేసవిలో ఆరోగ్యాన్ని ఇచ్చే రిఫ్రెషింగ్ డ్రింక్స్

2
Banana Shake
Banana Shake

Preparation Banana Shake: వేసవిలో రోజంతా మనల్ని తాజాగా ఉంచడానికి తక్షణమే, ఇంట్లో తయారుచేసిన, ఆరోగ్యవంతమైన, మనమే చేసుకునే, అదిక నీటిశాతం ఉన్న రిఫ్రెషింగ్ పానీయాలను తాగితే ఈ వేసవిలో శక్తిని పొందుతాము. ఈ పానీయాలు శరీరంలోని నీటి శాతాన్ని పెంచడంలో సహాయపడతాయి, ఇంకా నిర్జలీకరణను తగ్గస్తుంది. దీని వలన మనం తాజాగా, ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండవచ్చు.

Aam Panna

Aam Panna

రిఫ్రెషింగ్ డ్రింక్ -ఆమ్ పన్నా
ఆమ్ పన్నా తయారీకి కావాల్సిన పదార్థాలు:
పచ్చి మామిడికాయలు – 1/2 కిలోల , నీళ్ళు – 4 కప్పు, జీలకర్ర – 1 టీస్పూన్, ఎర్ర మిరపకాయలు – 1 టీస్పూన్ ,పంచదార – 3 టేబుల్ స్పూన్లు ,పుదీనా ఆకులు , బ్రోకెన్ ఐస్ – 1 కప్పు,రుచికి తగినంత ఉప్పు.

ఆమ్ పన్నా తయారీ విధానం:
మామిడికాయలను పాన్‌తో నీటిలో 5-10 నిమిషాలు సిమ్ లో పెట్టి ఉడకబెట్టిలి. నీటిని తీసెసి, తొక్కలను తీసి, ఒక చెంచాతో మామిడి గుజ్జును తీయాలి.
ఆ గుజ్జును ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి.
వేయించిన మరియు పొడిచేసిన జీలకర్ర, నీరు, చక్కెర, ఉప్పు ఇంకా కారం వేసి బాగా కలపాలి.పుదీనా వేసి మళ్ళీ కలపాలి. తరువాత సర్వింగ్ జగ్‌లో పోసి, కొన్ని వఐస్ క్యూబ్‌లను వేసుకోవాలి.‌‌
ఇప్పుడు చల్లని ఆమ్ పన్నాను ఆస్వాదించండి.

Also Read: పిల్లల కోసం బనానా చాక్లెట్ స్ప్రెడ్‌ ఇంట్లోనే తయారీ

రిఫ్రెష్ పానీయం – అరటి షేక్
బనానా షేక్ కు కావలసిన పదార్థాలు:
అరటిపండు – 2 ,పాలు – 2 కప్పులు దాల్చిన చెక్క పొడి – చిటికెడు, యాలకులు – 2 పొడి చేసినవి, చక్కెర – 2 టీస్పూన్ ,ఐస్ – 1/4 కప్పు.

Banana Shake

Banana Shake

అరటిపండు షేక్ తయారీ విధానం:
అరటిపండ్ల తొక్కలను తీసి ముక్కలుగా చేసుకోవాలి. దానిలో పంచదార వేసి ఎలక్ట్రిక్ మిక్సర్‌తో మెత్తగా చేసుకోవాలి.ఇప్పుడు పాలు, దాల్చినచెక్క, ఐస్ వేసి అది మళ్ళీ మెత్తగా మరియు క్రీమీఅయొ వరకు మిక్సి పట్టి కలపాలి. దానిని ఒక గ్లాసు లో వేసి యాలకుల పొడిని పైన గార్నిష్ చేసుకోవాలి. బనానా షేక్ రెడీ.

Also Read: అంగూర్ షర్బత్, మ్యాంగో షేక్, తాండాయి తయారీ విధానం

Leave Your Comments

PM Kisan Yojana: PM కిసాన్ eKYC చివరి తేదీ 31 మే 2022

Previous article

May Crop: మే నెలలో పండించాల్సిన పంటలకు రైతులు సిద్ధం

Next article

You may also like