ఆరోగ్యం / జీవన విధానం

Sky Fruit Health Benefits: షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచే పోషకాల గని “స్కై ఫ్రూట్”

2
Sky Fruit Health Benefits
Sky Fruit

Sky Fruit Health Benefits: పండ్లు, కూరగాయలు అనేవి నిజంగా మనకు ప్రకృతి ఇచ్చిన సంపద. వీటివల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. కొన్ని రకాల పండ్ల వలన మనకు ఎన్నో రకాలైన లాభాలు చేకూరతాయి. శరీరంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచి ఆరోగ్యంగా, సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. అటువంటి పండ్ల జాబితాలో చెప్పుకోదగిన పండు ఏమైనా ఉంది అంటే అది స్కై ఫ్రూట్. వైద్య శాస్త్రంలో అత్యంత పేరుపొందిన పండుగా ఇది ప్రసిద్ధి చెందింది. రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించి మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడే అసాధారణమైన ఫ్రూట్ గా ఈ పండు నిలిచింది.

స్కై ఫ్రూట్ అంటే ఏమిటి?

మహోగని పండు యొక్క విత్తనాన్ని స్కై ఫ్రూట్ అంటారు.స్వైటెనియా మాక్రోఫిల్లా అనేది స్కై ఫ్రూట్ శాస్త్రీయ నామం. దీనిని ఆంగ్లంలో మిరాకిల్ ఫ్రూట్, కింగ్ ఫ్రూట్, షుగర్ బాదం అని కూడా అంటారు.

పోషక విలువలు

స్కై ఫ్రూట్‌లో శక్తివంతమైన ఫైటోన్యూట్రియెంట్‌లు ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైన ఆరోగ్య-ప్రయోజనాలను అందించడంలో ప్రసిద్ధి చెందాయి. స్కై ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, చేదు ఆల్కలాయిడ్స్, సపోనిన్ చాలా విరివిగా లభిస్తాయి.

ఫ్లేవనాయిడ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉండే సమ్మేళనాలు స్కై ఫ్రూట్ లో ఉండటం వలన కడుపులో మంట తగ్గుతుంది. రక్త నాళాల్లో గడ్డలు కట్టకుండా ఉండేటట్లు చేస్తుంది. ఇలా చెయ్యడం వలన స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

Also Read: పెరుగుతున్న గోధుమల ధరలని నియంత్రించడని ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు..

Sky Fruit Health Benefits

Sky Fruit Health Benefits

బిట్టర్ ఆల్కలాయిడ్స్ స్కై ఫ్రూట్ లో లభించడంలో వలన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీని వలన వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.

సపోనిన్ అనేది స్కై ఫ్రూట్‌లో సమృద్ధిగా ఉండే శక్తివంతమైన భాగం. ఇది దాని యాంటీ-డయాబెటిక్ చర్యకు బాధ్యత వహిస్తుంది. అనేక అధ్యయనాలు సపోనిన్ల రక్తంలో చక్కెర-తగ్గించే లక్షణాలను స్థాపించాయి. అదనంగా, సపోనిన్లు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, ఉబ్బసం చికిత్సలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.

స్కై ఫ్రూట్‌లో ఒలేయిక్ యాసిడ్, లినోలెయిక్ యాసిడ్‌లు వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యకరంగా ఉండటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

స్కై ఫ్రూట్‌లో చెప్పుకోదగ్గ మొత్తంలో విటమిన్లు B1, B2 మరియు E ఉన్నాయి, ఈ విటమిన్లు అన్నీ సెల్యులార్ శక్తి, జీవక్రియ, ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి ఎక్కువగా సహాయ పడతాయి.

ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో నిండిన స్కై ఫ్రూట్ బలమైన దంతాలు, చిగుళ్ళు, ఎముకలు, కండరాలను దృఢ పరచడంతో పాటుగా రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్రను పోషిస్తుంది.

Also Read:  రొయ్యల సాగు చేసే రైతులకి శుభవార్త..

Leave Your Comments

Wheat Prices: పెరుగుతున్న గోధుమల ధరలని నియంత్రించడని ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు..

Previous article

Farmers Question: రైతన్నకో ప్రశ్న.!

Next article

You may also like