ఆంధ్రప్రదేశ్ఈ నెల పంటజాతీయంతెలంగాణమన వ్యవసాయంరైతులువార్తలువ్యవసాయ పంటలు

Management of Paddy Stem Borer: యాసంగి వరిలో ఉధృతమవుతున్న కాండం తొలిచే పురుగు

0
Management of Paddy Stem Borer
Management of Paddy Stem Borer

Management of Paddy Stem Borer: యాసంగి వరిలో ఉధృతమవుతున్న కాండం తొలిచే పురుగు – యాజమాన్యం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సమాచారం మేరకు యాసంగి వరి సాగు సుమారు 30.43 లక్షల ఎకరాల్లో జరిగింది. వరి పైర్లు కొన్ని చోట్ల నారుమడి దశలోనూ, మరికొన్ని ప్రాంతాల్లో పిలకదశలోనూ ఉన్నాయి. గత సంవత్సరం యాసంగిలో కాండం తొలిచే పురుగు ఉధృతి వల్ల అధికంగా నష్టపోవటం జరిగింది. ఈ యాసంగిలో కూడా నారుమడి మరియు పిలక దశల్లో కాండం తొలిచే పురుగు రెక్కల పురుగుల ఉధృతి అధికంగా ఉంది. కావున నివారణకు ఈ క్రింది సూచనలు పాటించాలి.

Management of Paddy Stem Borer

Management of Paddy Stem Borer

. పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎరను, సోలార్‌ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి.
. పిలకదశలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చేపట్టాలి.
. ఈ యాసంగిలో నారుమడి దశలో ఆశించే నష్టపరుస్తుంది. గనుక నారు మడిలో కార్బోఫ్యూరాన్‌ 3 జి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్‌ 0.3 జి గుళికలు వేయాలి.
ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో ఈ యాసంగిలో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్‌ 3 జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 4 జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4 జి గుళికలు 4 కిలోలు 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
. అలాగే మొగిపురుగు నివారణకు సిఫారసు చేయబడని ఇతర 10 జి లేదా సేంద్రీయ గుళికలను యూరియాతో కలిపి వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతు సోదరులు గమనించాలి.
. గత రెండు సంవత్సరాల నుండి పురుగు ఉధృతి అధికంగా ఆశించి నష్టపరుస్తుంది. గనుక వరిపంట చిరుపొట్ట దశలో రెక్కల పురగుల ఉధృతి గమనించినట్లైతే కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50% ఎస్పి 2 గ్రా. (400 గ్రా./ఎకరాకు) లేదా ఎకరాకు క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.3 మి.లీ. (60 మి.లీ./ఎకరాకు) లేదా ఐసోసైక్లోసీరమ్‌ 0.6 మి.లీ. (120 మి.లీ./ఎకరాకు) ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

డా. సి.హెచ్‌. దామోదర్‌ రాజు
ప్రధాన శాస్త్రవేత్త (వరి)Ê హెడ్‌ వరి పరిశోధన సంస్థ,
రాజేంద్రనగర్‌, హైదరాబాద
ఫోన్‌ : 7337399470

Leave Your Comments

Gladiolus Cultivation: ‘‘వివిధ రంగుల్లో విరబూసే గ్లాడియోలస్‌ సాగులో సూచనలు’’

Previous article

Artificial Intelligence in Agriculture: వ్యవసాయరంగంలో కృతిమ మేథాశక్తి వినియోగం

Next article

You may also like