నీటి యాజమాన్యం

Watershed Management: పరీవాహక ప్రాంతంలో యాజమాన్య చర్యలు.!

0
Watershed
Watershed

Watershed Management: పరీవాహక ప్రాంతం లో యాజమాన్య చర్యలునేల మరియు నీటి సంరక్షణ: వాతావరణం, నేల రకాన్ని బట్టి మూడు విధాలుగా చేయవచ్చు.

a) శాశ్వత పద్ధతులు: అధిక వర్షాలు పడినప్పుడు నీటి వేగాన్ని, నేల కోతను క్రమబద్ధం చేయడానికి గట్లు వేయడం,టెర్రేసింగ్, నీటి దారులు మొదలైన పనులు చేపట్టాలి..

b) పాక్షిక శాశ్వత పద్ధతులు: కీ లైన్ గేట్లు, స్ట్రిప్ లెవలింగ్, జీవ అడ్డంకులు (live plants lines) చేసిన భూమిపై నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు

ఉపయోగపడుతుంది. ఇవి 3-5 సంవత్సరాల వరకు ఉపయోగపడతాయి.

c) తాత్కాలిక పద్ధతులు: కాంటూరు సాగు (వాలుకు అడ్డం గా సేద్య పద్ధతుల నిర్వహణ), వాలును బట్టి కంపార్టుమెంట్ల గా విభజించి గట్లు వేయుట, బ్రాడ్ టెడ్ ఫర్రో, డెడ్ ఫర్రో మొదలైనవి ప్రతి సీజన్ లో వేసుకొని తేమ సంరక్షణ చేసుకోవాలి. అయితే ఈ పద్ధతులు ప్రతి పంటకు వేసుకోవాలి.

వాటర్ హార్వెస్టింగ్: వర్షపు నీరు అధికంగా ఉన్నప్పుడు నీటి దారుల ద్వారా పల్లపు ప్రదేశాలకు చేర్చి గుంతలలో నీటిని నిల్వ చేయు పద్ధతి ని “వాటర్ హార్వెస్టింగ్” అంటారు. ఈ నీటిని బెట్ట సమయములందు పంటను రక్షించుకోవడానికి మరియు సస్యరక్షణ మందులు పిచికారి చేయుటకు ఉపయోగపడుతుంది.

Also Read: Watershed Management: నీటి పరీవాహక ప్రాంతం అంటే ఏంటి దానికి అనుకూలించే అంశాల గురించి తెలుసుకుందాం.!

Watershed Management

Watershed Management

పంట యాజమాన్యం: సాగు కాలాన్ని బట్టి (ఖరీఫ్, రబీ) అనువైన పంటలు, పంటల రకాలు ఎన్నుకొనుట సరైన సమయంలో వివిధ పంటలకు లేదా పంట వ్యవస్థ లకు తగు సమయం లో తగినంత మోతాదులో ఎరువులు వేసుకొనుట సమతుల్య పోషక యాజమాన్య పద్ధతులను అవలంబించుట.

కలుపు యాజమాన్యం: వాతావరణ మార్పులకు అనుసరించి సేద్య పద్ధతులను అవలంబించుట కాల వైపరీత్యాలు బట్టి అవసరమైన ప్రణాళిక లను రూపొందించుకొని ఆచరించుట.

ప్రత్యామ్నాయ భూమి వినియోగ పధ్ధతి:

నేల రకం, నేల లోతు, ఎత్తు పల్లాలు, మరియు అనేక సంవత్సరములు గా నేల కోతకు గురైన భూములు ఇంకనూ అనేక కారణాల వల్ల అన్ని నేలల్లోనూ పంటలు పండించుట వీలు పడదు. ముఖ్యం గా మెట్ట సాగు రుతుపవనాల తో జూదం వంటిది.ప్రత్యామ్నాయ భూమి వినియోగ పద్ధతి మూడు రకాలు గా విభజించారు.

I తరగతి భూములు: శ్రేష్టమైనవి. అని రకాల పంటలు పండించ వచ్చు దిగుబడులు ఎక్కువ నిఖర లాభాలు ఎక్కువ.

II. III తరగతి భూములు: ఈ భూములందు పండ్ల తోటలను ప్రోత్సహించి క్షార భూములను సాగులోనికి తీసుకు రావచ్చు. సీతాఫలం, రేగు, ఉసిరి, మామిడి, సపోటా తక్కువ నీటితోనే ఫల సాయాన్ని ఇస్తాయి.

IV. V తరగతి భూములు: ఫల జాతులతో బాటు గడ్డి పంటలు, పచ్చిక బయళ్ళు పెంచవచ్చు. VI, VII తరగతి భూములు: వంట చెరకు, కలప, నార కు పనికి వచ్చే మొక్కల సాగు చేయవచ్చు.

Also Read: Watershed Facts: నీటి పరీవాహక ప్రాంతం గురించి ముఖ్య విషయాలు తెలుసుకోండి.!

Leave Your Comments

Pruning: కొమ్మ కత్తిరింపు వల్ల చెట్టులో కరిగే మార్పులు.!

Previous article

Mediterranean Chickens: అధిక మాంసం ఇచ్చే మెడిటరేనియన్ కోళ్ళు.!

Next article

You may also like