నీటి యాజమాన్యం

Farm Pond: ఫార్మ్ పాండ్ పై రేకులు వేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు..

0
Farm Ponds
Farm Ponds

Farm Pond: రైతులు వ్యవసాయ పొలంలో పంటకి వర్షాల పై ఆధార పడకుండా ఉండాలి అని ఫార్మ్ పాండ్స్ నిర్మించుకుంటున్నారు. ఈ ఫార్మ్ పాండ్స్కి కట్టడం కంటే వాటి శుభ్రం చెయ్యడానికి చాలా శ్రమ, ఖర్చు అవుతుంది. ఎంత శుభ్రం చేసిన 4-5 రోజులో నాచు ఏర్పడుతుంది. నీటికి సూర్యకాంతి పడడం ద్వారా నీటిలో తొందర నాచు వస్తుంది. దానితో పాటు గాలికి దుమ్ము, చెత్త నీటిలోనే పడుతాయి. ఈ ఫార్మ్ పాండ్ నీటిని పోలంకి వాడుకున్నాడు ఈ చెత్త, నాచు మోటర్లోకి వెళ్ళి , మోటార్ల పనిచేయడకుండా ఆగిపోతున్నాయి. ఈ సమస్యకి ఫార్మ్ పాండ్ పోటెక్షన్గా రేకులు నిర్మించుకున్నాడు అనంతపూర్ రైతు ప్రభాకర్ గారు.

ఫార్మ్ పాండ్స్కి సిమెంట్ లేదా ఇనుప రేకులు వేసుకోవడం వాళ్ళ, ఫార్మ్ పాండ్లోని నీళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంటాయి. ఈ నీటిని మోటార్లు, డ్రిప్ నడిపిన ఎలాంటి రేపిర్ అవ్వవు. రేకులు వెయ్యడం వల్ల నీటిలో నాచు కూడా తయారు కాదు. దీని సంవత్సరానికి ఒకసారి కూడా శుభ్రం చెయ్యడం లేదు.

Also Read: Natural Farming: ప్రకృతి వ్యవసాయంలో 2 లక్షల లాభాలు..

Farm Ponds

Farm Pond

ఈ ఫార్మ్ పాండ్ 53 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోత్తు ఉంటుంది. ఈ ఫార్మ్ పాండ్స్కి రేకులు వేసుకోవడానికి 7 లక్షలు ఖర్చు వచ్చింది. ఈ ఫార్మ్ పాండ్ ద్వారా 40 ఎకరాల పంట పొలాన్ని సాగు చేసుకోవచ్చు.

ఈ పాండ్కి 13 మోటార్ల నుంచి నీళ్లు వస్తాయి, 6 మోటార్ల ద్వారా పంటకి నీళ్లు అందిస్తాము. ఈ 40 ఎకరాల్లో 20 ఎకరాలు అరటి తోట వేసి వాటికీ డ్రిప్ ద్వారా నీటిని అందిస్తాము. ఈ సంవత్సరం ఈ తోట ద్వారా పెట్టుబడి పోను 75 లక్షలు లాభాలు వచ్చాయీ. ఈ పాండ్కి రేకులు వేసుకోవడం ద్వారా డ్రిప్ పని తీరు పెరిగి పంట మంచి దిగుబడి వచ్చింది.

Also Read: Mist Blower Sprayer: ఎరువులు వృధా కాకుండా ఉండాలంటే ఈ పరికరాన్ని వాడాల్సిందే.!

Leave Your Comments

Natural Farming: ప్రకృతి వ్యవసాయంలో 2 లక్షల లాభాలు..

Previous article

Tractor Platform Trolley: గడ్డి తీసుకొని వెళ్ళడానికి కొత్త పరికరం..

Next article

You may also like