నీటి యాజమాన్యం

Drip Irrigation: డ్రిప్ ద్వారా నీటిని అందించడం లో పాటించాల్సిన మెళకువలు.!

3
Drip Irrigation Techniques
Drip Irrigation Techniques

Drip Irrigation: సాగునీటి సమస్యకి పరిష్కారం గా ప్రారంభమైన మైక్రో ఇరిగేషన్ రెండు రకాల సాగునీటి విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. మొక్క మొదలుకు నీరు అందించే ప్రక్రియ బిందు సేద్యం ద్వారా జరుగుతుంది. మొక్కపై తేమ శాతం పెంచేందుకు తుంపర సేద్యం ఉపయోగపడుతుంది. హరిత విప్లవం వల్ల దేశంలో దిగుబడులు పెరిగినప్పటికీ వాటితో పా’టు సమానంగా పెట్టుబడులు పెరిగాయి. నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు అనేక పధకాలను విడుదల చేసింది. ఈకోవకు చెందినదే మైక్రో ఇరిగేషన్. రైతులకు సబ్సిడీపై రాయితీలను అందజేస్తోంది.

రైతులు ఈ సేద్యం ద్వారా పంటలను పండించుకుంటూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. బిందు సేద్యం చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, ఆయిల్ పామ్, కూరగాయలు, మిరప, చెరకు, అరటి మొదలగు తోటలకు బిందు సేద్యం.. అలాగే వేరుశనగ, మినుము పంటలకు స్ప్రింక్లర్ల సేద్యాన్ని అమలుపరిచి అధిక దిగుబడిని సాధించడానికి తోడ్పాటు అందిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం బిందుసేద్యం, తుంపర సేద్య విధానాలకు 50% నుంచి 100% దాకా రాయితీలను అందజేస్తుంది.

బిందు సేద్యం ద్వారా లాభాలు

మొక్కకు కావాల్సిన నీటిని బొట్టు బొట్టుగా అందిస్తుంది. దీనివల్ల సాధారణ పద్ధతితో పోల్చితే 30-50 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఈపద్ధతి ద్వారా తేలికపాటి నేలలు లేదా నల్లరేగడి నేలలు, కొండ ప్రాంతాల్లో ఎంతో అనువుగా ఉంటుంది. దీని వలన ఖర్చు తగ్గుతుంది. మొదట్లో బొట్టు బొట్టుగా నీరు అందించడం ద్వారా వృథా కాదు, మొక్కల మధ్య వరుసల మధ్య నీరు నిల్వ ఉండదు.

Also Read: World Coconut Day: నేడు (సెప్టెంబర్ 2న)ప్రపంచ కొబ్బరి కాయ దినోత్సవం.!

Drip Irrigation

Drip Irrigation

బిందు సేద్యం లో ఎరువులు కూడా మొక్కలకు అందించవచ్చు. దీని ద్వారా కూలీల ఖర్చులను తగ్గించుకోవచ్చు. బిందు సేద్యం మొక్కలకు నేరుగా నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నీటి వృథాను పూర్తిగా తగ్గిస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ నీటిపారుదల వ్యవస్థ ద్వారా ఎరువులను సులభంగా తీసుకోవచ్చు. దీని ద్వారా పోషకాలు నేరుగా మొక్కలకు అందుతాయి.

ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు

మల్చింగ్ పేపర్ ద్వారా మిరప మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది. పండ్ల తోటలు అయినా మామిడి, దానిమ్మ, జామ ఏ రకమైన పండ్ల తోటల్లో అయినా దీనిని ఉపయోగించవచ్చు. పత్తిలో, మిరప లో, కూరగాయల పంటల్లో డ్రిప్ చాలా బాగా పనిచేస్తుంది. పూల తోటల్లో కూడా అన్ని రకాల పంటలలో డ్రిప్ అనువైనది.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటూ వస్తోంది. ఒకవైపు రైతు భరోసా, మరోవైపువైఎస్సార్‌ పంటల బీమా, ఇంకోవైపు సున్నావడ్డీ ఇలా చెబుతూ పోతే రైతు భరోసా కేంద్రాల వరకు అన్నదాతలకు సర్కార్‌ అండగా ఉంటూ వస్తోంది.

రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు పాటు యంత్ర పరికరాలను ప్రభుత్వం అందించింది. స్పింక్లర్లు, డ్రిప్‌లను వినియోగించుకునే రైతులకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలను అందించి ప్రోత్సాహం అందిస్తోంది. ఈఆవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని రైతులు కోరుతున్నారు.

Also Read: Crop Rotation System: పంట మార్పిడి విధానం తో ఎన్నో లాభాలు.!

Leave Your Comments

World Coconut Day: నేడు (సెప్టెంబర్ 2న)ప్రపంచ కొబ్బరి కాయ దినోత్సవం.!

Previous article

PJTSAU: పీజేటీఎస్ఏయూలో ఘనంగా ముగిసిన చర్చా కార్యాక్రమం.!

Next article

You may also like