నీటి యాజమాన్యం

Aquaculture for all eligible farmers : అర్హులైన రైతులందరికీ జలకళ

0
Aquaculture for all eligible farmers
Aquaculture for all eligible farmers

వ్యవ”సాయాని”కి అండగా రాష్ట్ర ప్రభుత్వం

మోటార్ పంప్ సెట్ల పంపిణీలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు

వ్యవ “సాయాని” కి అండగా నిలిచేందుకు జలకళ పథకం ఎంత దోహదపడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన పంప్ సెట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మంత్రి అంబటి మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ వైయస్సార్ జలకళ పధకాన్ని అందిస్తున్నామన్నారు .మండల పరిధిలో 160 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు పరిపాలన అనుమతులు లభించగా అందులో 34 మందికి బోర్వెల్స్ చేయించడం జరిగిందన్నారు. వీరిలో 19 మంది రైతులకు విద్యుత్ సరఫరా కూడా ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడతగా 9 మందికి రూ.45,83,994 ల విలువైన పంసెట్లు ,విద్యుత్ సామాగ్రిని మంత్రి అంబటి రాంబాబు పంపిణీ చేశారు. కార్యక్రమములో రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి , ఎంపీడీవో సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు ఉన్నారు

Leave Your Comments

Quail Breeding-and Management Practices : కౌజు పిట్టల పెంపకం-మరియు యాజమాన్య పద్ధతులు

Previous article

Nutrient Deficiencies in Banana – Prevention : అరటిలో పోషక పదార్ధ లోపాలు – నివారణ

Next article

You may also like