జాతీయంపశుపోషణ

Poultry Farm Loans: కోళ్ల ఫారం ఏర్పాటుకు రూ.50 లక్షలు ఇస్తున్న కేంద్రం.!

2
Poultry Farm Loans
Poultry Farm

 Poultry Farm Loans: వ్యవసాయంతో పాటు రైతులు వ్యవసాయ అనుబంద రంగాలను కూడా ఎంచుకుంటారు అందులో కోళ్ల పరిశ్రమ. కోళ్ళ పెంపకం అనేది నేడు లాభదాయకమైన వ్యాపారంగా అందరికి మారింది. ముఖ్యంగా యువకులకు, నిరుద్యోగులకు ఈ పెంపకం లాభసాటిగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో ఉండే చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధిగా మార్చుకునేవారు. అయితే ప్రస్తుతం కోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమగా మారింది. నాటి నుంచి నేటి వరకు పెంపకందారులకు రోజువారీ ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు కోళ్ళ పెంపకం. ప్రసుత్త కాలంలో పెరిగిన డిమాండ్ కారణంగా పెంపకం సంతరించుకుంది. అంతేకాకుండా అనేక రాయితీలను అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తుంది.

www.nlm.udayanidhimitra.in/Login

గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల ఫారం పెట్టుకునే వారికి ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో మీరు సగం కడితే చాలు. మిగిలిన అమౌంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. కేంద్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా మాంసం, పాలు, గుడ్లు ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు రెండు విడతలుగా చెల్లిస్తుంది.

Also Read: Bharathi Completed Phd in Chemistry: పీహెచ్ డి ముందు చిన్నబోయిన పేదరికం.!

 Poultry Farm Loans

Poultry Farm Loans

వ్యక్తిగతంగా లేదా స్వయం సహాయక సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO), రైతు సహకార సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, పలు కంపెనీలు, ఇలా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని జాతీయ బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. దీని కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్ నిర్వహిస్తోంది. ముందు నేష‌న‌ల్ లైవ్‌స్టాక్ మిష‌న్ పోర్ట‌ ల్‌కు వెళ్లి యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం www.nlm.udayanidhimitra.in/Login పోర్ట‌ ల్‌కు వెళ్లాలి.

ఇది తప్పనిసరిగా ఉండాలి..

కోళ్ల ఫారం పెట్టుకునే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. వారికి కనీసం ఒక ఎకరం భూమి అయినా ఉండాలి. దానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలి. సొంత భూమి లేని వారు కౌలుకు తీసుకున్న భూమిపై కూడా రుణం పొందవచ్చు. కోళ్ల ఫారానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసుకుని, దాన్ని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అధికారులకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. మీరు రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోరు కూడా బ‌లంగా ఉండేలా చూసుకోండి.అంతేకాకుండా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఉండాలి. ఆధార్ కార్డు, కోళ్ల ఫారం ఏర్పాటు చేయ‌ద‌ల‌చుకున్న భూమి ఫొటో, భూమికి సంబంధించిన ప‌త్రాలు, పాన్ కార్డు, ఓట‌ర్ కార్డు, రుణం తీసుకోబోయే బ్యాంకులో మీఖాతాకు చెందిన రెండు క్యాన్సిల్డ్ చెక్కులు, ఇంటి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, విద్యార్హత‌ల‌ ప‌త్రాలు స్కాన్ చేసిన మీసంత‌కం ఇనన్ని తప్పనిసరిగా ఉండాలి.

Also Read: Fish Distribution Scheme: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ద్వారానే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి.!

Leave Your Comments

Bharathi Completed Phd in Chemistry: పీహెచ్ డి ముందు చిన్నబోయిన పేదరికం.!

Previous article

Cotton Crop: ప్రస్తుత వర్షాలకు ప్రత్తి పైరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like