జాతీయంవ్యవసాయ పంటలు

Wheat Prices: పెరుగుతున్న గోధుమల ధరలని నియంత్రించడని ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు..

2
Wheat prices
Wheat prices

Wheat Prices: మన దేశంలో గోధుమ పంట ఎక్కువ శాతం రైతులు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎక్కువ వర్షాల కారణంగా పంట దిగుబడి, నాణ్యత తగ్గడంతో ప్రస్తుతం మన దేశంలో గోధుమల ధర పెరుగుతుంది. గత మూడు నెలల క్రితం ధర తక్కువగా ఉండటంతో, ఎక్కువ శాతం రైతులు తాము పండించిన పంటని అమ్మకుండా నిల్వ ఉంచారు. ప్రభుత్వం కూడా రైతులకి సహాయం చేయడానికి నిల్వ పరిమితి 3000 టన్నులకి పెంచారు.

ప్రస్తుతం గోధుమ ధర పెరగడంతో రైతులు తమ పంటని అమ్ముకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ధరల పెరగడాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం గోధుమల నిల్వ పరిమితిని తగ్గిస్తుంది. ప్రభుత్వం గోధుమల వ్యాపారులు, రైతుల కోసం గోధుమల నిల్వ పరిమితిని 2000 టన్నుల నుంచి 3000 టన్నుల వరకు ఈ సంవత్సరం జూన్ నెలలో పెంచారు.

Also Read: రొయ్యల సాగు చేసే రైతులకి శుభవార్త..

Wheat Crop

Wheat Crop

కానీ ప్రస్తుతం పెరుగుతున్న ధరలు చూసి ప్రభుత్వం మళ్ళీ ఈ నిల్వ పరిమితిని 2000 టన్నులకి తగ్గించింది. దీని వల్ల వ్యాపారాలు, రైతులు, సామాన్యులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం గోధుమలు ఒక క్వింటాల్ ధర 2550 రూపాయలు ఉంది. మన దేశంలో గోధుమ పంట లభ్యత తగ్గడంతో రష్యా దేశం నుంచి దిగుమతి చేస్తున్నారు.

గోధుమల నిల్వ సంస్థలు, గోధుమ స్టాక్ వ్యాపారాలు వారి దగ్గర ఉన్న నిల్వ శాతాన్ని ప్రతి రోజు ఈ పోర్టల్ లో నమోదు చేయాలి అని ప్రభుత్వం నిర్మాణం తీసుకుంది. https://evegoils.nic.in/wsp/login ప్రతి శుక్రవారం ఈ పోర్టల్ సమాచారాన్ని నిత్యావసర వస్తువుల చట్టం తనిఖీ చేసి వ్యాపారుల పై చర్యలు తీసుకుంటారు. వ్యాపారాలు వారి పరిమితి కంటే ఎక్కువ స్టాక్ నిల్వ చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ పరిమితిని పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ధరలను నియంత్రించేందుకు, మార్కెట్‌లో అందుబాటులో ఉండేలా ఎక్కువ పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Also Read: ఒక ఎకరంలో 20 రకాల కూరగాయలు సాగు చేయడం ఎలా..?

Leave Your Comments

Shrimp Farmers: రొయ్యల సాగు చేసే రైతులకి శుభవార్త..

Previous article

Sky Fruit Health Benefits: షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచే పోషకాల గని “స్కై ఫ్రూట్”

Next article

You may also like