పశుపోషణ

Prevention of Cruelty to Animals Act 1960: జంతు క్రూరత్వ నిరోధక చట్టం 1960

1
Prevention of Cruelty to Animals Act 1960
Prevention of Cruelty to Animals Act

Prevention of Cruelty to Animals Act 1960: 1960 సంవత్సరంలో దేశంలోని జంతువుల సంక్షేమము, పరిరక్షణకు సంబంధించి భారత కేంద్రప్రభుత్వం జంతుసంక్షేమ చట్టమును రూపొందించింది. ఈ చట్టమును ‘‘జంతు క్రూరత్వ నిరోధక చట్టము’’, 1960 అని పిలుస్తారు. ఈ చట్టము, దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. కాని, చాలా మందికి ఈ చట్టం గురించి గానీ, దాని నియమాల గురించి గానీ తెలియదు. జంతుసంక్షేమం ప్రతీ ఒక్కరి బాధ్యత. భారతదేశపౌరులుగా ఈ చట్టాల మీద, నియమాల మీద పూర్తి అవగాహన కలిగి వుండటం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి.

ఈ చట్టము ప్రధాన ఉద్ధేశ్యము :
జంతువులను అనవసర క్రూరత్వం నుండి రక్షించడం.
జంతువులు : మనుషులు తప్ప భూమి మీద ప్రాణంతో ఉన్న ప్రతీ ప్రాణి అని ఈ జంతుక్రూరత్వ చట్టములో నిర్వచించబడిరది.

జంతు క్రూరత్వం అంటే : 1960 లోని సెక్షన్‌ 11 లో జంతుక్రూరత్వం అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచింపబడిరది. ఒక్కమాటలో చెప్పాలంటే జంతువులను అనవసరంగా నొప్పికి, బాధకి గురిచేసే ఏ పని / చర్య అయినా, అది ఎవరు చేసినా క్రూరత్వంగా పరిగణిస్తారు.

ఈ చట్టమును ఎవరు పర్యవేక్షిస్తారు?
ఎ) కేంద్రస్థాయి పర్యవేక్షణ :
ఈ చట్టము మరియు సంబంధిత నియమాలు సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి ఇరవై ఎనిమిది మంది సభ్యులతో కూడిన భారత జంతు సంక్షేమ బోర్డు ని 1962 సంవత్సరంలో చట్టబద్ధంగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ద్వారా రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డుకు  ఎప్పటికప్పుడు, ఆయా అవసరాలు సందర్భాలను బట్టి తగు సూచనలు, సలహాలు మార్గదర్శకాలు ఇవ్వబడతాయి. ఈ బోర్డు కాలపరిమితి మూడు సంవత్సరాలు. ప్రతీ మూడు సంవత్సరాలకొకసారి ఈ బోర్డు ను పునర్‌వ్యవస్థీకరిస్తారు.

బి) రాష్ట్రస్థాయి పర్యవేక్షణ :
రాష్ట్రాల స్థాయిలో చట్టబద్ధంగా ఏర్పాటు కాబడిన రాష్ట్రజంతు సంక్షేమబోర్డు ఈ చట్టము అమలును పర్యవేక్షిస్తుంటుంది. ఈ బోర్డు, భారత జంతు సంక్షేమ బోర్డు వారికి జవాబుదారీగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల పశుసంవర్థకశాఖ మంత్రివర్యులు చైర్మన్‌గా వ్యవహరించే ఈ రాష్ట్ర జంతుసంక్షేమ బోర్డులో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌/ కమీషనర్‌, పశుసంవర్థకశాఖ ప్రభుత్వకార్యదర్శి మరియు ఇతర రాష్ట్రస్థాయి అధికారులు నిబంధనల మేరకు నిర్ధిష్టకాలపరిమితితో తప్పనిసరి సభ్యులుగా ఉంటారు. అలాగే కొందరు అనధికార సభ్యులు కూడా
ఉంటారు.

సి) జిల్లాస్థాయి పర్యవేక్షణ
ప్రతీ రాష్ట్రంలో జిల్లాల స్థాయిలో జిల్లా జంతు క్రూరత్వ నిరోధక సంఘం ద్వారా ఈ చట్టం అమలు తీరు పర్యవేక్షింపబడుతుంది. ఆయా జిల్లాల కలెక్టర్‌ కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరియు జిల్లాస్థాయిలోని వివిధ శాఖాధిపతులు (ఉదా: పోలీస్‌సూపరిండెంట్‌, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి తదితర ప్రభుత్వశాఖాధిపతులు) ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు. ఆయా జిల్లాల జిల్లా పశుసంవర్థకశాఖాధికారి కన్వీనర్‌ స్థాయిలో వ్యవహారాలను నిర్వహిస్తారు. ఈ  రిజిష్ట్రేషన్‌ చట్టం ప్రకారం నిర్దేశిత బైలాల ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించబడి ఉండాలి. జంతు సంక్షేమ చట్టాల అమలులో స్థానిక సంస్థలకు అవసరమైన సహాయసహకారాలను అందిచవలసి ఉంటుంది.

Also Read: తీగజాతి కూరగాయలలో ‘‘బంక తెగులు’’ నివారణ.!

Prevention of Cruelty to Animals Act 1960

Prevention of Cruelty to Animals Act 1960

జంతుసంక్షేమ చట్టాలను ఎవరు అమలు చేస్తారు?
కేంద్రప్రభుత్వ చట్టము అయినప్పటికీ, ప్రతీ రాష్ట్రంలో గ్రామపంచాయతీల పరిధిలో గ్రామపంచాయతీల ద్వారా, మునిసిపాలిటీల పరిధిలో మునిసిపాలిటీల ద్వారా, కార్పోరేషన్ల పరిధిలో కార్పోరేషన్ల ద్వారా ఈ చట్టమును అమలు పరచవలసిన బాధ్యత స్థానిక సంస్థలదే.

జంతు క్రూరత్వానికి పాల్పడితే ఏం చర్య తీసుకుంటారు?
1960 సెక్షన్‌ 32 ప్రకారం ఇండియన్‌ పీనల్‌కోడ్‌ 428, 429 సెక్షన్ల కింద కేసు నమోద చేయడంతోపాటు, కొన్ని రకాల క్రూరత్వ చర్యలలో అరెస్టు వారంటి గానీ, ముందస్తు సమాచారం లేకుండా సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. జంతుక్రూరత్వ చర్యలు పాల్పడిన వారికి ఆ చర్య నిరూపించబడినట్లయితే తగు జరిమానా లేదా మూడునెలల వరకు జైలుశిక్ష లేదా రెండూనూ విధించబడతాయి.

జంతు క్రూరత్వం జరిగితే ఎవరు ఎవరికి ఫిర్యాదు చేయాలి?
భారతదేశపౌరులు ఎవరైనా కూడా ఎక్కడైనా జంతుక్రూరత్వ చర్యలను గమనించినట్లయితే స్థానిక  గానీ ఫిర్యాదు చేయవచ్చు.

గమనిక: 1960 సెక్షన్‌ 14 ప్రకారం కొన్ని రకాల పనులను (క్రూరత్వ నిర్వచన పరిధిలోనివి అయినప్పటికీ కూడా) చట్టము పరిధిలో అనుమతిస్తారు.

1. శాస్త్ర పరిశోధనలు, ప్రయోగాల నిమిత్తం చేపట్టే పనులు
2. నొప్పి, బాధ నుండి శాశ్వతంగా తప్పించడానికి మానవత్వ పద్దతిలో జంతువులు చంపడం
3. నిర్ధేశిత పద్దతులలో అర్హత కలిగిన వారి ద్వారా చేయబడే క్రింద తెలుపుబడిన పనులు
ఎ. విత్తులు కొట్టడం
బి. ముక్కుతాడు వేయడం
సి. కొమ్ములు తీసేయడం

1960 ని అమలుచేసే ప్రక్రియలో భాగంగా కేంద్రప్రభుత్వ పశుసంవర్థకశాఖ ద్వారా జారీ కాబడే నియమాలలో అవసరమైనప్పుడల్లా సవరణలతోపాటుగా కొత్త నిబంధనలు, మార్గనిర్దేశకాలు జోడిస్తారు. ఉదాహరణకు 2001 లో ఇవ్వబడిన, 2001 నియమాలు, తగు సవరణలతో 2023  గా జారీచేయబడ్డాయి.

1965 నుండి మొదలుకొని ఇప్పటివరకు దాదాపు 23 రకాల నియమాకాలు ఇవ్వబడినాయి. 1960 తోపాటుగా వివిధ రకాల దర్శించండి. 63 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చేయబడిన ఈ చట్టానికి ఇప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 61 సవరణలతో కొత్తరూపు తీసుకవచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో శిక్షార్హులకు విధించే జరిమానా మరియు జైలుశిక్ష కాలమును కూడా సవరించే ప్రతిపాదనలు చేయబడ్డాయి. త్వరలో సవరణలతో కూడిన నూతన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్రపరిధిలోని చట్టాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో రెండు రకాల చట్టాలు ఉన్నాయి.

1. తెలంగాణ గోవధ నిషేద మరియు జంతుసంరక్షణ చట్టము, 1977

1977 వ సంవత్సరంలో చేయబడిన ఈ చట్టము ప్రకారం 14 సంవత్సరాలు పైబడిన మరియు ఆర్థికంగా ఏ విధంగానూ ఉపయోగపడని ఎద్దులు, దున్నపోతులు, పాడిగేదెలను మాత్రమే మాంసం అవసరాలకు వధించాలి. అదికూడా స్థానిక పశువైద్యాధికారి ఫారమ్‌`ఎ సర్టిఫికేట్లో  అని ధృవీకరించిన పిదప మాత్రమే. ఈ చట్టములో ఆవులను, చిన్నవయస్సు లేగలు, దూడలను వధించడం ఈ చట్టము ద్వారా నిషేధించబడిరది.

అలా కాని పక్షంలో సంబంధిత వ్యక్తులకు రూ.1000/`ల జరిమానా లేదా ఆరు నెలల జైలు లేదా రెండూనూ విధించబడతాయి. సాధారణంగా ప్రతీ సంవత్సరం ముస్లిమ్‌ సోదరులు జరుపుకునే బక్రీద్‌ పండుగ సందర్భంలో మాత్రమే ఈ చట్టముపై సంబంధిత ప్రభుత్వశాఖలవారికి మరియు ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం జరుగుతుంటుంది. ఈ చట్టము అమలులో స్థానిక సంస్థలతో కలిసి జిల్లా జంతు క్రూరత్వ నిరోధక సంఘం ఆధ్వర్యంలో నాలుగు ప్రభుత్వశాఖలు సమన్వయంతో పనిచేయాల్సి వుంటుంది.

2. తెలంగాణ జంతువులు, పక్షుల బలి నిషేద చట్టము, 1950
1950 వ సంవత్సరంలో చేయబడిన ఈ చట్టము ప్రకారము ఆచారాలు, సాంప్రదాయాల పేరిట దేవుడి గుడి ముందు, గ్రామదేవతల ముందు, జాతరలలో, ఇతర బహిరంగ ప్రదేశాలలో జంతువులను, పక్షులను బలి ఇవ్వకూడదు. ఎక్కడపడితే అక్కడ కాకుండా ఆయా స్థానిక సంస్థలు నిర్దేశించిన ఒక ప్రత్యేక నిర్దేశిత ప్రాంతంలోనే జంతువులను, పక్షులను వధించాలి. ఈ చట్టమును ఉల్లంఘించిన వారికి రూ. 300/` ల జరిమానా లేదా 3 నెలల జైలుశిక్ష లేదా రెండూ విధించబడతాయి. అంతేకాక ఏ స్థాయివారైనా జంతుబలికి సహకరించినా కూడా రూ.600/`ల జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష లేదా రెండూ విధించబడతాయి.

భారతరాజ్యాంగములోని ఆర్టికల్‌ 48 ప్రకారం, పై రెండు చట్టాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేయబడిన చట్టాలే. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు పిదప
ఆ రెండు చట్టాలు కొద్ది మార్పులతో తెలంగాణరాష్ట్ర చట్టాలుగా 01.06.2016 నుండి స్వీకరించబడినాయి.

కేంద్రప్రభుత్వ చట్టము తోపాటుగా రెండు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను కూడా స్థానిక సంస్థలే అమలు చేయాలి. అవి అమలు అయ్యేట్లు చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర జంతుసంక్షేమ బోర్డు మరియు జిల్లా జంతు క్రూరత్వ నిరోధక సంఘాలదే.

Also Read: వంగలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు యాజమాన్యం.!

Leave Your Comments

Vegetables Pests and Diseases: తీగజాతి కూరగాయలలో ‘‘బంక తెగులు’’ నివారణ.!

Previous article

Alternative Cropping Strategies: పంట కాలంలో విపత్కర పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక.!

Next article

You may also like