మత్స్య పరిశ్రమ

Shrimp Farmers: రొయ్యల సాగు చేసే రైతులకి శుభవార్త..

1
Shrimp Farmers
Shrimp Farmers

Shrimp Farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ శాతం రైతులు రొయ్యల సాగు చేస్తారు. చాలా మంది రైతులు తమ పొలంలో కొంత భాగం రొయ్యలు సాగు చేయడానికి వాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పొలంలో రొయ్యలు సాగు చేయడానికి గుంతలుగా చేసి తక్కువ ఖర్చుతో రొయ్యలు సాగు చేయడం మొదలు పెట్టారు. రొయ్యల సాగు మంచిగా సాగితే రైతులకి మంచి ఆదాయం ఉంటుంది. ప్రస్తుతం రొయ్యల సాగు ఒడిదొడుకులతో ఉండటం వల్ల ఇందులో లాభాల కంటే ఎక్కువ శాతం రైతులు నష్టపోయారు. రొయ్యలు సాగు చేసే రైతులకి ప్రభుత్వం సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రొయ్యల పంట భీమా మళ్ళీ మొదలు పెట్టింది.

మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం భీమా పథకాన్ని మొదలు పెట్టింది. ఈ భీమా మొదలు పెట్టడం ద్వారా తీరప్రాంత రొయ్యల రైతులకు ఎంతో ఆనందపడుతున్నారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖతో పాటు ఇప్పుడు రొయ్యలకి భీమా పథకం గురువారం రోజు, గుజరాత్ లో మొదలు పెట్టారు. ప్రభుత్వం రైతులకి తోడుగా ఉంటే కేవలం రొయ్యల వ్యాపారం పై 1000 కోట్ల ఆదాయం పొందవచ్చు.

Also Read:  ఒక ఎకరంలో 20 రకాల కూరగాయలు సాగు చేయడం ఎలా..?

Shrimp Farmers

Shrimps

ఈ పథకాన్ని మొదటగా 1995-96 సంవత్సరంలో మొదలు పెట్టారు. కానీ అదే సంవత్సరం రొయ్యల సాగులో వైరల్ వ్యాధి వచ్చింది. దాని వల్ల రైతులు ఎక్కువ సంఖ్యలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేశారు. దాని కారణంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళు మొదలు పెట్టిన భీమా పథకాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఇపుడు కేంద్ర ప్రభుత్వంతో, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కలిసి ఈ భీమా పథకాన్ని మొదలు పెట్టారు.

భారతదేశం రొయ్యల ఎగుమతిలో మొదటి స్థానంలోకి వచ్చింది. గత పది సంవత్సరాల నుంచి రొయ్యల ఉత్పత్తిలో 430 శాతం పెరిగింది. కానీ ఎక్కువ వ్యాధుల కారణంగా రొయ్యల పెంపకం రైతులు సాగు చేయడం తగ్గించారు. దాని కారణంగా ప్రస్తుతం రొయ్యలు సాగు చేయడానికి చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ముందుకు వస్తున్నారు. లేదా రైతులకి ఉన్న పొలంలో చాలా తక్కువ శాతంలో రొయ్యల సాగు చేస్తున్నారు. దీని వల్ల బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు రొయ్యల సాగు విషయంలో జాగ్రత్త పడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రొయ్యల సాగు రైతులకి తోడుగా ఉండటంతో రొయ్యల ఉత్పత్తి పెరిగి, రైతుల ఆదాయం పెరగవచ్చు.

Also Read: నిమ్మ పూత దశలో పాటించవలసిన మెళకువలు.!

Leave Your Comments

Vegetables Cultivation: ఒక ఎకరంలో 20 రకాల కూరగాయలు సాగు చేయడం ఎలా..?

Previous article

Wheat Prices: పెరుగుతున్న గోధుమల ధరలని నియంత్రించడని ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు..

Next article

You may also like