ఆరోగ్యం / జీవన విధానం

Yellow Watermelon Benefits: పసుపు పుచ్చకాయలతో పుష్కలమైన లాభాలు.!

2
Yellow Watermelon
Yellow Watermelon

Yellow Watermelon Benefits: పుచ్చకాయ లోపల ఏ రంగులో ఉంటుంది అనగానే వెంటనే ఎరుపు రంగు అని చెప్తాము. అయితే పసుపు రంగులో కూడా పుచ్చకాయలు ఉంటాయని తెలుసా? అవును పసుపు రంగులో కూడా పుచ్చకాయలు ఉంటాయి. ఈ పసుపు రంగులో ఉండే పుచ్చకాయలు మధుమేహ రోగులకు చాలా మంచివి. నిజానికి పసుపు రంగులో ఉండే పుచ్చకాయలను, ఎరుపు పుచ్చకాయల కంటే ముందు నుండే సాగు చేస్తున్నారు. పసుపు పుచ్చకాయలు సాధారణంగా ఎరుపు పుచ్చకాయ కంటే కొంచెం తియ్యగా ఉంటాయి మరియు తేనె వంటి రుచిని కలిగి ఉంటాయి. ఫ్రూట్ సలాడ్‌లు, ప్లేటర్‌లు మరియు డెజర్ట్‌లు, స్మూతీస్ మరియు జ్యూస్‌లలో పసుపు పుచ్చకాయను ఉపయోగించడం మంచిది. ఇది రుచి పరంగానే కాకుండా ఇందులో ఉండే అధిక నీటి కంటెంట్ మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి తోడ్పడుతుంది.

Yellow Watermelon Cultivation

Yellow Watermelon Cultivation

పసుపు పుచ్చకాయలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు మీరు సిట్రులిన్, అమైనో ఆమ్లాలు, లైకోపీన్, పొటాషియం మరియు విటమిన్లు ఎ మరియు సి లను కూడా పొందవచ్చు. అలాగే పసుపు పుచ్చకాయలో ఫైబర్ మరియు సహజ చక్కెర కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. ఎర్ర పుచ్చకాయతో పోలిస్తే, పసుపు పుచ్చకాయలో అధిక విటమిన్ సి ఉంటుంది, కావున రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పసుపు పుచ్చకాయలు అద్భుతంగా ఉపయోగపడతాయి.

Also Read: Problems in Agriculture: తగ్గుతున్న వ్యవసాయం.. లోపం ఎవరిది..?

పసుపు పుచ్చకాయల్లో రక్తపోటును తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి, తద్వారా అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పుచ్చకాయలో కొవ్వు కంటెంట్ ఉండదు గనక మీరు డైటింగ్ లో ఉన్నా కూడా పుచ్చకాయను తీస్కోవచ్చు. ఇందులో ఉండే కొల్లాజెన్ కంటెంట్ కిడ్నీ సమస్యలను నివారించడంలో కూడా తోడ్పడుతుంది.

Yellow Watermelon Benefits

Yellow Watermelon Benefits

క్రమం తప్పకుండా పుచ్చకాయను తీసుకోవడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలించడంలో సహాయపడుతుంది, తద్వారా చిగుళ్ల వాపు ఇతర నోటి సమస్యలను రాకుండా నివారించడంలో ప్రయోజకరంగా ఉంటుంది. మీరు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే పసుపు పుచ్చకాయలు మీకు అద్భుతమైన ఎంపిక. ఇందులో ఉండే అధిక నీటి కంటెంట్ విరేచనాలు మరియు మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. ఎండాకాలంలో తినాల్సిన పళ్లలో ప్రధానమైనది పుచ్చకాయ, ఇది నీరసాన్ని తగ్గించి మనల్ని ఆక్టివ్ గా ఉంచుతుంది. పుచ్చకాయలో ఉండే పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా సహాయపడతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.

Also Read: Ummetha Puvvu Health Benefits: ఉమ్మెత్త ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే.!

Leave Your Comments

Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త .. వచ్చే వారం నుంచి అకౌంట్లలో డబ్బులు.!

Previous article

PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం.!

Next article

You may also like