ఆరోగ్యం / జీవన విధానం

Ummetha Puvvu Health Benefits: ఉమ్మెత్త ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే.!

2
Ummetha Puvvu
Ummetha Puvvu

Ummetha Puvvu Health Benefits: ఉమ్మెత్త గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఉమ్మెత్త సొలనేసి కుటుంబానికి చెందిన మొక్క, దీని యొక్క శాస్త్రీయ నామం “దతురా మెటల్”. అయితే ఇది ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో… అంతే ప్రమాదకరం కూడా, ఎందుకంటే దీన్ని పచ్చిగా తీసుకుంటే చాలా ప్రమాదం, అదే సరైన పద్దతిలో శుద్ధి చేస్తే ఎన్నో ఔషధ గుణాలను అందిస్తుంది. ఉమ్మెత్త యొక్క ఆకులు, పువ్వులు, కాయలు మరియు కాండం ఇలా ప్రతీ ఒక్క భాగాన్ని అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు. ఉమ్మెత్త బలమైన నార్కోటిక్ మొక్క అయినప్పటికీ, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, నొప్పిని తగ్గించడానికి, జ్వరానికి చికిత్స చేయడానికి, గుండె పనితీరును మెరుగుపరచడానికి, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి, నిద్రను ప్రేరేపించడానికి, ప్రసవాన్ని సులభతరం చేయడానికి, జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

ఉమ్మెత్తలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్, ఆర్గానిక్ కాంపౌండ్‌లు మరియు ఖనిజాలు ఉంటాయి. దీని భాగాలలో డాటురిన్, డాటురాడియోల్, హైయోసిన్, అట్రోపిన్, నోరాట్రోపిన్, ఫాస్టూడిన్, అల్లాంటోయిన్, హైపోసైమైన్, నోరియోసియమైన్, ట్రోపేన్, మెటియోలోడిన్, స్కోపోలమైన్, మ్యూసిలేజ్, అల్బుమెన్, విటమిన్ సి, నియాసిన్ మరియు మాలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు లభిస్తాయి.

Also Read: Spotted Pod borer in Greengram: పెసరలో ఆశించే మరుకామచ్చల పురుగు`యాజమాన్యం.!

Ummetha Puvvu Health Benefits

Ummetha Puvvu Health Benefits

ఉమ్మెత్త అన్ని రకాల శ్వాసకోశ సమస్యలకు ఒక ప్రసిద్ధ ఔషధం. ఇది శరీరంపై కొన్ని యాంటిస్పాస్మోడిక్ ప్రభావాలను కలిగి ఉన్నందున ఇది ఉబ్బసం చికిత్సకు అద్భుతంగా తోడ్పడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో అలాగే ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఉమ్మెత్త యొక్క పండు వివిధ రకాల జ్వరాలను నివారించడంలో సహాయపడుతుంది. సంతానోత్పత్తిని పెంచడానికి ఉమ్మెత్తను పూర్వం నుండి సాంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

ఉమ్మెత్తలో లభించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉమ్మెత్త నిద్రలేమి సమస్యను నివారించి, మంచి నిద్ర ఉపక్రమించేలా చేస్తుంది. ఇది చర్మ మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మూత్రనాళ సమస్యలను తగ్గించడంలో మరియు జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలను నివారించడంలో కూడా ఉమ్మెత్త ప్రభావవంతంగా పని చేస్తుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి నోటి సమస్యలకు కూడా ఉమ్మెత్త ప్రయోజకరంగా పని చేస్తుంది. తలనొప్పి మరియు చెవి నొప్పి సమస్యలను కూడా ఉమ్మెత్తను ఉపయోగించి నివారించవచ్చు. చుండ్రు అలాగే బట్టతల సమస్యను తగ్గించడంలో కూడా ఉమ్మెత్తను ఉపయోగిస్తారు.

Also Read: Peepal Tree Health Benefits: ఒక్క రావి చెట్టుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు!

Leave Your Comments

Spotted Pod borer in Greengram: పెసరలో ఆశించే మరుకామచ్చల పురుగు`యాజమాన్యం.!

Previous article

PJTSAU: కృషి విజ్ఞాన కేంద్రాలు(KVK) అనుసరించాల్సిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక.!

Next article

You may also like