వ్యవసాయ పంటలు

Paddy Seed Varieties: వరి రకాల విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన మెళకువలు.!

2
MTU-1262 Marteru Paddy Seeds
Paddy Seed Varieties

Paddy Seed Varieties: ప్రపంచ వ్యాప్తంగా ఆహార అవసరాలను తీర్చడంలో ప్రథమస్ధానం వరి పంటదే. వరి పంటను పండిరచడంలో మన రైతు సోదరులు సాంప్రదాయక పద్ధతులను అవలంభిస్తుంటారు. దీని వలన దిగుబడులు పొందటం వరకు సరైనది కానీ నికర ఆదాయం తక్కువగా ఆర్జిస్తుంటారు. కావున రైతు సోదరులు శాస్త్రీయ, సాంకేతిక విలువలను జోడిరచినట్లయితే స్థిరమైన దిగుబడులకి స్వచ్ఛతతో కూడి నికర ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ప్రస్తుతం రైతు సోదరులు పాటిస్తున్న సాంప్రదాయక వరిసాగులో విత్తన సాకేతక పరిజ్ఞానాన్ని ఆపాదించినట్లయితే రైతులే తమ స్వంత పొలాల్లో 3 విత్తనాలు తయారు చేసుకొని మరలా రబీ సమయానికి వరి నాటు సమయానికి విత్తనాలను తమ వరకే కాకుండా తోటి రైతులకే లభ్యమయ్యేలా చేయవచ్చు.

వరితో రకాల విత్తనోత్పత్తి చేయుటకు పాటించాల్సిన అంశాలు ప్రధానంగా నేల ఆవశ్యకత, వాతావరణం, వేర్పాటు దూరం, కల్తీల ఏరివేత, ప్రధాన పొలం తనిఖీలు, వీటితో పాటుగా సస్య సేద్యపు పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ పద్దతలు, అదే విధంగా కోతల అనంతరం విత్తనాల శుభ్రత, ఆరబెట్టుట, తేమ, నిల్వ తదితర అంశాలను రైతులు పరిగణనలోకి తీసుకొని ఆచరించాలి.

నేలల ఆవశ్యకత మరియు వాతవరణం : విత్తనోత్పత్తిదారులు తమ స్వంత నేలల స్వభావాన్ని లక్షణాలను పరీక్ష చేయించుకోవాలి. నేల యొక్క ఉదజని సూచిక తటస్థంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అంతకు ముందు పంట అవశేషాలు, కలుపు మొక్కలు, స్వచ్ఛంగా పెరిగే వరి మొక్కలు మరియు తదితర మొక్కలను సమూలంగా నర్సరీ మరియు ప్రధాన క్షేత్రం నుండి తీసివేయాలి. దీంతో బాటుగా గాలి, వెలుతురు పంట మొక్కలకు అందేలా నాటుకోవడం చేయాలి. అతి ముఖ్యంగా మురుగు నీటి పారుదల సౌకర్యం ఉండేలా కాలువలు తీసుకోవాలి. మంచి నాణ్యమైన, స్వచ్చమైన విత్తనాన్ని పొందాలంటే ఒక కాలం వరకు ఏ పంట వేయకుండా వుంటే ఇంకా బాగుంటుంది. ఖరీఫ్‌, రబీ సమయాలు రెండు కూడా వరి రకాల విత్తనోత్పత్తికి అనుకూలమే కానీ సరైన అదునులో వేయాలి. దీంతోపాటుగా రకాల ఎంపిక కూడ ఎలాంటి వాతావరణంలో ఇమిడితుందో చూసుకోవాలి.

వేర్పాటు దూరం :
వరి సర్వసాధరణంగా స్వపరాగ సంపర్క మొక్క కొద్ది మోతాదులో 0 – 6 శాతం వరకు పరపరాగ సంపర్కం జరుగుతుంది. దీని మూలంగా స్వచ్ఛత వరిలో వేరే రకాల వల్ల కోల్పోతుంది కావున వేర్పాటు దూరం తప్పనిసరిగా పాటించాలి. విత్తనోత్పత్తి దారులు క్షేత్రం పొరుగు రైతుల క్షేత్రం నుండి కనీసం 3 మీ దూరం వేర్పాటు దూరం పాయించుకోవాలి. పునాది విత్తనం, ధృవీకరణ విత్తనాలను వృద్ధి చేస్త్తున్నప్పుడు జన్యు మరియు బాహ్య స్వఛ్ఛతలు 98 శాతానికి తగ్గకుండా పంటలనీ కాపాడుకోవాలి.

విత్తనం లభ్యమయ్యే ప్రదేశం :
విత్తనోత్పత్తి దారులు వరితో రకాల ఏమి ఉన్నాయో కొద్దిపాటి పరిజ్ఞానం ఉండాలి. దింతో పాటుగా ఏరకమైన విత్తన తరగతిన వృద్ధి చేయదలచుకున్నారో తెలిసినట్లయితే రైతులు ధృవీకరించబడిన అధీకృత సంస్థలైన, విత్తన ధృవీకరణ సంస్థలు, కృషివిజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన స్థానాలు రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, ప్రైవేటు మరియు యన్‌.జి.ఒ కె.వికె లను సంప్రదించినట్లయితే విత్తన తరగతులు దొరకడానికి అవకాశం వుంటుంది.

సస్య పద్ధతులు :
విత్తన మోతాదు, విత్తేదూరం, విత్తే సమయం, అలాగే నారుమడి యాజమాన్యం, ఎరువులు, నీటి, కలుపు యాజమాన్య పద్ధతులను పరిగణనలోకి తీసుకొని ఆరోగ్యవంతమైన పంట పొలాన్ని సాగు చేసి స్థిరమైన దిగుబడులను పొందాలి. వరిలో అనేక రకాల సాగు పద్ధతులు ఉన్నాయి. వెదజల్లే పద్ధతి, ఎరోబిక్‌ వరి సాగు, డమ్ము సీడరు పద్ధతి, శ్రీ పద్ధతి, కానీ వీటితో పోల్చినప్పుడు సాంప్రదాయకంగా పాటించే నాటు వేస్తే పద్ధతిలో ఎక్కువ సత్ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఈ నాటుకునే పద్ధతులో కలుపు సమస్య చాలా తక్కువగా వుంటుంది. విత్తన మోతాదు 2.5 ఎకరాలకి 30-40 కిలోలు అవసరమవుతుంది. నాటు వేసుకునే దూరం రకాల కాల పరిమితిని బట్టి వుంటుంది. కావున స్వల్ప కాలిక రకాలకి 10I15 సెం.మీ., మధ్యస్థ కాలిక రకాలకు 15I15 సెం.మీ.లు, దీర్ఘకాలిక రకాలకి 20I15 సెం.మీ. ఎడంగా సాళ్ళ సాళ్ళకీ, మొక్కకు మొక్కకీ మధ్య దూరాన్ని పాటించుకోవాలి. లేత వయస్సుగల నారును నాటుకోవాలి.

నెల తరువాత నాటినట్లయితే దుబ్బు సరిగ్గా చేయదు కావున రైతు సోదరులు ముదిరిన నారును నాటుకోరాదు. వానాకాలానికి స్వల్ఫ మరియు మధ్య కాలిక రకాలను ఎంచుకోవాలి. దీనివలన యాసంగి సమయానికీ రైతులకి విత్తన లభ్యత వుంటుంది. వీటితో బాటుగా సస్యరక్షణ పద్ధతులు ఎప్పటికప్పుడూ పాటిస్తూ నాణ్యమైన విత్తనాన్ని పండిరచుకోవచ్చు, అదేవిధంగా కలుపును రెండు సార్లు తీసివేయాలి. ఎరువులను మూడు దఫాలుగా, నీటి యాజమాన్యాన్ని కీలక పరిస్థితుల ఆధారంగా యాజమాన్యాన్ని చేపట్టాల్సి ఉంటుంది.

Also Read: ప్రకృతి సేద్యం ద్వారా మునగ సాగు, ఆదాయం మొండు.!

Mtu-1282 Paddy Seeds

Paddy Seed Varieties

విత్తన సాంకేతిక అంశాలు :
దీనిలో ప్రధానంగా కల్తీల ఏరివేత, క్షేత్ర తనిఖీలు, కోతల అనంతరం చేపట్టాల్సిన అంశాలు.
కల్తీల ఏరి వేత :
దీనినే మనం కేళీలు, బెరుకులు తీసివేయుట అని వాడుకలో అంటారు. ప్రధాన పొలంలో పూత దశకు ముందు, పూత మరియు కోతల ముందు కల్తీల ఏరివేత చేపట్టాలి. ప్రధానంగా పూత దశక ముందు గమనించినట్లయితే పొలంలో కేళీలు లేదా చెరుకులు కనిపిస్తాయి. వీటిని బాహ్య స్వరూపం అంటే కంటికి కనిపించే లక్షణాల ఆధారంగా గుర్తించాలి. పొలం ఎత్తు, పొలం రకం, పూత దశ రోజులు, ఆకుల రంగు, ఆకుల ఆకారం, పత్రాల కోణం, పుష్ప విన్యాస ఆకారం, గింజ భాగాల యొక్క రంగు, ఆకారాలను పరిగణనలోకి తీసుకొని క్షేత్రాల నుండి తీసివేయాలి. అలాగే వన్య వరి జాతులైన ఊద, తుంగ, గరిక, విటితో బాటుగా కాండం తొలిచే పురుగు సోకిన కర్రలు, గొట్టాలు, అలాగే పసుపు ఉండలు సోకిన వెన్నులు, అగ్గి తెగులు సోకిన దుబ్బలను పొలాల నుండి సమూలంగా తీసి వేయాలి.

క్షేత్ర తనిఖీలు : రైతుస్థాయిలో వరి విత్తనోత్పత్తి జరుగుతున్నప్పుడు రైతు శాస్త్రీయ అంశాలు పాటించుకోవాలి. అదే విధంగా విత్తన ధృవీకరణ సంస్థ, సూచనలను, సలహాలను పాటించుకోవాలి. వరితో రకాల విత్తనోత్పత్తి చేసేటప్పుడు రెండు సార్లు అధికారులతో, నిపుణులతో కలిసి రెండు సార్లు పూత దశలో మరియు కోతల సమయంలో క్షేత్రం లేదా పొలం తనిఖీలు చేసేటప్పుడు వేర్పాటు దూరం, స్వంతగా పెరిగే మొక్కలు, కల్తీలు, కేళీలు, తెగుళ్ళు సోకిన మొక్కలను గమనించి తీసివేయాలి.
విత్తన ధృవీకరణ సంస్థ నిబంధనల ప్రకారం.
పునాది విత్తన ధృవీకరణ విత్తనం

కేళీలు లేదా కల్తీలు 0.05 % 0.20%

అభ్యతరకరమైన కలుపు మొక్కలు 0.01 % 0.02%

తెగుళ్ళు, చీడపీడలు సోకిన మొక్కలు 0.10 % 0.50%

పంటకోత :
వరి విత్తనోత్పత్తిలో సాంప్రదాయక పద్ధతితో మాదిరిగానే కోతలు నిర్వహిస్తారు. లేత నిమ్మ పండు రంగులోకి వెన్నులు మారగానే తడి పెట్టడం ఆపి కర్రలు ఎండుదల కాగానే కోతలు చేపడుతారు. 23-24 శాతం తేమ ఉన్నప్పుడు కోతలు నిర్వహిస్తారు. కానీ ఇప్పటి పరిస్థితులతో యాంత్రిక పద్ధతులలో కోత మిషనులతో కోస్తారు అప్పుడు తేమ శాతం 16-18 శాతం వుంటుంది. వాటిని కల్లంలోకి చేర్చి  m  టార్పలిన్‌ మీద రెండు నుండి నాలుగు రోజులు ఆరబెట్టి ఎండతీస్తే తేమ శాతం 14 వరకు వస్తుంది. సంచుల నింపడానికే వెంటనే అమ్మదలచినట్లయితే) ఈ ప్రేమశాతం సరిపోతుంది కానీ నిలని చేయాలనుకుంటే 11-12 శాతం వరకు వుంటనే చేయాలి. అధునాతన పద్ధతులతో శుభ్రం చేయుట, తూర్పర, అలాగే వైవిధ్య భరితమైన ఇతర రకాల గింజలు చెత్త, చెదారం, జడపదార్థం లేకుండా చూసుకొని విత్తన పరీక్షల ఆధారంగా వాణిజ్య సరళిలో విత్తనాలను అమ్ముకోవటం జరుగుతుంది.

దిగుబడి : ఎంపిక చేసిన రకాల ఆధారంగా మరియు మేలైన యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలను పాటించినట్లయితే ఎకరానికి 35`40 క్వింటాళ్ళ సుస్థిరమైన దిగుబడినిస్తుంది.

Also Read: కందిలో తెగుళ్ల నివారణకు పద్ధతులు.!

Leave Your Comments

Drumstick Farming: ప్రకృతి సేద్యం ద్వారా మునగ సాగు, ఆదాయం మెండు.!

Previous article

Electricity Consumption: రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్, పగటిపూట మాత్రమే.!

Next article

You may also like