చీడపీడల యాజమాన్యం

Red Gram Pests: కందిలో తెగుళ్ల నివారణకు పద్ధతులు.!

2
Pests in Redgram
Pests in Redgram

Red Gram Pests: ఇరు తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న పప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది.. తెలంగాణా ప్రాంతంలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల 80 వేల ఎకరాల్లో కందిని సాగవుతుంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది. దీని వల్లన 1 లక్షా 38 వేల టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉంది.

వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా అందరు కందినే విత్తుకున్నారు. ఏకపంటగా వేస్తే ఎకరాకు 6 నుండి 7 కిలోల విత్తనం, అంతర పంటగా వేస్తే 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది. కంది సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. మరి సాగులో అధిక దిగుబడులు పొందాలంటే సమగ్ర యాజమాన్యం అనేది తప్పకుండా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు

అపరాలల్లో కంది ప్రధాన పంట. మన రాష్ట్రంలో కంది వర్షాధార పంటగా అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈసంవత్సరం వర్షాలు ఆలస్యంగా రావడంతో రైతులు కందిని ఆలస్యంగా విత్తుకున్నారు. కానీ అంతలోనే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కంది పంటకు చాలా నష్టం వాటిల్లింది. పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కంది మొలక కూడా రాలేదు. రైతులు రెండవసారి కంది పంట విత్తుకున్న కూడా తర్వాత కురిసిన అతి భారీ వర్షాలు వల్ల తెగులు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లింది. కావున ఈ తెగుళ్లు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఈతెగులు ఆధిక వర్షపాతం మరియు నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. పైరు తొలిదశ మొదులుకొని మొక్క ఏ దశలోనైనా అధిక వర్షపాతం నమోదై మురుగునీరు పోయే పరిస్ధితి లేనప్పుడు పొలంలో నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

Also Read: రైతులకు కల్పతరువుగా మారిన బొప్పాయి సాగు.!

Redgram

Redgram

ముఖ్యంగా తెగుళ్లు తొలిదశలో ఆశించినట్లయితే ఆకులు మరియు కాండం పైన నీటిమచ్చలు ఏర్పడి అవి తర్వాత గోధుమ రంగు కు మారుతాయి. ఈమచ్చలు తర్వాత దశలో ముదురురంగుకు మారి మొక్కలు వడలు పోయి గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతాయి. శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తుంది. కావున రైతులు కచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టాలి అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడెర్మా అని జీవసంబంధ రసాయన శిలీంద్రాని చివికిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తర్వాత పొలం మొత్తం వెదజల్లాలి. మోటాలాక్సిల్ ఏ2 గ్రాములు ఒక కేజీ విత్తనానికి రెండు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ట్రైకోడెర్మా 10 గ్రాముల ఒక కిలో వితన శుద్ధి చేసుకోవాలి.

సాధారణ పద్ధతిలో గొర్రుతో కంది పంటను విత్తడం వలన అధిక వర్షాలకు నీరు నిలిచి పంట తెగులు బారిన పడుతుంది. కావున దీనికి బదులుగా ఎత్తు మొదలు చేసుకుని వాటిపైన కందిని విత్తుకోవడం వల్ల వర్షపు నీరు నిలవకుండా చేయవచ్చు. దీనికి నాలుగు అడుగుల ఎడంతో బెడ్ ను తయారు చేసుకోవాలి. అలాగే మడును మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువల్ని వదులుకోవాలి. అధిక వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మొటాలాక్సిల్ లేదా మ్యాంగోజప్ అనే మందులు రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసి చుట్టూ ఉండే మొదలు లో తడిసే విధంగా మందు పిచికారి చేసుకోవాలి.

Also Read: పండ్ల తోటల్లో కాండం తొలిచే పురుగు నివారణ.!

Leave Your Comments

Papaya Cultivation: రైతులకు కల్పతరువుగా మారిన బొప్పాయి సాగు.!

Previous article

Drumstick Farming: ప్రకృతి సేద్యం ద్వారా మునగ సాగు, ఆదాయం మెండు.!

Next article

You may also like