జాతీయం

PM-Kisan scheme: బీహార్ లో ఈ పధకానికి 81 వేల మంది రైతులు అనర్హులు.!

2
PM Kisan FPO Yojana Scheme
PM-Kisan scheme:

PM-Kisan Scheme: దేశంలోని అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 14వ విడత దాకా రైతులకు ఆకౌంట్ లో జమ చేశారు. పంటసాయం కింద సంవత్సరంలో మూడు సార్లు 2000 చొప్పున 6000 కేంద్ర ప్రభుత్వం రైతులకు సహయం చేస్తోంది. ఇప్పటివరకు 14 విడతలుగా రూ.28 వేలు రైతుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసారు. అంతే కాకుండా మరో రెండు నెలల్లో 15వ విడత డబ్బులు కూడా పడతాయి. ఇవి రైతులకు వేడి నీళ్ళకు చనీళ్ళగా ఉపయోగపడుతున్నాయి.

ఆయితే ఈనేపధ్యంలో బిహార్ నుంచి సుమారు 81 వేల మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ అనర్హులుగా గుర్తించారు. వీరి దగ్గర్నుంచి ఇప్పటికే డబ్బులు వసూలు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంకులను ఆదేశించింది. అయితే బ్యాంకు ఆదికారులు అదే పనిలో ఉన్నారు. రైతులు మాత్రం డబ్బులు ఇచ్చి వెనకకు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

లబ్ధి పొందేందుకు అర్హులా? అనర్హులా?

బిహార్‌లోని ఈరైతులందురు టాక్స్ కడుతుండటం, కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం, కారు ఉండటం వంటి ఇతరత్రా కారణాలతో పీఎం కిసాన్ స్కీంకు అనర్హులుగా తేల్చింది. పీఎం కిసాన్ పధకం ప్రకారం అర్హులైన రైతులకే మాత్రమే ఈప్రయోజనాలు దక్కుతాయని కేంద్రం తెల్చి చెబుతుంది. పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈరైతు కుటుంబాలు ఈపథకం నుంచి లబ్ధి పొందేందుకు అర్హులా? అనర్హులా? అనేది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గుర్తిస్తాయి.

Also Read: రైతులకు తీపి గా మారిన పుచ్చకాయ సాగు.!

PM Kisan scheme

PM-Kisan scheme

ప్రయోజనాలు పొందేందుకు వీల్లేదు..

ఈపథకానికి ఎవరు అర్హులు కారో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్‌స్టిట్యూషనల్ ల్యాండ్ కలిగి ఉన్న వారు అనర్హులు. ఏదైనా రాజ్యాంగ బద్ధ పదవుల్లో మంత్రులుగా పనిచేసినవారు పనిచేస్తున్నవారు, రాష్ట్ర మంత్రులు, లోక్‌‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, విధానసభ గత, ప్రస్తుత సభ్యులు సహా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీల మాజీ, ప్రస్తుత ఛైర్‌పర్సన్స్, ప్రభుత్వఆధికారులు, రేషన్ కార్డు లేనివారు పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఆఫీసులు, ఇతర విభాగాలు, ఫీల్డ్ యూనిట్లలో పనిచేసిన/పనిచేస్తున్న అధికారులు. పదవీ విరమణ పొందిన/రిటైర్డ్ పెన్షనర్లు, గత అసెస్‌మెంట్ ఇయర్‌లో ఆదాయపు పన్ను చెల్లించినవారు డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వారు కూడా పీఎం కిసాన్ స్కీం ప్రయోజనాలు పొందేందుకు వీల్లేదు. కావున ప్రభుత్వం అర్హులకు మాత్రమే అవకాశాన్ని కల్పిస్తుంది.

Also Read: రైతు భరోసా పథకానికి కొత్త దరఖాస్తుల స్వీకరణ.!

Leave Your Comments

Watermelon Cultivation: రైతులకు తీపి గా మారిన పుచ్చకాయ సాగు.!

Previous article

Suggestions to Boost Lemon Yield: నిమ్మ తోటల్లో అధిక దిగుబడులకు రైతులకు మేలైన సూచనలు.!

Next article

You may also like