ICAR has a museum with 35 fodder species గోవాలోని సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ( Parshottam Rupala )సందర్శించారు. గోవాలో ఇటీవల ప్రారంభించిన పశుగ్రాసం మ్యూజియాన్ని తిలకించిన అయన కొంత సమయం పాటు పశువులతో గడిపారు. ఇందులో తీరప్రాంత జోన్‌కు అనువైన 35 రకాల పశుగ్రాస జాతులు ఉన్నాయి. ఇవి రైతులకు ప్రత్యక్ష ప్రదర్శన యూనిట్‌గా పనిచేస్తాయి.
కాగా.. సంస్థ కార్యకలాపాలను పరిశీలించిన మంత్రి పాడి పశువుల యూనిట్‌ను, పర్యావరణ అనుకూల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో రైతులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, డెయిరీ ఫెడరేషన్ ప్రతినిధులు ఆయనతో సంభాషించారు. సంస్థ అవలంభిస్తున్న చర్యలను ఆయనకు వివరించారు. సబ్వెన్షన్‌లు, బ్యాంకు పాలసీ, ఉప్పునీరు చొరబాట్లు, జంతు వ్యాధులు తదితరాల విషయాలపై వారు చర్చించారు. ICAR has a museum with 35 fodder species
ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో అయన చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని వారిని ప్రోత్సహించారు. జంతు మరియు మత్స్య ఉత్పత్తిని పెంపొందించడంలో తీసుకుంటున్న ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు. పశుసంవర్ధక మరియు మత్స్య రంగంలో పారిశ్రామికవేత్తలను సృష్టించేందుకు సవరించిన పథకాల ప్రయోజనాలను కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పంచుకున్నారు. ICAR