ఆరోగ్యం / జీవన విధానం

Tomato Benefits: టమాటో ఉడకబెట్టి తినడం వల్ల కలిగే లాభాలు.!

0
Summer Tomato Cultivation
Tomato Price

Tomato Benefits:  టమాటాలతో మనం అనేక వంటకాలను తయారు చేయవచ్చు. అత్యంత తక్కువ ధర కలిగిన కూరగాయల్లో టమాటాలు ఒకటి. వీటిని మనం రోజూ కూరల్లో వేస్తుంటాం. టమాటాల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌ ఎ, సి అధికంగా ఉంటాయి అయితే వంటకాలను చేయడం కన్నా వాటిని కాస్తంత ఉడికించి నేరుగా తింటేనే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మూడు టమాటాలను తీసుకుని నూనె లేకుండానే గిన్నెలో ఉడకబెట్టి వాటిని అలాగే ఉదయాన్నే తింటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

 Tomato Benefits.

Tomato Benefits.

టమాటో తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే టమాటాల్లో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. దీంతో కంటి వ్యాధులు తగ్గుతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. దీని వల్ల రక్త నాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా ఉంటుంది.

దీంతో హార్ట్‌ ఎటాక్‌ల రావు. అలాగే షుగర్‌ వ్యాధి గ్రస్తులకు కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ లెవల్స్‌ను మెరుగుపరుస్తాయి. రోజూ టమాటాలను తినడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. కనుక టమాటాలను రోజూ తినాలి.

టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ సమృద్ధిగా ఉంటుంది.ఇది గుండెను సంరక్షిస్తుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే టమాటాల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి. అలాగే అధిక బరువును తగ్గించడంలోనూ ఈ ఫైబర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: Cauliflower Health Benefits: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాలీఫ్లవర్.!

Leave Your Comments

Benefits of Barley Seeds: బార్లీ గింజలను నానబెట్టి తినడం వల్ల కలిగే లాభాలు.!

Previous article

Importance of Floriculture: పూల పెంపకం ప్రాముఖ్యత.!

Next article

You may also like