నీటి యాజమాన్యం

Rules for Watering: నీటిని పెట్టే నియమావళిని తెలుసుకోండి.!

1
Watering
Watering

Rules for Watering: పైరుకి నీరు ఎప్పుడు పెట్టాలి అనే విషయం తెలిసికోవడం ముఖ్యం. నేలలో నీరంత మొక్కలకు లభ్యం కాదు. నీటి నిల్వ సామర్ధ్య స్థితి (field capacity) నుండి శాశ్వతం గా మొక్క వాడే స్థితి (permanent wilting point) మధ్య గల నీరే మొక్కలకు లభించే నీరు. ఈ లభించే నీరులో 50 శాతానికి తగ్గిన వెంటనే నీరు పెట్టాలి. ఆలస్యం చేసిన మొక్కలు నీటిని తీసుకోవాలంటే ఎక్కువ శక్తిని ఉపయోగించాలి. దీనివల్ల దిగుబడి తగ్గుతుంది. పంటకు నీటిని ఎక్కువగా పెట్టకూడదు.భూమిలో తేమను కొలిచే సాధనాలు చాలా ఉన్నాయి. కాని అవి రైతులకు అందుబాటులో లేవు. అంతే గాక వాటిని ఉపయోగించ డానికి సాంకేతిక పరిజ్ఞానం కావాలి. అందువలన రైతులు సులభమైన పద్ధతులను అవలంబించాలి.

15-20 సెం.మీ లోతున వున్న మట్టిని చేతితో పట్టుకుని చూచి దానిలోని తేమను గమనించాలి. దీనికి కొంత అభ్యాసం కావాలి. మొక్కలకు లభ్యమయ్యే తేమ 50 శాతం తగ్గినపుడు మట్టిని చేతితో పట్టి చూసిన ఈ క్రింది విధం గా ఉంటుంది.

ఇసుక నేలలు: చేతిలోనికి కొంత మట్టి తీసుకొని గట్టిగా నొక్కిన ముద్ద గా తయారు కాదు.

కొద్దిపాటి ఇసుక గల నేలలు: చేతిలోనికి కొంత మట్టిని తీసుకొని గట్టిగా నొక్కిన ముద్దా గా తయారైనప్పటికి మట్టి విడిపోతుంది.

బంక మట్టి నేలలు: మట్టి ని చేతిలోనికి తీసుకొని గట్టిగా నొక్కిన ముద్ద అవుతుంది. ఆ మట్టిని చూపుడు వేలు, బొటన వ్రేళ్ళ మధ్య నొక్కినచో ఆ మట్టి సన్నని చీలికగ వ్రేళ్ళ మధ్య సాగుతుంది.

Also Read: Drip Irrigation Techniques: డ్రిప్ నీటి పారుదలలో కొన్నిమెళుకువలు.!

Rules for Watering

Rules for Watering

పంటకు నీరు ఎప్పుడు పెట్టాలి అని తెలిసికొనుటకు మరొక పద్ధతి ని వాడవచ్చు. దీనిని “ఇసుక గుంత” ఈ పద్ధతి ఇసుక నేలలకు తప్ప అన్ని రకాల నేలలకు, వరి పైరుకు తప్ప అన్ని రకాల పైరులకు అన్ని దశలలో ఉపయోగపడుతుంది. పంట పొలం లో సుళువు గా వెళ్ళుటకు వీలగుచోట 3′ పొడవు, 3′ వెడల్పు, 3′ లోతు గల గుంత ను తీయాలి.

గుంత నుండి తీయగా వచ్చిన మట్టితో (పరిమాణం ను బట్టి) ఇసుకను బాగుగా కలిపి మరల గుంతను నింపాలి. ప్రతి 6 దళసరి మట్టి గుంత లో వేసిని పిమ్మట గట్టి గా మట్టిని అణచాలి. పొలం లో ఏ పైరును పెడతారో ఆ గుంత పై మట్టి లో ఆ పైరునే నాటుతారు. గుంతలో గల మట్టిలో ఇసుక పాలు ఎక్కువగా ఉండడం చే ఆ పైరు వేగం గా వాడిపోయే స్థితి కి చేరుతుంది. ఆ స్థితి లో పైరు కంతటికీ నీరు పెట్టుకోవాలి.

ఇసుక ఎంత కలపాలనేది నేల స్వభావాన్ని బట్టి 5 శాతం నుండి కొంచెం ఆటో ఇటో మార్చుకోవాలి. అవసరమైన నీరు మొక్కలకు పెట్టడమైనదా? లేదా? అని తెలిసి కొనుటకు ప్రోట్ (probe) అను సాధనo ను ఉపయోగించ వచ్చు. ప్రోట్ T ఆకారము గల ఇనుప కడ్డీ. దీనిని భూమిలోనికి మామూలు గా నొక్కిన ఎంత లోతు వరకు వేల తడిపినది తెలుసుకొనవచ్చు.

Also Read: Irrigation for Plants: మొక్కలకి నీటి పారుదల వేటి పైన ఆధారపడి ఉంటుంది.!

Leave Your Comments

Transmissible Gastro Enteritis in Pigs: పందులలో ట్రాన్సిమిసబుల్ గ్యాస్ట్రా ఏంటి రైటిస్ వ్యాధి కి ఇలా చికిత్స చెయ్యండి.!

Previous article

Rice Stem Borer: వానాకాలం లో వరి కాండము తొలుచు పురుగు ఇలా నివారించండి.!

Next article

You may also like