యంత్రపరికరాలు

Sugar Mills: చక్కెర కర్మాగారాలకు నష్టాలా? వ్యర్థపదార్థాల ద్వారా వచ్చే ఆదాయం?

2
Sugar Mills
Sugar Mills

Sugar Mills: కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమై పలు అంశాలు చర్చించింది. కొన్నింటికి ప్యాకేజీలు ప్రకటించింది. మరి కొన్నింటికి నిధులు కేటాయించటం జరిగింది. వాటిలో చక్కెర పరిశ్రమకు ప్రకటించినప్యాకేజీ ప్రధానమైంది. దేశ వ్యాప్తంగా వున్న చక్కెర కర్మాగారాలు చెరకు రైతులకు వేల కోట్లు బకాయిలు పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యాక్టరీలు వేల కోట్లు రైతులకు బాకీ పడినప్పుడు రైతులు ఆర్థిక ఇబ్బందులనెదుర్కోవటం, ఆందోళనలకు దిగటం సహజం. అలాంటప్పుడు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంటుంది. కష్టాల్లో వున్న రైతుల్ని ఆదుకోవటం సమంజసం, సమర్థనీయం కూడా.

ప్రభుత్వ సంకల్పం అభినందించదగినదే. దానిని ఎవరూ తప్పు పట్టరు. అయితే పంచదార పరిశ్రమలకు ఎందుకు నష్టాలు వస్తున్నాయి? రైతులకు ఎందుకు బకాయిలు పడుతున్నారు? అనే అంశాలను పరిశీలించాల్సిన అవసరం వుంది. ప్రకృతి వైపరీత్యాలు పరిశ్రమలకు నష్టం కలిగించవు. ఫ్యాక్టరీలలో పని చేసేవారు నిర్లక్ష్యంగా వ్యవహరించి నష్టం కలిగించే అవకాశం వుండదు. ఆర్థిక ఇబ్బందులను తీర్చటానికి బ్యాంకులు సిద్ధంగా వుంటాయి.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి రైతులకు పైసా ఎక్కువ చెల్లించరు. కనీస పంచదార దిగుబడి ఇవ్వని చెరకును ఫ్యాక్టరీలు స్వీకరించరు. ఉత్పత్తయిన పంచదారను దొంగలు దోచుకుపోయే అవకాశాలు అసలే ఉండవు. రైతు ఫ్యాక్టరీకి తచ్చిన చెరకును కాటా వేసినప్పటి నుంచి పంచదార తయారై గోదాములకు చేర్చే వరకు పలు దశల్లో నిఘాలు వుంచి, లెక్కలు కట్టుదిట్టం చేస్తారు. అలాంటి దశలో పంచదార ఫ్యాక్టరీలకు నష్టం ఎలా సంభవం?
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మించి చెల్లించే ఫ్యాక్టరీలు అరుదుగా వుంటాయి.

చెరకు విస్తీర్ణం తగ్గినప్పుడు, ఫ్యాక్టరీ పనిదినాలు తగ్గుతాయని అభిప్రాయపడినప్పుడు మద్దతు ధరకు మించి చెల్లించే ఫ్యాక్టరీలు అక్కడక్కడ వున్నాయి. అలాంటివి సంభవించినప్పుడు ఆ ఫ్యాక్టరీలకు మాత్రమే నష్టం రావచ్చు. ఇప్పుడలా కాదే. దేశంలోని మొత్తం ఫ్యాక్టరీలకు నష్టం వాటిల్లి, రైతులకు బకాయి పడినట్లు ప్రచారం జరగటాన్ని విజ్ఞులు ఎలా సమర్థిస్తారు? ప్రభుత్వం ప్రకటించిన టన్ను చెరకు మద్దతు ధర 2,750 రూపాయిలు. 10 శాతం రికవరీ ఇచ్చే చెరకు టన్నుకు ఆ ధర విధిగా చెల్లించాలి. 10 శాతం రికవరీ అంటే టన్ను చెరకు నుంచి 100 కిలోల పంచదార దిగుబడి వచ్చి తీరాలి. దీన్ని నిర్ధారించేది ప్రాథమిక దశలో ఫ్యాక్టరీ వ్యవసాయ సిబ్బంది అయినా, అటు తర్వాత చెరకు నమూనాలను ఫ్యాక్టరీలోని ల్యాబ్‌కి పంపి, రికవరీని నిర్ధారించాక మాత్రమే, రైతు చెరకును ఫ్యాక్టరీకి తీసుకురావటానికి అవసరమైన అనుమతులు మంజూరు చేస్తారు. కాబట్టి ఫ్యాక్టరీకి చెందిన ఏ విభాగంలోనూ పొరపాట్లు దొర్లే అవకాశం ఉండదు. 9.5 శాతానికి మించి అదనపు దిగుబడి ఇచ్చే చెరకుకు ఫ్యాక్టరీలు అదనపు చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది చట్టంలోనే వుంది.

రికవరీ ఆధారంగా వచ్చే అదనపు ధరను చాలా ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించటం లేదు. క్రషింగ్‌ ముగిసిన అనంతరం ఆ సీజనులో క్రషింగ్‌ చేసిన మొత్తం చెరకు, ఆ సీజనులో ఉత్పత్తయిన మొత్తం పంచదారను లెక్కకట్టి, ఆ సీజను సరాసరి దిగుబడిని నిర్ధారిస్తారు. 10 శాతం కన్నా తక్కువ దిగుబడి వచ్చినప్పుడు ధరలో వ్యత్యాసం చూపకుండా మద్దతు ధర చెల్లించి తీరాల్సిందే. దానిని సాకుగా చూపి కొన్ని ఫ్యాక్టరీలు అదనపు రికవరీకి అదనంగా చెల్లించాల్సిన ధరలను చెల్లించటంలేదు.

Also Read: Coleus Cultivation: కోలియస్‌ దుంప సాగు.!

Sugar Mills Machine

Sugar Mills Machine

రాష్ట్రంలోని ఫ్యాక్టరీల రికవరీలను క్రోడీకరించి, రాష్ట్ర సరాసరి రికవరీని స్థిరీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పంచదార కర్మాగారాల సరాసరి రికవరీ కనీస రికవరీ కన్నా గతంలో ఎక్కువగా వుండటం గమనార్హం. 2001-2002 సీజను నుంచి 2016-2017 సీజను వరకు 10.03 శాతంకు తగ్గిన సీజన్లు లేవు. ఆ ఒక్క 2016-2017 సీజనులో మాత్రం 10.03 శాతానికి పరిమితమైంది. 2016-17 సీజనులో 10.68 శాతంగా నమోదైంది. 10.68 శాతం రికవరీ అంటే టన్ను చెరకు నుంచి సుమారుగా 106 కిలోలకు పైగా పంచదార దిగుబడి వచ్చింది.

కాలగమనంలో పంచదార రికవరీ తగ్గుకుంటూ వస్తోంది. 10 శాతానికి మించి రికవరీ రావటం రాదు. అందుకు కారణాలు విశ్లేషించడం సాధ్యం కాదు. పంచదార దిగుబడి శాతం తగ్గటం వల్ల అదనపు ధర రైతుకు రావటం లేదు. రైతు నష్టపోతున్నాడు. ఫలితంగా చెరకు సాగు తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రం విడిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 38 పంచదార కర్మాగారాలు పని చేస్తుండేవి. ప్రస్తుతం తెలంగాణలో 6, ఆంధ్రాలో 5 మాత్రమే పని చేస్తున్నాయి. మిగిలినవన్నీ మూతపడిపోయాయి. అలా మూతబడటానికి ప్రధాన కారణం అవసరమైనంత చెరకు సరఫరా కాకపోవటమే. చెరకు పండిరచి రైతు నష్టపోతున్నాడు. అవసరమైన చెరకు లభ్యత లేక ఫ్యాక్టరీలు నష్టపోతున్నాయి.

చెరకు కొనుగోలు మాత్రమే ఫ్యాక్టరీలకు ఖర్చు కాదు. ఇంకా పలు ఖర్చులు యాజమాన్యాలకున్నాయి. ఫ్యాక్టరీ నిర్వహణ, సిబ్బంది జీతాలు. ఇలా అనేక ఖర్చులు విధిగా వుంటాయి. వాటిన్నింటినీ కలుపుకొంటే పంచదార అమ్మకం ద్వారా చేకూరే స్వల్ప లాభం సరిపోదు. అది అంగీకరించి తీరాల్సిన విషయమే. ఒక టన్ను చెరకును పంచదారగా మార్చి, గోదాములకు చేర్చటానికి మారో ఆరు వందల నుంచి ఏడు వందల దాకా అదనపు ఖర్చు అవుతుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువలుంటాయి. అలాంటి దశలో పంచదార అమ్మకం ద్వారా చేకూరిన స్వల్ప లాభం ఫ్యాక్టరీ నిర్వహణకు సరిపోదు. ప్రతిటన్ను చెరకు నుంచి ఉత్పత్తవుతున్న పంచదార అమ్మకం ద్వారా వచ్చిన రాబడి కన్నా మరో మూడు, నాలుగు వందల రూపాయలు అదనంగా ఖర్చై వుంటుంది. దానినే ఫ్యాక్టరీలు లెక్కల్లో చూపించి నష్టాలు వస్తున్నాయని అంటున్నారు.

ఫ్యాక్టరీలకు వస్తున్న ఆదాయం ఎక్కువ. పంచదార ధర మరీ పడిపోయి నష్టాలు వాటిల్లుతున్నాయని ఫ్యాక్టరీలు గగ్గోలు పెడుతున్న వాటికి క్వింటాలు రూ. 2,900లకు తగ్గించి అమ్మవద్దని కేంద్ర మంత్రివర్గ సమావేశం సూచించింది. ప్రభుత్వం సూచించిన కనీస ధరకు పంచదారను అమ్మినా 106శ2,900`3,074 రూపాయలు ఒక్క టన్ను చెరకు కొనుగోలు ద్వారా ఫ్యాక్టరీకి లభిస్తుంది. ఈ 3,074 రూపాయలకు ఫ్యాక్టరీ పెట్టిన పెట్టుబడి రూ.2650లు లేదా కొంచెం పెచ్చు. (అదనపు ధర చెరకు చెల్లించి వుంటే) దీన్ని బట్టి చెరకు కొనుగోలు ధర కన్నా, ఆ చెరకు ద్వారా ఉత్పత్తయిన పంచదార అమ్మకం ద్వారా చేకూరే లాభం ఎక్కువ. టన్నుకు 300 రూపాయలకు పైగా లాభం చేకూరుతోంది. దీనిలో ఉత్పత్తి వ్యయం క్రోఢీకరించాల్సి వుంటుంది.

చెరకు కొనుగోలు మొత్తం మాత్రమే ఫ్యాక్టరీలకు పెట్టుబడి కాదు. చెరకు క్రషింగ్‌ చేసినప్పటి నుంచి పంచదార తయారయ్యే వరకు వెలువడుతున్న వ్యర్థ పదార్థాల ద్వారా వచ్చే ఆదాయం సంగతేంటి? లెగాప్‌ (చెరకు పిప్పి), ఫిల్టర్‌ కేక్‌, మొలాసిస్‌ లాంటివి వ్యర్థ పదార్థాలుగా వెలువడుతుంటాయి. చెరకు పిప్పి నుంచి నాణ్యమైన కాగితం తయారవుతుంది. ఇటీవలి కాలంలో ఆ పిప్పిని కాల్చి మ్యాట్‌లు తయారు చేస్తున్నారు. విద్యుత్‌కి ఎంత ధర వుందో వివరించనక్కర్లేదు. ఫిల్టర్‌ కేక్‌ దీనిలో 1.5 నత్రజని, 1.5 శాతం భాస్వరం. 0.5 శాతం పొటాష్‌ లాంటి పోషకాలున్నాయి. సేంద్రియ ఎరువుల తయారీలో వీటి పాత్ర అమోఘం.

ఈ ఫిల్టర్‌ కేక్‌కి మరికొన్ని పోషకాలు జోడిరచి, అందంగా స్టోర్‌ చేసి అరకిలో 80 రూపాయలకు అమ్ముతున్నారంటే దీని విలువ వివరించలేము. ఇక మొలాసిస్‌. దీని ద్వారా ఆల్కహాల్‌ ఉత్పత్తి చేస్తున్నారు. స్పిరిట్‌ తయారీతో పాటు అనేక విలువైన ఉత్పత్తులు ఈ మొలాసిస్‌ ద్వారా తయారవుతున్నాయి. ఈ మూడిరటి వల్ల వచ్చే ఆదాయం ఫ్యాక్టరీ చెరకుకు చెల్లించిన ధర కాన్నా ఎక్కువగా వుంటుందని పరిశ్రమ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. రైతు పండిరచిన చెరకు కొని, కొన్ని వేల రూపాయల ఆదాయం పొందుతుంటే నష్టాలు ఎందుకు వస్తాయి?

Also Read: Pond Water Quality Management: చెరువు నీటి నాణ్యత – యాజమాన్య పద్ధతులు

Leave Your Comments

Pond Water Quality Management: చెరువు నీటి నాణ్యత – యాజమాన్య పద్ధతులు

Previous article

SRSP Project 60 Years: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయని.!

Next article

You may also like