యంత్రపరికరాలు

Modern Agricultural Equipments: వ్యవసాయ పనులకు కావలసిన ఆధునిక వ్యవసాయ పరికరాలు.!

2
Modern Agricultural Equipments
Agricultural Equipments

Modern Agricultural Equipments: వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక వ్యవసాయ విధానాలలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే కొత్త వంగడాలు, వ్యవసాయ పద్దతుల ద్వారా పెరిగిన ఉత్పాదకతను చేజిక్కించుకొని రైతు పూర్తి లాభం పొందాలంటే, గ్రామాలలో ఉండే వ్యవసాయ కూలీల లోటు మరియు సకాలంలో చేయవలసిన పనులను నిర్వర్తించేందుకు యాంత్రీకరణ మాత్రమే రైతుకు అండగా సహాయపడగలదు. ఈ యాంత్రీకరణ ముందుగా ట్రాక్టరును మొదలుకొని వ్యవసాయపనులలో ఉపయోగపడే యంత్రాలను రూపొందించడం వరకు జరిగింది. ఈ ట్రాక్టరు లేదా పనిముట్లను సరైన పద్ధతులలో వాడేందువలన వ్యవసాయ పనులను సకాలంలో సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. తద్వారా పంటల ఉత్పాదకత పెంచడంతో పాటు వ్యవసాయానికయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చును. ఇంతేకాక వ్యవసాయ కూలీలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు నాణ్యమైన ఫలితాన్ని పొందడంలో దోహదపడుతుంది.

ఈ యాంత్రీకరణ విధానంలో ముఖ్యంగా వ్యవసాయ పనులకు కావలసిన శక్తినందించే ట్రాక్టరు మరియు పనిని బట్టి రూపొందించిన యంత్రము లేదా పనిముట్లు గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఇందులో ట్రాక్టరు రకాలను పరిశీలిస్తే ముఖ్యంగా మూడు రకాల ట్రాక్టర్లను రూపొందించడం జరిగింది. ఇందులో 1) పవర్‌ టిల్లర్‌ 2) 4 చక్రాల ట్రాక్టరు 3) చైను లేదా బెల్టు చక్రాల ట్రాక్టరు.

దుక్కి దున్నే యంత్రాలు :

1. సబ్‌ సాయిలర్‌ లేదా చిసల్‌ ప్లౌ : లోదుక్కి క్రిందనున్న గట్టి మట్టి పొరను ఛేదించడం వలన క్రమేణి పై మట్టి లోమట్టిలో కలిసి మొక్కకు కావలసిన పోషకాలను సమర్థవంతంగా ఇవ్వగలుగుతాయి. ఇలా పొలాన్ని అతి లోతుగా దున్నేందుకు రూపొందించబడినదే ‘‘సబ్‌ సాయిలర్‌’’ లేదా ‘‘చిసిల్‌’’ నాగలి. ఇది ఒకటి లేదా మూడు ధృఢమైన కర్రులచే నిర్మించబడిన నాగలి. దీనిని ఉపయోగించి దుక్కిని అతి లోతుగా అనగా 60 నుండి 90సెం.మీ. లోతు వరకు దున్నవచ్చును. ముఖ్యంగా మెట్ట సేద్యంలో వర్షాధారపు పంటలను పండిరచేటపుడు ఈ సబ్‌ సాయిలర్‌ లేదా చిసిల్‌ నాగలి ద్వారా దున్నడం వలన లోతైన మట్టి పొరలను కదిలించి లోతైన పొరల్లో నేల గుల్ల బార నివ్వడం వలన పడిన వర్షపు నీటిని ఎక్కువ భాగం పొలం లోతు పొదలలో నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. పొలాన్ని అతిలోతుగా దున్నేందుకు కనీసం 45హెచ్‌.పి. గల ట్రాక్టర్లను ఉపయోగించడం ఉంటుంది. దీని ద్వారా ఒక ఎకర పొలమును 1 లేదా 1 1/2 గంటలలో దున్న వచ్చును.

2. రెక్క నాగలి : పరిమాణాన్ని బట్టి లోతుకు దిగి ఆపై మట్టి పెళ్ళను సమర్ధవంతంగా భూమి నుండి వేరుచేస్తుంది. ఇది సుమారు 30-60 సెం.మీ. లోతు వరకు దున్ని నాగలి పరిమాణాన్ని బట్టి దుక్కిని పొందవచ్చు. ఇదే కాకుండా రెక్క నాగలిలో ఉండే రెక్కను మన అవసరాన్ని బట్టి అనగా కలుపు బెడద ఎక్కువగా ఉన్న చోట కలుపు మొక్కలను పూర్తిగా తిరగ తిప్పడానికి, లేదా పంట అవశేషాలు ఉండే పొలాన్ని బాగా పొడి చేయడానికి ఉపయోగపడుతుంది. చల్కా భూములలో పై పొర గట్టి పడినప్పుడు ఈ పనిముట్టు బాగా ఉపయోగపడుతుంది. 35 హెచ్‌.పి. ట్రాక్టరుతో ఈ పరికరాన్ని వాడి రెండు గంటలలో 1-1.5 ఎకరాలను దున్నవచ్చును.

3. పళ్ళెపు నాగలి : ఇందులో సుమారు 60 సెం.మీ. ` 90 సెం.మీ. వరకు వ్యాసం కలిగి గుంతగా ఉన్న రెండు లేదా మూడు పళ్ళాలను ప్రత్యేక రీతిలో విడివిడిగా తిరిగేందుకు వీలుగా ఒక చట్రానికి అమర్చి నేలను దున్నేందుకు వీలుగా వుంటుంది. రెక్క నాగలిని ఎక్కడైతే సమర్ధవంతంగా ఉపయోగించలేమో అటువంటి నేలలో కూడా ఈ పళ్ళెపు నాని సమర్ధవంతంగా వాడవచ్చును. అంతే కాకుండా నేలంతా రాళ్ళమయమై ఉన్నప్పుడు లేదా మొక్కల వేళ్ళు అవశేషాలు పొదిగి ఉన్నప్పుడు లేదా ఇసుక నేలల్లో లేదా చల్కా నేలల్లో కూడా పళ్ళెపు నాగలిని సమర్థవంతంగా వాడవచ్చును. పొలంలో ఏర్పడ్డ ఈ ఎత్తు పల్లాలను సమర్ధవంతమయిన దంతుల ద్వారా మట్టి గడ్డలు పొడి అయిపోయి నేల చదునుగా తయారవుతుంది.

Also Read: Modern Agricultural Equipment: ఆధునిక వ్యవసాయ పరికరాలు.!

Agricultural Equipments

Modern Agricultural Equipments

దున్నిన పొలాన్ని నూర్పిడి చేసే పనిముట్లు :
మట్టి గడ్డలను పగలగొట్టే పనిముట్లు : దుక్కిని సుమారు 30 సెం.మీ. లోతు వరకు దున్నడం వలన పెద్దపెద్ద మట్టి గడ్డలు ఏర్పడి పొలమంతా ఎత్తుపల్లాలుగా వుండుటవల్ల తక్షణమే విత్తడానికి వీలు పడదు. ఇలా పొలాన్ని విత్తేందుకు అనువుగా మార్చడానికి వివిధ రకాల దంతులను వాడుతారు.

1. పళ్ళెపు దంతి : ఇది పళ్ళేల సమూహంతో చేయబడిన ఒక పరికరం, ఇందులో గుండ్రంగా ఉండే 3 నుండి 12 పళ్ళాలను ఒక గ్యాంగులో నిలువుగా అమర్చి, ఇలాంటి సమూహాలను (గ్యాంగులను) రెండు లేదా నాలుగింటిని ఒక చట్రానికి బిగించబడి ఉంటుంది. ఈరకం దంతులను ఎడ్లతో గాని ట్రాక్టరుతో గాని నడిపేందుకు ప్రత్యేక రీతిలో రూపొందించబడినది. ఈ పళ్ళెపు దంతులలో మూడు రకాలు ఉన్నాయి. ఇసుక పాలు అధికంగా ఉన్న పొలాలు లేదా ఎడ్లు మాత్రమే ఉన్న రైతులు రెండు గ్యాంగులు ఉన్న దంతులు  సమర్థవంతంగా వాడవచ్చును. అదే కండ నేలలో ఎక్కడైతే ఎక్కువ గడ్డలను పొడిచేయవలసి ఉంటుందో అక్కడ నాలుగు గ్యాంగులు ఉన్న దంతులు వాడవలసి ఉంటుంది. పండ్ల తోటలలో చెట్ల క్రింద సేద్యం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన  దంతిని సమర్థవంతంగా వాడవచ్చును. వీటిని ఉపయోగించి 35 హెచ్‌.పి. ట్రాక్టరుతో గంటకు రెండు ఎకరాలు దున్నవచ్చును.

2. పళ్ళు దంతి : దీనిని ముఖ్యంగా మట్టి గడ్డలను నలిపి కలుపు అవశేషాలను తీసి వేయడానికి సమర్థవంతంగా వాడవచ్చును, దీనిని పండ్ల మాను దంతి అని కూడా అంటారు. ఈ పళ్ళ దంతి చట్రానికి రెండు వరుసలలో ఇనుప ముక్కలను ముందు వెనుక సరిలేకుండా అమర్చి ఉంటారు. ఈ ఇనుప ముక్కలు (కర్రులు) బదులు ‘సి’ రూపంలో స్ప్రింగు కర్రులను కూడా అమర్చిన పళ్ళ దంతులు ఉన్నాయి. ఈ రకంగా కర్రులను ఎక్కువ లోతుకు సరిచేసి రాళ్ళు ఉన్న పొలాల్లో సమర్థవంతంగా వాడవచ్చును. ఈ పళ్ళమాను వరి పొలాలలో దమ్ము చేసిన తరువాత నేలను చదును చేసేందుకు మురియు కదిపి వేసిన కలుపు మొక్కలను సేకరించి వేరుచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.

3. రోటోవేటరు: ఈ పరికరము ట్రాక్టరు వెనుక భాగంలో అమర్చబడిన పవర్‌ టేక్‌ ఆఫ్‌ (పి.టి. ఒ) సహాయంతో నడుపబడే ఒక పరికరం. పి.టి.ఒ. నుండి పరికరానికి అమర్చిన తిరిగే కర్రుల ద్వారా పొలంలోని మట్టి గడ్డలను మరియు పంట నిల్వలను బాగా కత్తిరించి కలియతిప్పడం ద్వారా అత్యధిక గాలి మరలను పొలంలో చేర్చి నాణ్యమైన గుల్లను పొలంలో లభ్యమయ్యేట్లు చేస్తుంది. దీనిని ముఖ్యంగా నేలలోపల పండే పంట (వేరుశనగ, పసుపు మొదలగు) పొలాలను తయారు చేయడం వలన మొక్క వేర్ల పెరుగుదలకు అనువైన పరిస్థితులను అందించి ఎక్కువ దిగుబడులను పొందేందుకు వీలవుతుంది.

అంతే కాక చెఱుకు, మొక్కజొన్న వంటి పంటలు కోత తరువాత పంట అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో కలుపడం ద్వారా తక్కువ సమయంలో అవశేషాలు కుళ్ళి పొలం నాణ్యతను పెంపొందించవచ్చును. ఈ రోటోవేటరు కర్రులు 30 లేదా 36 లేదా 42 కలిగి, ట్రాక్టరు పరిమాణాన్ని బట్టి పొలంలోని నేల స్వభావాన్ని బట్టి ఎంచుకోవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని దుక్కి దున్నడానికి కాకుండా దున్నిన పొలంలో నేలను గుల్ల బార్చడానికి చాలా సమర్ధవంతంగా వాడవచ్చును.

4. పవర్‌ హో : ఈ యంత్రము దుక్కిదున్నిన తరువాత ద్వితీయ దుక్కి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని ట్రాక్టరు పి.టి.ఓ. తో నడపడం వలన, నేలను గుల్ల బార్చడంలో చాలా సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది. ఇలా నేలను గుల్లబార్చడం ద్వారా పండిరచిన పంట వేర్లు వృద్ధి చెందడం మరియు భూమిలో పండే పంటలయిన వేరుశనగ, పసుపులాంటి పంటలు బాగా పండేందుకు వీలవుతుంది. అంతేకాక వేర్లకు ఆక్సిజన్‌ బాగా అందడం ద్వారా పంటకు అందించిన పోషకాలు బాగా అంది ఉపయోగపడుతుంది.

5. చదును చేసే పలక : దమ్మును చేసిన తరువాత నేల మట్టాన్ని సమతలంగా చేయడం ద్వారా సాగునీటి ఆదా సుమారు 30-40% ఉంటుందని పరిశోధనాత్మకంగా నిరూపించబడిరది. కాబట్టి దున్నిన నేలను చదును చేయడం ఎంతయినా అవసరం. ఈ దున్నిన నేలను చదును చేసేందుకు పలకను రూపొందించడం జరిగింది. ఈ చదును చేసే పలక ఎడ్ల సహాయంతో చేసేదయితే క్రింద భాగంలో ఒక ఇనుప పట్టీ వెనుక భాగంలో చిన్న అమర్చబడి ఉంటుంది. ఈ ప్రధాన పలకకు నేల యొక్క కోణాన్ని ఎప్పటికప్పుడు మార్చేందుకు చేతి పిడిని అమర్చి ఉంటారు.

ఈ చేతి పిడిని ముందుకు వంచి పెట్టడం ద్వారా ప్రధాన పలక మరియు దానికి అమర్చిన ఇనుప బద్ద నేలపై రాసుకుంటూ ఎటువంటి నేలను తెంచకుండా లాగిన మట్టిని అక్కడ వదులుతుంది. ఈవిధంగా పలకను ఉపయోగించి నేల మట్టాన్ని రూపొందించవచ్చును. ఈ చదును చేసే పరికరం ట్రాక్టరుతో వాడడానికి ట్రాక్టరు 3 పాయింటు హిచ్‌ ద్వారా తగిలించడానికి రూపొందించి ఉంటారు. ఈ చదును చేసే పలకకు దంతులను అమర్చి రెండు పనులను ఒకేసారి చేయవచ్చును.

6. లేజర్‌ గయిదడ్‌ ల్యాండ్‌ లెవలర్‌ : ఇటీవల రూపొందించిన ట్రాక్టరుతో నడిచే లెవలర్ను నియంత్రించేందుకు లేజర్‌ సహాయంతో పరికరాన్ని రూపొందించి ఉన్నారు. ఈ పరికరాన్ని పరిశీలిస్తే పొలంలో వున్న ఎత్తు పల్లాలను సవరించడమేకాకుండా మనకు కావలసిన వాలు శాతాన్ని పొందేందుకు వీలవుతుంది. ఈ వాలు పొలం యొక్క పరిమాణాన్ని బట్టి కావలసిన విధంగా, ఒకవైపు గాని లేదా రెండు వైపుల వాలుకు గూడా నియంత్రించేందుకు వీలవుతుంది. ఇంతే కాకుండా ఈ లేజర్‌ గయిడడ్‌ ల్యాండ్‌ లెవలర్ను వరి పొలం దమ్ము చేసిన తరువాత కూడా వాడి సమర్థవంతంగా సాగు నీటిని ఆదా చేయవచ్చు.

Also Read: Zoonotic Diseases: జంతువులు నుండి మానవులకు పొంచి ఉన్న వ్యాధులు.!

Leave Your Comments

Orchard Pest Management: పండ్ల తోటల్లో చీడ పీడల ఎలా నివారించుకోవాలి…?

Previous article

Agricultural Change: క్షేత్రస్థాయిలో పలు వ్యవసాయ విధానంలో మార్పులు.!

Next article

You may also like