యంత్రపరికరాలు

Bicycle Weeder: రైతు వినూత్న ప్రయత్నం.. పాత సైకిల్ తో కలుపు తీసే గుంటుక యంత్రం.!

2
Bicycle Weeder
Bicycle Weeder

Bicycle Weeder: కరోనా మహమ్మారితో ఎంతో మంది చేసే ఉద్యోగాలను వదిలేసి పల్లెబాట పట్టారు. వారసత్వంగా వస్తున్న భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటారు. పెట్టుబడులు పెరిగిపోయి కనీసం కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో యువకులు దిగాలు పడ్డారు. మారుతున్న ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం అందించాలని యువకులు భావించారు. అన్నింటికంటే కూలీలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని ఆలోచనలో పడ్డాడు. ప్రతిభ అనేది ఎవరి సొంతం కాదు. ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలకే పరిమితం కాదు రైతులు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూలీల సంఖ్యను తగ్గించడానికి ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు.పాత సైకిల్ తో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాడు. పొలంలో పాత సైకిల్ తో కలుపు తీస్తూ తోటి రైతులను ఆకర్షిస్తున్నాడు.

సరికొత్త ఆలోచన

వ్యవసాయంలో విత్తనాలు, పురుగు మందులు దొరక్క రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు కూడా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇంత కష్టపడి పంట పండిస్తే మద్దతు ధర కరువు. దాచుకోవడానికి నిల్వ సౌకర్యం లేదు. ఇవికాక సమయానికి కూలీలు దొరక్క ఇతర రాష్ట్రాల నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా కూలీల కొరత తో పాటు ఎద్దులతో గుంటక కొట్టించడానికి ఖర్చు ఎక్కువవుతుంది. గుంటుకకు ప్రతిరోజు 800 రూపాయల కిరాయి అవుతుందని రైతులు అంటున్నారు. దీంతో పత్తి చేలో ఈజీగా కలుపు తీసేందుకు సరికొత్త ఆలోచన చేశాడు. పాత సైకిల్ తో ఓ ప్రయోగం చేశాడు.

Also Read:  సైలేజ్ దాణా తయారీ లో మంచి ఆదాయం పొందుతున్న రైతులు.!

Bicycle Weeder

Bicycle Weeder

20 వేల రూపాయల వరకు ఆదా

కృషి ఉంటే మనుషులు బుషులు అవుతారు అనేది ఇక్కడ వర్తిస్తుంది. మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాని నిరూపించాడు ఈరైతు. పాత సైకిల్ కు వ్యవసాయ పరికరాలను అమర్చి కలుపు తీయడం, గుంటుక కొట్టడం ప్రారంభించాడు. దీంతో కూలీల కొరతను అధిగమించడం తో పాటు తక్కువ శ్రమతో ఎక్కువ పనిని చేసేందుకు ఈ సైకిల్ గుంటుక కూడా ఉపయోగపడుతుంది. దీనిని తయారు చేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయిందని, ఒక ఎకరంలో ముగ్గురు కూలీలు చేసే పనిని ఈ సైకిల్ గుంటుకతో ఒక్కరు చేస్తున్నానని చెబుతున్నాడు. ఈవినూత్న పరికరంతో కలుపు తీయడం, గుంటుక కొట్టడంతో ఎకరాకు 20 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు. పొలంలో ఈజీగా కలుపు తీస్తున్నామని గుంటుక కొట్టడానికి ఇది అనుకూలంగా ఉందని చాలామంది రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పనుల్లో ఉపయోగపడుతున్న ఈసైకిల్ లో కూలీల కొరతను తగ్గించుకొని సమయాన్ని ఆదా చేసుకుంటున్నామని రైతులు అంటున్నారు.

Also Read:  పొట్టి పొట్ల తో అధిక లాభాలు.!

Leave Your Comments

Silage Making Process: సైలేజ్ దాణా తయారీ లో మంచి ఆదాయం పొందుతున్న రైతులు.!

Previous article

Capsicum Cultivation in Polyhouse: పాలీహౌస్ లో క్యాప్సికం సాగు – లాభాలు బాగు

Next article

You may also like