ఆరోగ్యం / జీవన విధానం

Bael Tree (Maredu) Sharbat: వేసవి కాలంలో మంచి ఉపశమనం కలిగించే మారేడు కాయ షర్బత్ గురించి తెలుసా?

2
Bael Tree Sharbat
Bael Tree Sharbat

Bael Tree (Maredu) Sharbat: శివునికి ఇష్టమైన పళ్లలో మారేడు కాయ ప్రధానమైనది. కేవలం పూజ పరంగానే కాకుండా, మారేడు కాయను పూర్వం నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో మారేడు కాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేసవి కాలంలో దొరికే పళ్లలో మారేడు కాయ కూడా ఒకటి. మారేడు కాయతో చేసే షర్బత్ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మారేడు కాయతో చేసే జ్యూస్ లో బీటా-కెరోటిన్, ముఖ్యమైన ఖనిజాలు మరియు రైబోఫ్లావిన్, థయామిన్, విటమిన్ సి మొదలైన విటమిన్లు అధికంగా ఉన్నందున ఈ జ్యూస్ మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మారేడు కాయ షర్బత్ ని ఇంట్లోనే సులువుగా తయారు చేస్కోవచ్చు. ఇందుకోసం పండిన మారేడు కాయని పగలకొట్టి అందులో నుండి మాంసాన్ని తీస్కొని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా కలపాలి. మీ రుచికి తగ్గట్టుగా చక్కర, బెల్లం, లేదా ఇతర పళ్ళు కూడా కలుపుకొని సేవించవచ్చు.

Bael Tree (Maredu) Sharbat

Bael Tree (Maredu) Sharbat

కొన్ని అధ్యయనాల ప్రకారం, 100-గ్రాముల మారేడు పండులో: 88 కేలరీలు, 1.8 గ్రా ప్రోటీన్, 32 గ్రా కార్బోహైడ్రేట్లు మరియు 1.19mg రైబోఫ్లావిన్ లభిస్తాయి. వీటితో పాటు ఈ మారేడు పండు విటమిన్ A, C, 0.2 నుండి 0.43 గ్రా కొవ్వును మరియు 2.2 నుండి 4.3 గ్రా ఫైబర్‌ను కూడా అందిస్తుంది. మారేడు కాయ షర్బత్ లో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. వేసవిలో ఈ షర్బత్ ని తాగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌లను నివారించవచ్చు.

Also Read: Apricots Health Benefits: ఆప్రికాట్ల వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?

మారేడు కాయ జ్యూస్ యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది వాపు నుండి అవయవాలను రిలాక్స్ చేస్తుంది మరియు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్ చికిత్స లో మారేడు కాయ జ్యూస్ ని వాడితే మంచి ఫలితం ఉంటుంది.

Maredu

Maredu

మారేడు కాయలో ఉండే పోషకాలు రక్తంలో ఉన్న విషాన్ని తొలగించి రక్తశుద్ధిగా పనిచేస్తుంది. అలాగే ఇది కాలేయం మరియు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు. మారేడు పండులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి, క్రమం తప్పకుండా మారేడు కాయ షర్బత్ ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను నివారించవచ్చు. వేసవిలో చర్మ సమస్యలు మరియు దద్దుర్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కావున ఈ జ్యూస్ ని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు, దద్దుర్లు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు.

Also Read: Passion Fruit Benefits: వేసవికాలంలో దొరికే ఈ పండు గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు!

Also Watch:

Must Watch:

Leave Your Comments

Apricots Health Benefits: ఆప్రికాట్ల వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?

Previous article

Arjuna Tree Medicinal Uses: అర్జున చెట్టు వల్ల కలిగే అద్భుతమైన ఔషధ ఉపయోగాలు తెలుసా?

Next article

You may also like