తెలంగాణ

Crop Loan Waiver: కేసీఆర్‌ ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే పంట రుణాల మాఫీకి బడ్జెట్‌ రిలీజ్‌.!

2
Telangana Crop Loan Waiver Scheme 2023
Telangana Crop Loan Waiver Scheme 2023

Crop Loan Waiver: సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కనీవినీ ఎరగని రీతిలో రుణమాఫీకి నిధులను ఒకేసారి విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్థికశాఖ రుణమాఫీకి అవసరమైన మొత్తం రూ.18,241.94 కోట్ల నిధులను విడుదల చేస్తూ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ను జారీ చేసింది. దీంతో 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.37 వేల నుంచి రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైన నిధుల సమస్య తీరిపోయింది. వాస్తవానికి పంట రుణాల మాఫీ పై ప్రభుత్వం ఈ ఏడాది తొలి నుంచి దృష్టి సారించింది. వర్షాలు పడుతున్న నేపద్యంలో అన్నదాత పొలాల పనిలో బిజీగా అయ్యారు. ఈ నేపద్యంలో కేసీఆర్ ప్రకటించిన రుణమాఫీ రైతులకు ఊపిరి పోసినట్లు అయ్యింది.

సెప్టెంబర్‌ రెండో వారం కన్నా ముందే రుణమాఫీ

తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈనేపద్యంలో ఈఏడాది బడ్జెట్‌లో రూ.6,385.20 కోట్లు కేటాయించగా, తాజాగా మరో రూ.12,548.60 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా రుణమాఫీకి అవసరమైన రూ.18,241.94 కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేసింది. దీంతో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.

ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు సెప్టెంబర్‌ రెండో వారం కన్నా ముందే రుణమాఫీ పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుణమాఫీకి సంబంధించి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి రైతుకు గడువులోగా రుణమాఫీ జరిగి తీరుతుందని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ చేయడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో అవసరమైన నిధులను కేసిఅర్ సమీకరించారు.

Also Read: Coriander Farming Profit: కొత్తిమీర సాగు తో రూ. కోటి సంపాదన..

Crop Loan Waiver

Crop Loan Waiver

తొలిరోజు 41 వేల లోపు రుణాలు మాఫీ

కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు…తదితర కారణాల వల్ల కొంత ఆలస్యమైందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించారు. రైతుల పంట రుణాలు మాఫీ ప్రక్రియలో తొలి రోజు రూ.37 వేల నుంచి రూ.41 వేల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేశారు. ఇందుకోసం రూ.237.85 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. దీంతో 62,758 మంది రైతులకు రుణ విముక్తిలయ్యారు. ఊరూరా సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: Solar Dryer: పంట నిల్వ కోసం సోలార్ డ్రైయర్ కనుగొన్న మెకానికల్ ఇంజనీర్.!

Leave Your Comments

Coriander Farming Profit: కొత్తిమీర సాగు తో రూ. కోటి సంపాదన..

Previous article

Bonsai Plants Business: పొట్టి మొక్కల సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు ఆదాయం..

Next article

You may also like