తెలంగాణ

New Extension Strategies: అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ పర్యావరణ వ్యవస్థల కోసం కొత్తరకం విస్తరణ విధానాలు.!

2
New Extension Strategies
New Extension Strategies

New Extension Strategies: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విద్యాసంస్థ “అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ పర్యావరణ వ్యవస్థల కోసం కొత్తరకం విస్తరణ విధానాలు” అన్న అంశంపై మూడు రోజులుగా రాజేంద్రనగర్ లోని PJTSAU ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ఈరోజు ముగిసింది. ముగింపు సమావేశంలో ప్రణాళికా సంఘం మాజీ సలహాదారు (వ్యవసాయం) డాక్టర్ వి.వి సదామతే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ విస్తరణ విధానాల బలోపేతానికి ఈ సదస్సు చాలా ఉపకరిస్తుందని ఆయనన్నారు. రైతులకి అధునాతన టెక్నాలజీల ద్వారా మరింత విస్తరణ సేవలు అందించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

వ్యవసాయ విస్తరణలో కొత్త విధానాల కోసం పనిచేస్తున్న సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఇటువంటి సదస్సుల్లో వచ్చిన నూతన విస్తరణ ప్రతిపాదనల్ని కొన్నింటిని ప్రయోగాత్మకంగా అమలు చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని సదామతే అన్నారు. ఇంటర్ నెట్, స్టార్టప్ లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి టెక్నాలజీల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా విస్తరణని పూర్తిగా తిరిగి నిర్వచించుకొని, పునర్నిర్మించవలసిన అవసరం ఉందని సదామతే అభిప్రాయపడ్డారు. ఇటువంటి సదస్సులో వచ్చిన పద్ధతులు రైతులకి మెరుగైన సేవలు అందించడానికి తోడ్పడతాయని PJTSAU రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. వెంకటరమణ అభిప్రాయపడ్డారు.

Also Read: వరిలో ఉల్లికోడు సమగ్ర యాజమాన్యం.!

New Extension Strategies

New Extension Strategies

ఈ ముగింపు సమావేశంలో డాక్టర్ వి. సుధారాణి, విస్తరణ సంచాలకులు, PJTSAU వారు మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా వచ్చిన పలు సిఫార్సులను భవిష్యత్తులో వ్యవసాయ విస్తరణ అభివృద్ధిలో ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈనాటి జాతీయ సదస్సుకి గౌరవ అతిథిగా విచ్చేసిన విస్తరణ విద్యాసంస్థ, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. వెంకు రెడ్డి 60 సంవత్సరాలుగా దక్షిణ భారత దేశంలో విస్తరణ విద్యా సంస్థ నిర్వహించిన బోధన శిక్షణ కార్యక్రమాలు, విస్తరణ పరిశోధనాలలో సాధించిన పురోగతిని వివరించారు.

ఈ సమావేశంలో 262 మంది ప్రతినిధులు (వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు) పాల్గొన్నారు. ఈ సదస్సులో 99 మౌఖిక ఉపన్యాసాలు, 132 పోస్టర్ లు, 8 ప్రధాన ఉపన్యాసాలు, 8 సంక్షిప్త వృత్తాలు (థీమ్ లలో) ఇవ్వడం జరిగింది.
ఈ ముగింపు సమావేశంలో ఉత్తమ విస్తరణ అధికారులకు, ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్తలకు, ఉత్తమ రైతులకి, ఉపన్యాసకులు కి ఉత్తమ పోస్టర్ల కి అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ విద్యా సంస్థ సంచాలకులు డాక్టర్ ఎం. జగన్ మోహన్ రెడ్డి, విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read: పురుగు మందులతో జాగ్రత్త.!

Leave Your Comments

Ulli Kodu Management: వరిలో ఉల్లికోడు సమగ్ర యాజమాన్యం.!

Previous article

Minister Niranjan Reddy: ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు – మంత్రి

Next article

You may also like