తెలంగాణ

Palamuru-Rangareddy Lift Irrigation Scheme: పాలమూరు దశ, దిశను మార్చే ప్రాజెక్టు – మంత్రి

1
Palamuru-Rangareddy
Palamuru-Rangareddy

Palamuru-Rangareddy Lift Irrigation Scheme: ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నార్లాపూర్ పంప్ హౌస్ లో వెట్ రన్ ప్రారంభించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా పాలమూరు పంపుల ప్రారంభం అవుతున్నాయి. నీటి విషయాలలో ఓనమాలు తెలియని వారు దుష్ప్రచారం చేస్తున్నారని ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీరు రానున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

గ్రామాల నుండి భారీఎత్తున తరలిరావాలి .. ఈ చారిత్రక సందర్భంలో మనమంతా భాగస్వాములం కావాలి అని ఈ శతాబ్దపు మానవాద్భుత నిర్మాణం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 672 మీటర్ల ఎత్తుకు 145 మెగావాట్ల సామర్థ్యంగల పంపులు నాలుగు స్టేజిలలో 10 పంపులు ఎత్తిపోసే ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. అటువంటి ప్రాజెక్టు ఈ రోజు పాలమూరుకు వచ్చింది.

Also Read: నాడు మాట ఇచ్చాం.. నేడు నిలబెట్టుకుంటున్నాం – మంత్రి

Palamuru Rangareddy Lift Irrigation Scheme

Palamuru Rangareddy Lift Irrigation Project

ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ? అంటే వినిపించే సమాధానం పాలమూరు. మనం సాధించుకున్న రాష్ట్రంలో, మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తలపెట్టి పూర్తిచేసుకుంటున్న ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర ఉన్నది. 27 వేల ఎకరాల భూసేకరణ, 5 రిజర్వాయర్ల నిర్మాణం, 4 పంపింగ్ స్టేషన్లు, సర్జిపూల్ ల నిర్మాణం, నాలుగు 420 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం గత పాలకుల మాదిరిగా చేసి ఉంటే వందేళ్లయినా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు.

కేంద్రం సహాయనిరాకరణ, అనేక కేసులు, కుట్రలు ఉన్నప్పటికీ ఏడున్నరేళ్లలో పూర్తిచేసుకున్నాం. ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా తిరిగి వచ్చే క్రమంలో కలశాలలో కృష్ణమ్మ నీళ్లు తీసుకువచ్చి 17 తేదీ నాడు ప్రతీ గ్రామంలో ఊరేగించి దేవాలయాల్లో అత్యద్భుతంగా కలశంలోని నీటితో దేవతామూర్తులను అభిషేకించే కార్యక్రమం నిర్వహించాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Also Read: పట్టుపురుగుల పెంపకం పై 4 రోజుల (అక్టోబర్ 4 – 7 ) ఉచిత శిక్షణ కార్యక్రమం.!

Leave Your Comments

Minister Niranjan Reddy: నాడు మాట ఇచ్చాం.. నేడు నిలబెట్టుకుంటున్నాం – మంత్రి

Previous article

Vinayaka Chavithi 21 Patri Names: వినాయక చవితి రోజున విఘ్నేశ్వరున్ని పూజించవలసిన 21 రకాల పత్రి-విశిష్టత.!

Next article

You may also like