వార్తలు

ధాన్యం కొనుగోళ్ళ సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్…

0
TS sets up toll-free for grain purchase queries
TS sets up toll-free for grain purchase queries

రైతులకి మరింత అందుబాటులో ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగేసింది. పంటను అమ్మే విషయంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ సర్కార్ టోల్ ఫ్రీ నంబర్ ని ఏర్పాటు చేసింది. వాన‌కాలం వరి ధాన్యం కొను‌గోలు విష‌యంలో రైతు‌లకు సల‌హాలు, సూచ‌నలు ఇచ్చేం‌దుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబ‌ర్‌ను ఏర్పా‌టు‌చే‌సి‌నట్టు సివిల్‌ సప్లయ్‌ కార్పొ‌రే‌షన్‌ వెల్లం‌డింది. రైతులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 1800 4250 0333, (040–23336112, 113, 114, 115, 116,) 1967 నంబ‌ర్లకు సంప్ర‌దిం‌చి సందేహాలను నివృతి చేసుకోవాలని సూచించింది. ఆ శాఖ ప్రధాన కార్యా‌లయం నుంచి దీనిని నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు.

#tollfree #grainpurchasequeries #telangana #CivilSuppliesDepartment #agriculture #eruvaaka 

Leave Your Comments

పత్తి విత్తనాల్లో కల్తీ ఉంటే కఠిన చర్యలు…

Previous article

Broccoli Cultivation: బ్రకోలి సాగుపై రైతులు అమితాసక్తి

Next article

You may also like