ఈ నెల పంట

July Gardening Works: జూలై మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన పనులు మరియు సూచనలు.!

2
July Gardening Works
July Month Gardening Works

July Gardening Works – పండ్ల తోటలు: 1. మామిడి తోటలలో పడి ఉన్న టెంకలను ఏరి వేసి, ఫాలిడాల్‌ పొడి మందును చెట్ల పాదుల్లో వేసి కలియబెట్టాలి. వాలును బట్టి తోటలోని సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా గట్లు పోసి మళ్ళు చేయాలి. పత్ర విశ్లేషణ ఫలితాల ఆధారంగా రసాయనిక ఎరువులు వేయాలి. పది సంవత్సరములు, ఆపైబడిన చెట్లకు 1 కిలో నత్రజని (2.2 కిలోల యూరియా), 1 కిలో పొటాషియం (1.6 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌), 1 కిలో భాస్వరం (6 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌) ఎరువులను చెట్టు ప్రధాన కాండం నుంచి 1.5 మీ. నుంచి 2 మీ. దూరంలో పాదుల్లో వేయాలి. సూక్ష్మపోషక పదార్థాల లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రా. జింక్‌సల్ఫేట్‌ G 2.5 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ G 2 గ్రా. బోరాక్స్‌ G 2 గ్రా. కాల్షియం సల్ఫేట్‌ G 3 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు జూన్‌`జూలై, సెప్టెంబరు`అక్టోబరు మరియు డిసెంబర్‌`జనవరి నెలల్లో లేదా మొక్కలు కొత్త చిగుర్లు తొడిగినప్పుడు పిచికారీ చేయాలి.

2. అరటి నాటిన తర్వాత చనిపోయిన పిలకల స్థానంలో ఆరోగ్యవంతమైన పిలకలను నాటాలి. పచ్చిరొట్ట ఎరువును వేసి భూమిలో కలియదున్నాలి. తెల్లచక్కెరకేళి రకానికైతే 35 రోజులకు, పెద్దపచ్చ, పొట్టిపచ్చ అరటి రకాలకు 40 రోజులకు, కర్పూరచక్కెరకేళి, కొవ్వూరు బొంత రకాలకు 45 రోజులకు, 110 గ్రా. యూరియా, 80 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను చెట్టుకు రెండువైపులా 30`40సెం.మీ. దూరంలో 10 సెం.మీ. లోతు గుంతలలో వేసి మట్టితో కప్పి తేలిక పాటి తడి ఇవ్వాలి.

3. నిమ్మలో గజ్జితెగులు నివారణకుగాను బ్లైటాక్స్‌ 30 గ్రా. మరియు స్ట్రెప్టోసైక్లిన్‌ 1 గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. చెట్ల కాండమునకు బోర్డోపేస్టును పూయాలి. దీనితో బంకకారు తెగుళ్ళను, కాండం పగుళ్ళను నివారించవచ్చు. లేత తోటలలో పచ్చిరొట్ట పైర్లను వేసి, పూత దశలో భూమిలో కలియదున్నాలి.

4. ద్రాక్షలో బూడిద తెగులు మరియు పక్షి కన్ను తెగులు నివారణకు డైఫెన్‌కొనజోల్‌ 0.6 మి.లీ. మరియు టెబుకొనజోల్‌ 0.75 మి.లీ. మరియు క్రిసాక్సిమిథైల్‌ 0.6 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. మజ్జిగ తెగులు నివారణకు ఫెనామిడాన్‌ G మాంకోజెబ్‌ 2 గ్రా. మరియు ఇప్రోవాలికార్బ్‌ G ప్రొపినెబ్‌ 3గ్రా. లీటరు నీటికి కలిపి 10`15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

5. సపోటాలో కొమ్మ కత్తిరింపు చేపట్టాలి. (ఎండిన, తెగుళ్ళు సోకిన, చెట్ల లోపలి భాగంలోగల, ఎండ తగలని, వంకరగా పెరిగిన కొమ్మలను మరియు గుబురుగా ఉన్న కొమ్మలను తీసివేయాలి). తోటలను దున్ని చెట్లకు పాదులు చేయాలి. క్రొత్త తోటలు వేసుకొనుటకు అనువైన సమయం. ప్రతి చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు, 400 గ్రా. నత్రజని, 160 గ్రా. భాస్వరం, 450 గ్రా. పొటాష్‌ వేయాలి. తోటలకు నీటి వసతి ఉంటే ఈ మోతాదులో సగం అనగా 200 గ్రా. నత్రజని, 80 గ్రా. భాస్వరం, 225 గ్రా. పొటాష్‌ వేయాలి. మిగిలిన సగం మోతాదు అక్టోబరు మాసంలో వేయాలి.

6. పనసలో తోటలను దున్ని చెట్లకు పాదులు వేయాలి. క్రొత్త తోటలు వేసుకొనుటకు అనువైన సమయం. ఎంపిక చేసిన మొక్కలను గుంతలలో నాటుకునేముందు, ప్రతి గుంతకు 100 కిలోల పశువుల ఎరువు, 1.3 కిలోల యూరియా, 1.9 కి. సూపర్‌ ఫాస్పేట్‌ మరియు 0.4 కి. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి. నీటి వసతి గల తోటలు అయితే పైమోతాదులో సగం ఈ నెలలో ప్రతి మొక్కకు వేయాలి. మిగిలిన సగం మోతాదు అక్టోబరు మాసంలో వేయాలి.

7. ఉసిరిలో అంతర కృషి చేయాలి. చెట్ల పాదుల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచాలి. కాపుకు వచ్చిన చెట్లకు (3`4 సం॥) మొక్క ఒక్కింటికి 5 కి. పశువుల ఎరువు, 100 గ్రా. నత్రజని, 50 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాష్‌నిచ్చే ఎరువులు వేయాలి. 10 సం॥ల చెట్టుకి కిలో నత్రజని, ఆరకిలో భాస్వరం, కిలో పాటాష్‌నిచ్చే ఎరువుతో బాటు 60 కిలోల పశువుల ఎరువు వేయాలి. ఎరువులు వేసిన తరువాత అవసరాన్ని బట్టి తగినంత నీరు పెట్టాలి.

8. రేగులో ఆకులు తినే పెంకు పురుగులు రాత్రి సమయంలో ఆకులను మరియు లేత కొమ్మలను తినటం ద్వారా విపరీతంగా నష్టం కలుగజేస్తాయి. వీటి నివారణకు పాదులను తిరగ త్రవ్వి నీటిని పారించాలి. క్లోరిపైరిఫాస్‌ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

9.బొప్పాయిలో ఆకుముడత తెగుళ్ళ లక్షణాలు ఉన్న మొక్కలను గమనించినచో పీకి కాల్చివేయాలి.కాండం మొదలు మరియు వేరు కుళ్ళు ఆశించినచో, మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశించినచో నష్టం అధికంగా వుంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. బోర్డోమిశ్రమము 1 శాతం లేదా అలియేట్‌ 2 గ్రా. లీటరు నీటికి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధితో 2`3 సార్లు తడపాలి లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా పొడిని ఒక లీటరు నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదలు చుట్టూ నేల బాగా తడిచేటట్లుగా పోయాలి లేదా ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రము G 90 కిలోల పశువుల ఎరువు G 10 కిలోల వేపపిండి G 1 కిలో బెల్లం నీటిని 10 రోజులు మాగనిచ్చి చెట్ల పాదుల్లో వేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా వున్నప్పుడు లీటరు నీటికి 2 గ్రా. రిడోమిల్‌ యమ్‌`జడ్‌ కలిపి చెట్ల మొదళ్ళలో మరియు కాండాన్ని తడుపుతూ మందును పోయాలి.

10. దానిమ్మకు విశ్రాంతి నివ్వాలి. కత్తిరింపులు చేయడం, పాదుల తవ్వకం మరియు ఎరువులు వేయడం లాంటివి చేయకూడదు. కాని 1% బోర్డోమిశ్రమము మందును 20 రోజుల వ్యవధిలో 2`3 సార్లు పిచికారి చేసి, బ్యాక్టీరియా తెగులును అదుపులో వుంచవచ్చు.

Organic Vegetables

కూరగాయల పంటలు:
1. క్యాబేజి మరియు కాలీఫ్లవర్‌ (స్వల్పకాలిక రకాలు) నారును ఎత్తైన నారుమళ్ళపై పెంచాలి.

2. పాలీహౌస్‌లలో పెంచే కాప్సికం పంట కొరకు నారును పెంచుకోవాలి.

3. టమాట, మిరప మరియు వంగ నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. పంటనాశించే రసం పీల్చే పురుగుల నివారణకు 5 మి.లీ. వేపనూనె లీటరు నీటికి లేదా థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా./లీ నీటికి కలిపి పిచికారి చేయాలి.భూమి ద్వారా వ్యాప్తి చెందే నారుకుళ్ళు, కాండంకుళ్ళు, ఎండు మరియు వడలు తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి మొదళ్ళ వద్ద బాగా తడపాలి. నులి పురుగుల నివారణకు ఎకరానికి 8 కిలోల కార్బోఫ్యూరాన్‌ 3 జి గుళికలను దుక్కిలో వేయాలి. వైరస్‌ తెగులు ఆశించకుండా కూరగాయ పంటలకు అంతర్వాహిక కీటకనాశిని మందులైన ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ/లీ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

4. కందలో 50 శాతం మొలక వచ్చిన తరువాత నుండి 40 రోజులకు 33 కిలోల నత్రజని, 33 కిలోల పొటాష్‌ ఎరువులు (72 కిలోల యూరియా, 55 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) మొక్కకు రెండువైపులా గుంటలో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. పలుచగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి.

5. చేమగడ్డ పైరు ప్రాథమిక దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రా. అన్నభేది, 1 గ్రా. నిమ్మఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. పలుచగా మొలిచిన కలుపును తీయించి ఎకరానికి 35 కిలోల యూరియా, 18 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను మొక్కకు రెండు వైపులా గుంటలలో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడి ఇవ్వాలి.

6. పెండలంలో వర్షపాతాన్ని బట్టి 10`15 రోజుల తేడాతో నీటి తడులు ఇవ్వాలి. తడులిచ్చేటప్పుడు చిన్న చిన్న మడులుగా చేసి తేలికపాటి తడులివ్వాలి. మొదటి దఫాగా 28 కిలోల యూరియా, 18 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను మొక్కకు రెండు వైపులా గుంతలు తీసి ఎరువులు వేసి మట్టి కప్పి తేలికపాటి తడి ఇవ్వాలి. పాదులు పాకటానికి ఊతం ఇచ్చినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.

7. ఉల్లిలో నారుమడి తయారయితే ప్రధాన పొలాన్ని 2`3 సార్లు దుక్కి చేసి పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నారుకుళ్ళు నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా./లీటరు నీటికి కలిపి నారుమడి మొత్తం తడిచేలా పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్‌ లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. G మాంకోజెబ్‌ 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో రెండు మూడుసార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు, 250 కిలోల వేపపిండి, 20 కిలోల నత్రజని, 20`32 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.

8. మునగలో కాయలు కోసిన తర్వాత ఒక మీటరు ఎత్తులో కొమ్మలను కత్తిరించి కార్శి పంటను తీసుకోవచ్చు. బహువార్షిక రకాలని ఒకసారి చెట్టు ఆకారంలో కత్తిరింపు చేశాక తిరిగి 10`12 సంవత్సరాల వరకు ఎటువంటి కత్తిరింపు అవసరం లేదు. కొత్తగా తోటలు వేసేవారు మొక్కలను నాటుకోవాలి.

Types of Gladiolus-Flowers.

Flower Garden

పూలతోటలు:

1. బంతి నాటుకునేముందు ఎకరాకు 30 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం మరియు పొటాష్‌ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. నారును 60I45 సెం.మీ. దూరంలో నాటుకోవాలి.

2. 45 రోజుల వయసున్న కనకాంబరం నారు మొక్కలను ప్రధాన పొలంలో 60I45 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి. ఆఖరి దుక్కిలో 20 టన్నుల పశువుల ఎరువును 15 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి.

3. చామంతి పిలకలు లేదా కొమ్మ కత్తిరింపులను ప్రధాన పొలంలో 30I30 సెం.మీ. దూరంలో ఎకరానికి 40 వేల మొక్కల సాంద్రత ఉండే విధంగా నాటుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8`10 టన్నుల పశువుల ఎరువు, 50 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం మరియు 80 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి.

4. నేల సంపంగిలో సుమారు 2.5 సెం.మీ. వ్యాసం ఉన్న దుంపలను ఎంపిక చేసి 30I20 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. ఎకరాకు 8`10 టన్నుల పశువుల ఎరువుతోపాటు 80 కిలోల భాస్వరం మరియు పొటాష్‌ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

Also Read: Questions to Ask Farmers: రైతన్నకో ప్రశ్న..

Coconut Tree

Coconut Tree

తోటపంటలు:

1. కొబ్బరిలో జూన్‌ మాసంలో ఎరువులు వేయనట్లయితే, జూలైలో ఎరువులు వేయవలెను. చెట్టు పళ్ళెములో 2 మీ. వెడల్పుగా కొబ్బరి డొక్కలు, పొట్టు, ఎండు ఆకులు పరచవలెను. కొబ్బరి తోటలో అంతర పంటలుగా అరటి, కోకో, కంద, చేమ, పసుపు, మిరియం, అనాస మొదలైన పంటలు వేసుకోవచ్చు. కొబ్బరిపై ఆశించు కొమ్ము పురుగు, మొవ్వు కుళ్ళు మరియు నల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ ఉండాలి.

కొమ్ము పురుగు యాజమాన్యం: తోటలో పశువుల ఎరువు కుప్పలు ఉంచరాదు. 3 నెలల కొకసారి కొబ్బరి చెట్ల మొవ్వులలో, ఆకువలయాలలో వేపపిండి లేక వేప గింజల పొడి 100 గ్రా. 150 గ్రా. ఇసుకలో కలిపి చల్లాలి. కొమ్ము పురుగును ఆకర్షించు రైనోల్యూర్‌ అను ఫిరమోన్‌ ఎరలను బక్కెట్లో పెట్టి అయిదు ఎకరముల తోటకు ఒకటి చొప్పున పెట్టి, ఆకర్షితమైన తల్లి పురుగులను చంపాలి. మెటారైజియమ్‌ ద్రావణాన్ని మూడు ఘనపు మీటర్ల కుప్పకు ఒక లీటరు ద్రావణము చొప్పున చల్లి, మోటారైజియమ్‌ బూజు తెగులును, పురుగు ఉత్పత్తి కేంద్రాలైన పశువుల పెంట, వ్యర్థ సేంద్రియ పదార్ధాల కుప్పలలో వ్యాప్తి చేయాలి. బ్యాకులో వైరస్‌ తెగులు సోకించిన కొమ్ము పురుగులను ఒక హెక్టారుకి 10 లేక 15 చొప్పున ప్రతి మూడు నెలలకొకసారి తోటల్లో వదలాలి.

మొవ్వుకుళ్ళు తెగులు యాజమాన్యము: మొవ్వు భాగము తడిచేలా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందు (3 గ్రా./లీటరు నీటిలో కలిపి) పిచికారి చేయాలి. కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి ఇతర గెలలు, మొవ్వు భాగము తడిచేలా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ (3 గ్రా./లీటరు నీటికి) మందు ద్రావణాన్ని పిచికారి చేయాలి.

జీవ నియంత్రణ పద్ధతి: కొబ్బరి మొక్క మొవ్వు భాగములో సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ టాల్క్‌ పొడిని వేయాలి. మొక్క వయస్సును బట్టి సంవత్సరంలోపు మొక్కకు 5 గ్రా., సంవత్సరం మొక్కకు 10 గ్రా. అదే విధంగా 2,3,4,5 మరియు 5 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు గల మొక్కలకు 75, 100, 150, 200 గ్రా. పొడిని వేయాలి. కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు, మొవ్వు భాగము తడిచేలా సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ కల్చర్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలి.

నల్ల మచ్చ తెగులు యాజమాన్యము: కొబ్బరి చెట్టు కాండముపై ఎటువంటి గాయము కలిగించరాదు. ఈ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆ భాగముపై ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని పేస్ట్‌గా తయారుచేసి పూయవలెను (50 గ్రాముల పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్ట్‌ తయారగును).

2. కర్రపెండలంలో నీటి అవసరతను బట్టి 6`10 రోజుల తేడాతో నీటితడి ఇవ్వాలి. మొక్క చుట్టూ మొలిచిన కలుపును కూలీలతో తీయించి, మిగతా కలుపు నివారణకు పవర్‌ వీడర్‌తోగాని నడిచే గొర్రుతోగాని అంతరకృషి చేయాలి. నాటిన 30 రోజులకు ఎకరాకు 8 కిలోల నత్రజని మరియు 8 కిలోల పొటాష్‌ ఎరువులు (17.5 కిలోల యూరియా మరియు 13.5 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) మొక్కకు రెండువైపులా గుంటలో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. పలుచగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి.

3. జీడిమామిడి లేత తోటల్లో భూమి నుండి మీటరు ఎత్తు వరకు ఉన్న క్రింది కొమ్మలను కత్తిరించి ఏపుగా వృత్తాకారంలో పెరిగేటట్లు మొక్కను ట్రైనింగ్‌ చేయాలి. ముదురు తోటల్లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎండుకొమ్మలు, భూమికి ఆనుకొని ఉన్న కొమ్మలు, ఇతర చెట్ల మీదకు పోయిన కొమ్మలు, నీడన ఉన్న కొమ్మలు మొదలగు వాటిని కత్తిరించుకోవాలి. ఇలా చేయడం వలన మొక్కలకు తగినంత సూర్యరశ్మి, గాలి సోకి కొమ్మలు, పూత ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. చెట్ల పాదుల్లో పారతో చెక్కి కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. వర్షాధారపు తోటల్లో పాదులకు మల్చింగ్‌ చేసి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి. ఈ నీరు కొత్త చిగుర్లు రావటానికి మరియు త్వరగా ముదరటానికి ఉపయోగపడుతుంది. పోషక లోపాలు, సూక్ష్మపోషక లోపాలుంటే నీటిలో కరిగే పోషక మిశ్రమాలను (ఫార్ములా`4 లేదా ఫార్ములా`6ను 5 గ్రా. లీటరు నీటికి కలిపి) చెట్టుపై పిచికారి చేసుకోవాలి. చెట్టుకు 1100 గ్రా. యూరియా, 750 గ్రా. సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 200 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌తో పాటు 10 కేజీల కుళ్ళిన పశువుల ఎరువు అందించాలి.

4. మొదటి సంవత్సరం తమలపాకు తోటలలో అవిశ మొక్కల మధ్య సాళ్లను చేసి సాళ్ల మధ్య మట్టిని చెక్కి అవిశ మొదళ్ల వద్దవేసి, కయ్యలు చేసి వాటి వద్ద 5 సెం.మీ లోతు 20 సెం.మీ దూరంలో ఎకరాకు 20,000 తమలపాకు తీగలను ఎన్నుకొని (6 నుండి 8 కణుపులు ఉండేటట్లు) నాటాలి. తీగలను నాటే ముందు 0.5 శాతం బోర్డో మిశ్రమం G 250 పి.పి.ఎం. స్ట్రెప్టోసైక్లిన్‌ (250 మి.గ్రా లీటరు నీటికి) కలిపిన ద్రావణంలో 15`30 నిమిషాలు ముంచి శుద్ధిచేసి (100I20 సెం.మీ. దూరంలో) నాటుకోవాలి. విత్తనపు తీగను ఆరోగ్యవంతమైన తోట నుండి సేకరించాలి. తీగ నాటుటకు ముందే నీరు పెట్టడానికి అదే విధంగా మురుగు నీరు పోయే కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 8`10 మీ. పొడవు సాలుకు ఒక పులక కాలువ ఉండేలా చూసుకోవాలి. అవిశ కాండం తొలుచు పురుగుల నివారణకు దీపపు ఎరలను ఏర్పాటు చేయాలి. రెండవ సంవత్సరం తోటలలో ఆకులు కోసిన తరువాత తీగలను దింపకం చేయాలి.

Turmeric Crop

Turmeric Crop

సుగంధ ద్రవ్య పంటలు:

1. పసుపు విత్తిన పొలములో మొదటి సారి కలుపు తీసి, అంతరకృషి చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలను జూలై 15 లోపు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తినట్లయితే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఆశించే ఆకుమచ్చతెగులు నివారణకు 2.5 గ్రా. మాంకోజెబ్‌ లేదా మెటలాక్సిల్‌ లేదా 2 మి.లీ. ప్రొపికొనజోల్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి.

2. మిరపలో ఎకరానికి 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేటు ఎరువును వేసి పెరిగిన పచ్చి రొట్ట పైరును భూమిలో కలియదున్నాలి. సాలు తోటలు వేయదలచిన వారు ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేటు ఎరువును వేసి, జూలై రెండవ వారంలో ఎకరానికి 2.5 కిలోల విత్తనం చొప్పున గొర్రుతో ఎదబెట్టాలి. మిరపతోపాటు పొలం చుట్టూ 2`3 వరుసలలో జొన్న లేదా మొక్కజొన్నను రక్షక పంటగా విత్తుకోవాలి. అవసరాన్ని బట్టి నారుమళ్ళలో విత్తనం వేసుకోవచ్చు. నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తిన 9 మరియు 15వ రోజున కాపర్‌ ఆక్సీక్లోరైడు (3 గ్రా./లీటరు నీటికి) మందు ద్రావణంతో మళ్ళను తడపాలి.

3. అల్లములో కలుపు తీత మరియు మట్టి ఎగదోయుట కొనసాగించాలి.

Aloe Vera Farming

Aloe Vera

ఔషధ మరియు సుగంధ పంటలు:

1. కలబంద: వేరు పిలకలు లేదా వేరు కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయాలి. కనీసం 15`20 సెం.మీ. పొడవుతో 4`5 ఆకులను కలిగిన పిలకలను 60`95 సెం.మీ. దూరంలో నాటాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. కలుపు తీయాలి.

2. పామరోజా పంటకు ఎకరానికి 20 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలి. నాట్లు వేసుకోవచ్చును.

3. అశ్వగంధ: ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగు చేస్తారు. కనీసం 65`70 సెం.మీ. వర్షపాతం అవసరం. పొడి వాతావరణం సాగుకు అనుకూలం. వర్షపాతం తక్కువగా/సరిపోని యెడల 2`3 సార్లు నీటి తడులు ఇవ్వాలి. ఎకరాకు 6`8 కిలోల విత్తనం సరిపోతుంది. వీటిని కనీసం 5 రెట్లు ఇసుకతో కలిపి విత్తుకోవాలి. వరుసలలో నాటటం అంత లాభసాటి కాదు. వెదజల్లడం వలన మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. తద్వారా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. నేరుగా విత్తినపుడు 20`25 రోజుల తరువాత మొక్కలను పలుచన చేయాలి. కలుపు తీయాలి.

4. కోలియస్‌: నాటుటకు ఆఖరు దుక్కిలో ఎకరాకు 5`6 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్‌ వేసుకుని వేరు తొడిగిన కొమ్మ కత్తిరింపులను 45I45 సెం.మీ. దూరంలో నాటుకోవాలి.

5. నిమ్మగడ్డి: పిలకల ద్వారా వరుసల మధ్య 60 సెం.మీ. మరియు పిలకల మధ్య 45 సెం.మీ. దూరంలో ప్రధాన పొలంలో నాటుకోవాలి. మొక్కలు పడిపోకుండా మొక్కల మొదళ్లలో మట్టిని ఎగదోసి గట్టిగా నొక్కాలి. నాటిన వెంటనే నీరు కట్టి, తర్వాత 2`3 రోజుల కొకసారి క్రమం తప్పకుండా నెల రోజుల వరకు నీరు పెట్టాలి.

6.పిప్పలిని కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. 5 కణుపులున్న ముక్కలను పాలీథీన్‌ సంచుల్లో నాటుకొని వేర్లు వచ్చిన తరువాత వీలైనంత వరకు వర్షాకాలంలో నాటుకోవాలి. ఎకరానికి సుమారు 11,000 మొక్కలు (60I60 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి) అవసరం. ఏక పంటగా సాగు చేసే యెడల త్వరగా పెరిగి నీడనిచ్చే చెట్లను 4`5 నెలలు ముందుగా నాటితే మంచి నీడ మరియు ఆధారం దొరుకుతుంది. నాటిన తొలి రోజుల్లో వర్షం లేకపోతే వారానికొకసారి నీరు పెట్టాలి. బాగా ఎదిగిన తరువాత 10 రోజులకొకసారి నీరు పెట్టాలి.

Also Read: July Month Animal Protection: జూలైమాసంలో పాడి, జీవాల సంరక్షణలో చేపట్టవలసిన చర్యలు.!

Leave Your Comments

Questions to Ask Farmers: రైతన్నకో ప్రశ్న..

Previous article

Agriculture: భారతదేశంలో వ్యవసాయం లాభమా? నష్టమా?

Next article

You may also like