వ్యవసాయ వాణిజ్యం

Agriculture: భారతదేశంలో వ్యవసాయం లాభమా? నష్టమా?

2
Agriculture
Agriculture - Profit

Agriculture: ఒకప్పుడు భారతదేశానికి వెన్నెముక రైతు అని చెప్పేవారు కానీ రాను రాను అదే రైతు పట్టణాలకు పోయి కూలిగా మారుతున్నాడు లేదా తమ పిల్లలు పెద్దవారు అయి ఉద్యోగులుగా ఉంటే వారి చెంతకు చేరి సేద తీరుతున్నారు. చాలా గ్రామాల్లో పొలం సాగు చేసేవారు లేక కవులు దారులకు ఎంతో కొంతకు పొలాన్ని ఇచ్చి సాగుకు దూరం అవుతున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా వ్యవసాయం అంత కష్టంతో కూడిన నష్టమా? కానీ కొద్దిమంది రైతులు వ్యవసాయం చాలా లాభమని చేసి చూపిస్తున్నారు.

చాలా రంగాలలో అవసరాలకు తగినట్లుగా కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి, ఆవిష్కరణలతో ఆ రంగాల్లో దిన దినాభివ్రుద్ది చెంది అధిక లాభాలతో దూసుకు పోతున్నాయి. కానీ వ్యవసాయ రంగంలో మాత్రం ఆవిష్కరణలు ఎన్ని వచ్చినా వాటి వినియోగం తెలియక లేదా ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతుల ఉన్నటువంటి మన భారతదేశంలో ఆవిష్కరణలు అధిక ఖర్చుతో కూడుకుని వుండటం వల్ల అవి రైతుకు అంతగా ఉపయోగపడటం లేదు. కానీ వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతుల ద్వారా కొద్దిమంది ఆదర్శ రైతులు అద్భుతమైన ఫలితాలను అందుకుంటున్నారు.

మీరందరూ వ్యవసాయంలోని సాంకేతికతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాలను, అలానే ప్రైవేటు రంగ ప్రోత్సాహాలను అందిపుచ్చుకొని ఆధునిక యంత్రాలను, యంత్ర పరికరాలను సమకూర్చుకొని అధిక పంట దిగుబడిన పొంది తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొంది పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read: July Gardening Works: జూలై మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన పనులు మరియు సూచనలు.!

Agricultural Market

Agriculture

ప్రస్తుతం వ్యవసాయరంగలో నడుస్తున్న విప్లవం ఖీూూ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌) అనే విధానం. కొద్ది మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడి ఒక సంస్థను స్థాపించుకొని దాని ద్వారా సాగుకి కావాల్సిన అన్నిటినీ సమకూర్చుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమిని సాగు చేసి వచ్చిన పంటను తగిన ధరకు అమ్ముకొని లాభాలను పంచుకోవడం అనే భావన. ఈ ఖీూూ పూర్తిగా ఒక వ్యాపార సరళతో కొనసాగించే సంస్థ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి.

ప్రతి రైతు దీని గురించి తెలుసుకొని ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తో పాటుగా పలు ప్రైవేట్‌ సంస్థలైన సమన్నతి లాంటి అనేక కంపెనీలు పలు రకాల ప్రోత్సాహాలను అందించడమే కాకుండా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను, అధునాతన వ్యవసాయ ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తూ రైతులు ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అంటే పెరుగుతున్న జనాభా అవసరాలకు మారుతున్న ఆహారపు అలవాటులకు తగినట్లుగా పలు రకాల పంటలను పండిరచడానికి అనువైన అనుకూలతలను కల్పిస్తున్నాయి.

ఒక్కసారి ఒక మంచి ఫలితాలను రాబడితే పొలం దగ్గరికే వ్యవసాయానికి సంబంధించిన కార్పోరేట్‌ సంస్థలన్నీ వచ్చి వారి వారి సేవలను ఉత్పత్తులను నేరుగా రైతులకు అందజేస్తున్నాయి. ఎక్కడైతే  లాభాల్లో మంచి మేనేజ్మెంట్‌తో నడుస్తుందో అలాంటి వాటికి రుణానికి లేదా వ్యవసాయ సమాచారానికి ఎటువంటి కరువు ఉండదు. రైతు ఒక్కడిగా చేయలేనిది తమ తమ గ్రామాల్లో లేదా తమ మండలాల్లో వారి ఆలోచనలు తగినటువంటి వారిని ఎంచుకొని ఒక మంచి ఆలోచనతో, అవగాహనతో కలసిమెలసి తగిన పంటలను పండిస్తే మిగతా రంగాలకి ధీటుగా అధిక లాభాలతో కూడిన సాగు చేయవచ్చు. ఇలాంటి ఆధునిక పద్ధతుల ద్వారా రైతు వ్యవసాయం చేస్తే రైతుకి ఎప్పటికీ వ్యవసాయం లాభదాయకమే అవుతుంది.

Also Read: Questions to Ask Farmers: రైతన్నకో ప్రశ్న..

Leave Your Comments

July Gardening Works: జూలై మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన పనులు మరియు సూచనలు.!

Previous article

Drumstick Farming Techniques: మునగ సాగులో మెళకువలు.!

Next article

You may also like