ఈ నెల పంట

Humus Importance in Soil: నేలలో హ్యూమస్ ప్రాముఖ్యత.!

0
Humus
Humus

Humus Importance in Soil: హ్యూమస్ అనేది మట్టిలో ముదురు రంగులో ఉండే సేంద్రీయ పదార్థం. ఇది మొక్క మరియు జంతు పదార్థాలు కుళ్ళిపోవడం ద్వారా ఏర్పడుతుంది. ఇది అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు నేలలో తేమను నిలుపుకుంటుంది. నేల భౌతిక రసాయన మరియు నేల యొక్క జీవ లక్షణాలపై హ్యూమస్ ప్రభావం గురించి తెలుసుకుందాం.

Humus Importance in Soil

Humus Importance in Soil

Also Read: Rodents Management in Agriculture: పంట పొలాల్లో ఎలుకల ను రైతులు ఇలా నియంత్రిచండి.!

హ్యూమస్ యొక్క ప్రాముఖ్యత
నేల భౌతిక, జీవ మరియు రసాయన లక్షణాలపై హ్యూమస్ / ఆర్గానిక్ పదార్థం ప్రభావం
1. మొదటిగా ఇది నేలకు ముదురు రంగును ఇస్తుంది
2. నేల కణాలను బంధించి కంకర ఏర్పడటానికి కావాల్సిన పాలీశాకరైడ్‌లను సరఫరా చేస్తుంది
(మంచి నేల నిర్మాణానికి తోడ్పడుతుంది)
3. నేలలో ఉండే సూక్ష్మరంధ్రాలలోకి నీటి చొరబాటు రేటును పెంచుతుంది మరియు మెరుగైన డ్రైనేజీని అందిస్తుంది.
4. నేలకు నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది.
5. మట్టి నేలల్లో ప్లాస్టిసిటీ, సంయోగం, జిగట మొదలైనవాటిని తగ్గిస్తుంది.
6.ఇది బల్క్ డెన్సిటీని తగ్గిస్తుంది కావున సచ్ఛిద్రత (పోరొసిటి) అనుకూలంగా పెరుగుతుంది.
7 .గ్రాన్యులేషన్ ద్వారా, నేలలో గాలి సరఫరా కూడా మెరుగుపడుతుంది.
8. ఇది నేలకు మల్చింగ్ లా పనిచేస్తుంది (ముడి సేంద్రీయ పదార్థం) మరియు వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇది ఇంసులేటర్ గా పనిచేసి వాతావరణం మరియు నేల మధ్య ఉష్ణ కదలికను తగ్గిస్తుంది.
9 .ఇది సేంద్రియ ఆమ్లాలను మరియు CO2ను విడుదల చేయడం ద్వారా నేలలోని క్షారన్ని తగ్గిస్తుంది.
10. దీనికి శోషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఖనిజాల నేలల్లో శోషణ శక్తి 30 -90% వరకు ఉంటుంది. (కార్బాక్సిలిక్ సమూహం – 54% ; ఫినోలిక్ & ఎనోలిక్ సమూహాలు – 36%; ఇమైడ్ సమూహం – 10%)
11. ఇది బఫరింగ్ ఏజెంట్‌గా పనిచేస్తూ యాసిడ్‌లు మరియు ఆల్కాలీల వలన కలిగె నష్టాన్ని తగ్గిస్తుంది.
12. దాని ద్రావణీయత ప్రభావం వలన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
13. ఇది అనేక పోషకాలకు స్టోర్ హౌస్‌గా పనిచేస్తుంది. సారవంతంగా లేని నేలలలో 90-95% నత్రజని సేంద్రీయ పదార్థాల ద్వారా అందుతుంది. మరియు ఇది P,S మరియు Fe, Mn, Cu ,Zn వంటి సూక్ష్మ పోషకాలను కూడా సరఫరా చేస్తుంది.
14.నీటిలోని హెవీ మెటల్లను తాత్కాలికంగా గ్రహించి కలుషిత నీటిని శుభ్రపరుస్తుంది.
15. నేలల్లోని స్థూల మరియు సూక్ష్మ జీవులకు శక్తిని మరియు నేలలో జరిగే వివిధ ప్రయోజనకరమైన ప్రక్రియలను నిర్వహించడానికి సహాయపడుతుంది. (N – స్థిరీకరణ, ఖనిజీకరణ మొదలైనవి)
16. ఇది చెలేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తూ సూక్ష్మ పోషకాల లభ్యతను మెరుగుపరుస్తుంది.
17.సేంద్రీయ పదార్ధాలు కుళ్ళిపోయే సమయంలో విటమిన్లు, యాంటీబయాటిక్స్ మరియు పెరుగుదలను ప్రోత్సహించే ఆక్సిన్‌ వంటి పదార్థాలు ,వివిధ సేంద్రీయ పదార్థాలు మొదలైనవి సూక్ష్మ జీవులచే ఉత్పత్తి చేయబడుతుంది. అలాగే కొన్ని శిలీంధ్రాలకు సంబంధిత టాక్సిన్ ల ఉత్పత్తి వలన వ్యాధులను నియంత్రిస్తుంది.

Also Read: Management of Acidic Soils: ఆమ్ల నేలల నిర్వహణ

Leave Your Comments

Rodents Management in Agriculture: పంట పొలాల్లో ఎలుకల ను రైతులు ఇలా నియంత్రిచండి.!

Previous article

Role of Calcium in Plants: మొక్కల ఎదుగుదలలో కాల్షియం పాత్ర.!

Next article

You may also like