మన వ్యవసాయం

యాసంగికి ప్రత్యామ్నాయం మక్కలే

0
corn crop
Maize Farming

telangana farmers should focus on corn crop యాసంగి పంట కొనుగోలుపై రైతులు ఓ క్లారిటీకి వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ తేల్చేసిన క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. వడ్లకు ప్రత్యామ్నాయంగా మక్క సాగు మంచిదని వ్యవసాయ నిపుణులు చెప్తున్న మాట. యాసంగిలో మక్కలు వేసేలా ప్రోత్సహించాల్సిన అవసరముందని వారు చెప్తున్నారు. అందులో భాగంగానే Telangana రైతన్నలు మక్కలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు. నిరుడు ఈ సీజన్‌‌లో 68.14 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. యాసంగిలో వరి సాధార ణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు కాగా, నిరుడు రికార్డు స్థాయిలో ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వేశారు.

corn crop

Corn Crop ఇక మక్కలు సాగు చేస్తే.. రైతులకు రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది. మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా పశువులకు మేతగా, ముడిసరుకుగానూ ఉపయోగపడుతుంది. గింజల నుంచి స్టార్చ్, గ్లూకోస్, సుక్రోస్, డెక్త్రీన్స్ సెల్యులోస్, గమ్స్ తయారు చేస్తారు. గింజల నుంచి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారు చేస్తారు. బేకింగ్ పౌడర్ల తయారీలో, విస్కీ తయారీలోనూ, ఇతర ఉత్పత్తుల్లో మక్కలు ఉపయోగపడుతాయని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటున్నరు. ఇక మొక్కజొన్నకు ఎక్కువ వర్షపాతం కూడా అవసరం పడదు. యాసంగిలో తక్కువ సమయంలో అధిక దిగుబడి పొందవచ్చు. నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతివున్న ఎర్రనేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో మొక్కజొన్న సాగు చేయొచ్చు. ఎకరా వరిసాగుకు అవసరమయ్యే నీటితో రెండు ఎకరాల మొక్కజొన్న సాగుచేయవచ్చు.

corn crop

అయితే మొక్కజొన్నను రెండు సార్లు వరుసగా వేయరాదు. పంట మార్పిడి పద్ధతులు పాటించాలి. పంట మార్పిడి చేయడం వల్ల దిగుబడి ఎక్కువగా ఉండటం, తెగుళ్లు సోకే అవకాశాలు తక్కువ ఉంటాయి.కాగా పంట వేసే ముందు భూమిలో ఎకరానికి 10 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా కంపోస్టు ఎరువులు వేసి నేల మొతాన్ని ట్రాక్టర్ తో కలియదున్నాలి. కలుపును కొంతవరకు నిర్మూలించడానికి మరియు నేల వదులు కావడానికి కల్టివేటర్ తో 2-3 సార్లు నేల మొత్తం దమ్ము చెయ్యాలి. అనంతరం విత్తనం విత్తే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విత్తనం వేసేటప్పుడు సాలుల మధ్య కనీస దూరం 30-45 సే.మీ మరియు సాలు విత్తనాల మధ్య 20-25 సే.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనంతోపాటు పైపాటుగా యూరియాను వేసుకోవాలి. Telangana Agriculture

Leave Your Comments

పలు పంటలలో సమగ్ర సస్య రక్షణ మరియు పోషక యాజమాన్యం

Previous article

PJTSAU లో అంతర్జాతీయ మృత్తికా దినోత్సవ కార్యక్రమం

Next article

You may also like