పట్టుసాగుమన వ్యవసాయం

Application of insecticides in cowpea based on the colors indicated on the pesticide canister : శనగలో పురుగు మందుల డబ్బాపై సూచించే రంగుల ఆధారంగా పురుగు మందుల వాడకం

0

విషపూరిత ప్రభావం ఆధారంగా ఉపయోగించే పురుగు మందులు నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి పురుగు మందుల డబ్బాపై త్రిభుజాకారం కలిగి విషపూరిత ప్రభావాన్ని సూచించే రంగును కలిగి ఉంటాయి.
.  మొదటిది 90 శాతం విషపూరిత పురుగు మందులు. ఇవి ఎరుపు రంగు త్రిభుజాకారం గుర్తు కలిగి అత్యధిక విషపూరితం కలిగి ఉంటాయి.
.  రెండవది 70 శాతం విషపూరిత పురుగు మందులు. ఇవి పసుపు రంగు కలిగి ఎక్కువ విషపూరితం కలిగి ఉంటాయి.
.  మూడవది 50 శాతం విషపూరిత పురుగుమందులు. ఇవి నీలిరంగు కలిగి సాధారణ విషపూరితం కలిగి ఉంటాయి.
.  నాల్గవది 30 శాతం విషపూరిత పురుగు మందులు. ఇది ఆకుపచ్చ రంగును కలిగి తక్కువ విషపూరితంగా కలిగి ఉంటాయి. పైన సూచించిన విధంగా శనగలు చీడపీడల నివారణకు ఈ క్రింది పురుగు, తెగుళ్ల మందులను వినియోగించాలి.


వేరు కుళ్ళు :
పురుగు మందు డబ్బాపై త్రిభుజాకారం గుర్తు కలిగిన నీలిరంగు సూచించే కాపరాక్సీ క్లోరైడ్‌ మూడు గ్రాములతో పాటు ప్లాంటామైసిన్‌ 0.1 గ్రాములు లీటరు నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు.
పురుగు మందుల డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన ఆకుపచ్చ రంగుతో తక్కువ విషపూరితమందు అయిన కార్బండాజిమ్‌ G మ్యాంకోజెబ్‌ 2.5 గ్రాములు లీటర్‌ నీటిని కలిపి చేసుకోవచ్చు.


ఎండు తెగులు :
పురుగు మందుల డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన నీలిరంగు సూచించే సాధారణ విషపూరిత మందు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మూడు గ్రాములు G ప్లాంటామైసిన్‌ 0.1 గ్రా. నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు.
పురుగు మందు డబ్బాపై త్రిభుజాకారం గుర్తు కలిగిన సాధారణ విషపూరిత మందు అయిన నీలిరంగు సూచించే టెబ్యుకొనజోల్‌ ఒక మిల్లీ లీటరు నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
మొదలు కుళ్ళు తెగులు :
పురుగు మందు డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన తక్కువ విషపూరిత ప్రభావం గల ఆకుపచ్చ రంగు సూచించే కార్బన్‌డిజం G మ్యాంకోజెబ్‌ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు.


ఆకు ఎండు తెగులు :
పురుగు మందు డబ్బాపై త్రిభుజాకార గుర్తుకలిగిన సాధారణ విషపూరిత నీలిరంగు సూచించే హెక్సా 2.0 మి.లీ.తో పాటు కాప్టాన్‌ 3 గ్రా. లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
తుప్పు తెగులు :
సాధారణ విషపూరిత నీలిరంగు సూచించే ప్రోపికొనజోల్‌ ఒక మిల్లీ లీటరు నీటి కలిపి పిచికారి చేసుకోవాలి.  పురుగుమందు డబ్బాపై త్రిభుజాకారం గుర్తు కలిగిన ఆకుపచ్చ రంగుతో  తక్కువ విషపూరిత మందు అయిన కార్బండిజమ్‌ G మ్యాకోజెబ్‌ 2 గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు.


మైనటువంటి ఆకుపచ్చ రంగును సూచించే పురుగుమందులు ఎంచుకోవాలి ఒకవేళ ఈ మందులు అందుబాటులో లేకపోతే సాధారణ విషపూరితమైనటువంటి నీలిరంగు సూచించే పురుగుమందులు ఎంచుకోవాలి వీలైనంతవరకు ఎక్కువ విషపూరితంగా పసుపు రంగు అత్యధిక విషపూరిత గల ఎరుపు రంగు సూచించే పురుగుమందుల వాడకం తగ్గించి తక్కువ  విషపూరితమైనటువంటి ఆకుపచ్చ రంగును సూచించే మందులనే వాడుకోవాలి.
దీనివలన గాని భూమి కాలుష్యం కూడా తగ్గించుకోవచ్చు అలాగే అధిక విషపూరిత పురుగు మందులు పిచికారి చేయడం వలన రైతుకు వచ్చే సమస్యలు ఆరోగ్యానికి హానికాకుండా చూసుకోవాలి. వీలైనంతవరకు విషపూరిత పురుగు మందులు తగ్గించి వివిధ రకాల చీడపీడనం పంటలను ఆశించి నష్టపరచకుండా రైతులు ముందస్తుగానే ఈ చీడపీడల పై దృష్టిని సాధించి అధిక దిగుబడులు సాధించాలి డాక్టర్‌ కే రాజశేఖర్‌ మోహన్దాస్‌ శివ చరణ్‌ సునీల్‌, శేషాద్రి ప్రవీణ్‌ కుమార్‌ కెవికె ఆదిలాబాద్‌

Leave Your Comments

Nut borer pest in chilli – comprehensive management practices : మిరపలో కాయ కుళ్ళు తెగులు – సమగ్ర యాజమాన్య పద్ధతులు

Previous article

Dairy And Animal Care In January: ‘‘జనవరి మాసంలో పాడి మరియు జీవాల సంరక్షణలో చేపట్టవలసిన చర్యలు`యాజమాన్య పద్ధతులు’’

Next article

You may also like