పట్టుసాగు

Mulberry Cultivation: వర్షాధారిత  పరిస్థితులలో మల్బరీ సాగు

0
Mulberry Farming
Mulberry Farming

Mulberry Cultivation:

వర్షాధార పరిస్థితులలో నాటడం: మల్బరీని  తేమ తక్కువగా ఉన్న పరిస్థితులలో  (అర్థ -శుష్క లేదా వర్షాధారం) మరియు నీటిపారుదల పరిస్థితులలో సాగు  చేయవచ్చు. వర్షాధార పరిస్థితిలో, వార్షిక వర్షపాతం పరిమితంగా  (<700 మిమీ) ఉన్నప్పుడు మల్బరీ మొక్కలు నిజమైన నీటి ఎద్దడిని  అనుభవిస్తాయి.

Mulberry Farming

Mulberry Farming

దక్షిణ భారతదేశంలోని దాదాపు 1/3వ వంతు మల్బరీ ప్రాంతం ఈ వర్గానికి చెందినవి.అటువంటి పరిస్థితులలో  సాధారణంగా, దిగుబడి మరియు ఆకు నాణ్యత తక్కువగా ఉంటుంది. వర్షాధార పరిస్థితులలో ఆకు దిగుబడి మరియు నాణ్యత రెండింటిని మెరుగుపరచడం కోసం కేంద్ర పట్టు బోర్డు అభివృద్ధి చేయబడిన ప్రత్యేక యాజమాన్య పద్ధతులు.

  1. ఎర్ర లోమీ నేలల్లో s-13 మరియు నల్ల రేగడి నెలల్లో  S-34 వంటి అధిక దిగుబడినిచ్చే రకాలను ఉపయోగించడం.
  2. తోటల పెంపకం ప్రారంభ దశల్లో మెరుగైన ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.
  3. నేలలోని తేమ పరిరక్షణ పద్ధతులు అవలంభించాలి.
  4. సకాలంలో సస్యరక్షణ చర్యలు అవసరం.
  5. భూమి ఎంపిక మరియు భూమి తయారీ.

చదునైన లేదా కొద్దిపాటి వాలు  ఉండే భూమి అనుకూలంగా ఉంటుంది.

మరింత  నిటారుగా ఉన్న భూములకు సరైన భూమి ఆకృతి అవసరం.

Also Read: నూతన పద్ధతిలో మల్బరీ మొక్కల పెంపకం

Mulberry Cultivation

Mulberry Cultivation

నాటడం:

గుంత పద్దతిలో నాటుటకు 90 x 90 సెంటీమీటర్ల ఎడం పాటించాలి. అలాగే మట్టి మరియు FYM (2 కిలోల / పిట్) మిశ్రమమును గుంతలలో నింపుటకు ఉపయోగించాలి.

కటింగుల ఎంపిక : 4 నెలల వయస్సు గల మొక్కలు నాటుట సిఫాహారసు చేయడమైనది.

ఇతరులు:

మొక్కలు పూర్తి ఎదుగుదలకి ముందు కోయరాదు. దిగుబడి ఒక సంవత్సరం వయసు గల మొక్కల నుండి మాత్రమే తీసుకోవాలి.

మొదటి కత్తిరింపు తదుపరి వర్షాకాలంలో జరుగుతుంది.

స్థాపించబడిన సంవత్సరంలో ఒక ఎకరాకు 25:25:25 kg NPK మరియు 2వ సంవత్సరం నుండి 50:50:50kg NPK వేసుకోవాలి.

Mulberry Cultivation and Silkworm Farming

Mulberry Cultivation and Silkworm Farming

ఋతుపవనాల ప్రారంభం అయినా వెంటనే  మల్బరీ చెట్ల కాండం మొదలు దగ్గర కత్తిరించాలి.

కత్తిరింపు చేసిన 10-15 రోజులలోపు ఎకరాకు 10 టన్నుల సేంద్రియ ఎరువును వేసుకోవాలి.

నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నీటి సంరక్షణ కొరకు ఉలవలు లేదా  పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి.

కత్తిరింపు చేసిన  దాదాపు 2 ½ నెలల తర్వాత మాత్రమే  ఆకు కోయు పద్ధతి ద్వారా మొదటి పంట ఆతరువాత రెండు నెలలకు రెండవ పంట తీసుకోవొచ్చు. మొత్తం 6 ఆకు కోతలు 2 నెలల విరామంతో తీసుకోవొచ్చు.

రెండవ సంవత్సరంలో సుమారుగా ఆకు దిగుబడి 7 – 8 MT/హెక్టార్ మరియు మూడవ సంవత్సరం  నుండి 10 – 12 MT/ha వరకు దిగుబడి ఆశించవచ్చు.

Also Read: మల్బరీ సాగు, పట్టు పరుగుల పెంపకం

Leave Your Comments

Rose Cultivation in Green Houses: హరిత గృహాలలో గులాబి సాగు.!

Previous article

Honey Hive Management: వివిధ  కాలాలలో తేనెటీగల యాజామాన్యం

Next article

You may also like