పట్టుసాగు

Techniques in Mulberry Cultivation: మల్బరీ సాగులో మెళకువలు.!

0
Mulberry Cultivation
Mulberry Cultivation

Techniques in Mulberry Cultivation: మల్బరీ సాగులో ముఖ్యమైననవి రకాల పంపిక. రైతులు తమ అవసరానికి తగ్గట్టుగా రకాలను పంపిక చేసుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం గలదు. ముందుగా ముఖ్యమైన రకాల గురించి తెల్సుకుందాం. నీటి వసతి గల ప్రాంతాలకు, నీటి వసతి లేని ప్రాంతాలకు మరియు ప్రత్యేక పరిస్థితులకు సరిపడే రకాలు.

నీటి వసతి వున్న ప్రాంతాలకు అనుకూలమైన రకాలు:
వి1: తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న రకము. ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో తళతళలాడుతూ ఉంటాయి. దిగుబడి పకరాకు 30`24 టన్నులు సంవత్సరానికి వస్తుంది.
పస్‌ 36 : చాకీ పెంపకానికి అనుకూలం. ముదురు ఆకుపచ్చ రంగు కల్గిన ఆకులు ఉంటాయి. పకరానికి 16 టన్నులు  సంవత్సరానికి దిగుబడి వస్తుంది.
పస్‌ 30 : ఆకులు చాకీ మరియు పెద్ద పురుగుల పెంపకానికి అనువైనది. ఆకులు పడవ ఆకారంలో ముదురు ఆకుపచ్చరంగులో ఉంటాయి. దిగుబడి 16 టన్నులు సంవత్సరానికి వస్తుంది.
ఆర్‌. పస్‌. పస్‌. ` 175 : ఈ రకంలో ఎక్కువ తేమశాతం కల్గి. పక్కువ సమయం నీటిని నిల్వ ఉంచుకుంటుంది. దిగుబడి 18 టన్నులు  సంవత్సరానికి దిగుబడి వస్తుంది.

నీటి వసతి లేని ప్రాంతాలకు అనుకూలమైన రకాలు :
అనంత : చాకీ మరియు పెద్ద పురుగుల పెంపకానికి అనుకూలం. దిగుబడి 24టన్నులు  సంవత్సరానికి వస్తుంది.
పస్‌ ` 18 : దక్షిణాది రాష్ట్రాలలో గల పర్రనేలలకు అనుకూలం. దిగుబడి పకరానికి 5.2 ` 6.4 టన్నులు సంవత్సరానికి వస్తుంది.
ఆర్‌.సి ` 1 : సాధారణ నీటి లభ్యతలో 50% శాతం మేర తక్కువైన తట్టుకోగలదు. సిఫారసు మొతాదులో 50 శాతం మేర పరువులు తగ్గించిన తట్టుకునే రకం. దిగుబడి 9`10టన్నులు సంవత్సరానికి వస్తుంది.
ఆర్‌.సి ` 2 : తక్కువ నీటి వసతి గల ప్రాంతాలకు సిఫారసు చేయబడిన రకము. దిగుబడి 8`9 టన్నులు  సంవత్సరానికి వస్తుంది.

Techniques in Mulberry Cultivation

Techniques in Mulberry Cultivation

ప్రత్యేక పరిస్థితులకు అనువైన రకాలు :
సహన : నీడను తట్టుకునే రకము. కొబ్బరి తోటల్లో అంతర పంటగా పండిరచవచ్చును. దిగుబడి 10`13 టన్నులు సంవత్సరానికి వస్తుంది.
ఎ.ఆర్‌ ` 12 : ఎక్కువ క్షార నేలలకు అనుకూలం. (ఉదజని నుండి 9.5 వరకు) దిగుబడి 10 టన్నులు సంవత్సరానికి వస్తుంది.
జి ` 2 : చాకీ పురుగుల పెంపకానికి అనుకూలం. ఎరన్రేలలకు అనుకూలం. దిగుబడి 15టన్నులు సంవత్సరానికి వస్తుంది.
జి`4 : దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సిఫారసు చేయబడిన వంగడం. ఆకులు ఉపరితలం అలలుగా ఉంటుంది. దిగుబడి 26 టన్నులు  సంవత్సరానికి వస్తుంది.
మైసూర్‌`5 : వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. దిగుబడి 12`14 టన్నులు  సంవత్సరానికి వస్తుంది.

నీటి యాజమాన్య పద్థతులు :
కాలువలు పద్ధతి : కాలువలో నీరు పారించినప్పుడు రెండు వైపుల బోదెలు తడచి మొక్కలకు నీరు అందుతుంది. వర్షాకాలంలో, ఈ కాలువలే నీటిని తీసివేయటానికి కూడా ఉపయోగపడుతాయి. నీతి వసతి గల ప్రాంతాలలో ఈ పద్ధతిని అనుసరించవచ్చును.

బిందు సేద్యం :
నీటి వసతి తక్కువ గల ప్రాంతాలలో ఈ పద్ధతి ప్రయోజనకారిగా ఉంటుంది.

డ్రమ్‌ కిట్‌ విధానం : కరువు ప్రాంతాల్లో నీటి పారుదల లేని సమయంలో మల్బరీ తోటను తుక్కువ వ్యయంతో నిర్వరించే సూక్ష్మ నీటి పారుదల సాంకేతిక విధానం. రోజుకు 1000లీ. నీరు లభించే ప్రాంతాల్లో ఈ విధానం ద్వారా 680 మల్బరీ మొక్కలకు రోజు మార్చి రోజు 2 ` 2.5 లీటర్ల నీటిని సులభంగా అందించవచ్చును.

Also Read: New Agriculture Technology: ప్రస్తుతం తెలుగు రాష్ట్రలలో అవలంబిస్తున్ననూతన వ్యవసాయ విధానాలు.!

ఒక లీటరు పత్తులో డ్రమ్‌ను ఉంచడానికి దాని నుంచి ప్లాస్టిక్‌ పైపులకు వేరు అందించాల్సిన స్థలంలో అమర్చుకోవాలి. పైపుల చివర్లలో నీటిని బయటికి అందించే ఎమిటర్స్‌ను అమర్చడం ద్వారా నీటిని అందించవచ్చును. 8/8 అడుగుల స్థలాంతరం గల మల్బరీ తోటల్లో ఈ విధానం ద్వారా కూలీల సమస్య, విద్యుత్‌ కోరత, నీరు, పోషకాల కొరతను కూడా సమర్థవంతంగా పరిష్కరించవచ్చును.

Silkworms

Silkworms

పురుగుల యాజమాన్యం
భూసార పరిరక్షణకు పశువుల పరువు 8 టన్నులు / పకరాకు (6 ట్రాక్టర్లు) సంవత్సరానికి 4 విడతలుగా వేయాలి. అధే చాకీ తోట అయితే 16 టన్నులు వేయాలి.

రసాయనికి పరువులు : నారు మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత ఎకరాకు 20 : 20: 20కి నత్రజని : భాస్వరము : పొటాష్‌ ఇవ్వటం ఉత్తమమైన పద్ధతి.
నీటి వసతి వున్నచోట పరువులు (కిలోలు / ప / సం॥)
నత్రజని : భాస్వరం : పొటాష్‌ 120 : 48 : 48
మొదటి సారి ఆకు కోసిన తర్వాత 24 : 24 : 24
రెండవ సారి ఆకు కోసిన తర్వాత 24 : 0 : 0
మూడవ సారి ఆకు కోసిన తర్వాత 24 : 24 : 24
నాలుగవ సారి ఆకు కోసిన తర్వాత 24 : 0 : 0
ఐదవ సారి ఆకు కోసిన తర్వాత 24 : 0 : 0
నీటి వసతి లేని చోట పరువులు (కిలోలు / ప / సం॥)
నత్రజని : భాస్వరం : పొటాష్‌ 40 : 20 : 20
జూన్‌ ` ఆషష్టు 20 : 20 : 20
సెప్టెంబర్‌ ` నవంబర్‌ 20 : 0 : 0

గమనిక : రసాయన పరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ వుండాలి. నత్రజని కొరకు యూరియాకు వేయడం మంచిది కాదు. దీని వలన క్షారగుణమున్న వేలల్లో ఎక్కువ నత్రజని నష్ట జరుగుతుంది. తక్కువ మినరలైజేషన్‌ ఉంటుంది. అందుచేత అమ్మోనియం సల్ఫేట్‌ రూపంలో ఇచ్చిన పడల దీనిలో ఆమ్ల గుణం వల్ల భూమి యొక్క ఉదజని సూచిక తగ్గుతుంది.
మల్బరీ మొక్కలకు కావల్సిన పోషకాలను సమతుల్య పద్థతిలో అందుబాటులోనికి తీసుకురావడానికి పోషణ ద్రావణం అందుబాటులో ఉంటుంది. దీనిని మల్బరీ ఆకులపై పిచికారి చేయడం ద్వారా మల్బరీ అకు దిగుబడిని పెంచవచ్చును. ఒక పకరా మల్బరీ తోటకు ఒక లీటరు పోషణ ద్రావణాన్ని పిచికారి చేయాలి.
మల్బరీ మొక్కలు ఫ్రూనింగ్‌ చేసిన 25`30 రోజుల్లో ఆకులు తడిచేలా పిచికారి చేయాలి. పోషణ ద్రావణాన్ని ఒక పంటకు ఒక పిచికారి మాత్రమే సిపారసు చేయటం జరిగింది.

జీవన పరువుల వాడకం :
నత్రజనిని స్థిరీకరించు అజటోబాక్టర్‌, అడోస్ఫైరిల్లాలకు పకరానికి 80 కిలోలు / సం॥ వాడిన మంచి దిగుబడులు పొందవచ్చును. వీటిని ప్రతి పంటకు 1.6 కిలోలు, 50 కిలోల మగ్గిన పశువుల ఎరువులో కలిపి తోట కత్తిరించిన 20`25 రోజుల తర్వాత వేయాలి. దీని వలన రసాయన పరువుల మోతాదును 20 ` 30 శాతము వరకు తగ్గించుకోనవచ్చును.

వర్మి కంపోస్ట్‌ : ఒక టన్ను వర్మికంపోస్ట్‌లో 15`30 కిలోల నత్రజని, 10`20 కిలోల భాస్వరము, 11`18 కిలోల పొటాష్‌ లభిస్తుంది. సూక్ష్మ పోషకాలైన ఇనుము, మాంగనీసు, రాగి, బోరాన్‌ మరియు ద్వితీయ పోషకాలైన గంధకము, కాల్షియం, మెగ్నీషియం తగు మోతాదులో లభిస్తాయి. వర్మీకంపోస్ట్‌ 1`1.5 టన్నులు ఒక పకరానికి వేయటం మంచిది.
మిగతా మెళకువలు తదుపరి మాసంలో తెల్సుకుందాం..

Also Read: Nematodes in Commercial Vegetables: కూరగాయ పంటలనాశించే నులిపురుగులు సమగ్ర సస్యరక్షణ చర్యలు.!

Suggested Video:

Recommend Video:

Leave Your Comments

Nematodes in Commercial Vegetables: కూరగాయ పంటలనాశించే నులిపురుగులు సమగ్ర సస్యరక్షణ చర్యలు.!

Previous article

Precautions of Paddy Crop: అకాల వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Next article

You may also like